Guppedantha Manasu 7 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 డిసెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 627 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతితో మాట్లాడుతూ ఉంటుంది వసుధార. ఎప్పుడూ మీ కొడుకుకే మీరు సపోర్ట్ చేస్తారు అని అంటుంది. ఇంతలో రిషికి మీ ఇష్టం సార్.. మీకు నచ్చిందే తీసుకోండి అని మెసేజ్ చేస్తుంది. ఇదేంటి నాకు నచ్చింది తీసుకోమంటుంది అని చెప్పి జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి అని అనుకుంటాడు. మరోవైపు కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ వనభోజనాల గురించి చెబుతాడు గౌతమ్. ఇంతలో ధరణి.. ధరణి అని పిలుస్తుంది దేవయాని. ఎక్కడున్నావు. వనభోజనాల కోసం నాకు స్పెషల్ చీరను రెడీ చేయమని చెప్పాను కదా. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో చేయలేదు అత్తయ్య పనిలో పడి అంటుంది. దీంతో ధరణి మీద చిరాకు పడి వెళ్లిపోతుంది దేవయాని.
ఇంతలో మహీంద్రా వస్తాడు. వనభోజనాల గురించి కాలేజీలో అందరికీ చెప్పావా అంటాడు మహీంద్రా. దీంతో చెప్పాను అంకుల్ అంటాడు గౌతమ్. రిషిని నువ్వే చూసుకోవాలి అంటాడు మహీంద్రా. దీంతో వాడినే నన్ను చూసుకోమని చెప్పండి అంటాడు. వాడిని చూసుకోవడానికి వసుధార ఉంది కదా అంటాడు. ఆ తర్వాత అసలు దేవయాని పెద్దమ్మనే వనభోజనాలకు రాకుండా చేస్తే బాగుండు. తను రాకుండా ఏం చేయాలి.. ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటాడు గౌతమ్. మరోవైపు వసుధార కోసం ఏదో గిఫ్ట్ కొని తీసుకొస్తాడు రిషి. వసుధార ఈ గిఫ్ట్ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకొని తన రూమ్ లో పెడతాడు దాన్ని. ఆ తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తుంటారు. అందరూ కూర్చొంటారు. నీ కోసం కొత్త శారీ ఎదురు చూస్తోంది రూమ్ లో అని మెసేజ్ పెడతాడు రిషి. హలో అని మెసేజ్ మళ్లీ పెడతాడు. థాంక్స్ సార్ అని అంటుంది.
ఇంతలో ఏం వసుధార.. వనభోజనాలకు ప్లానింగ్స్ ఏంటి అని అడుగుతుంది దేవయాని. దీంతో థాంక్స్ మేడమ్ అంటుంది వసుధార. దీంతో అందరూ విచిత్రంగా చూస్తారు. థాంక్స్ ఏంటి అంటుంది దేవయాని. దీంతో రిషి సార్. కవర్ చేయండి సార్ అంటుంది వసుధార. దీంతో థాంక్స్ అనే ఒక గేమ్ వచ్చిందట. ఆ ఆట ఆడుదామని వసుధార అంటుంది అంటాడు రిషి.
దీంతో ఇలాంటి గేమ్ ఒకటి ఉందా.. నేను ఎప్పుడూ వినలేదు అంటాడు మహీంద్రా. అవును నేను కూడా వినలేదు. అని అంటాడు గౌతమ్. దీంతో అరేయ్ ఇప్పుడు నీకు అన్నీ అవసరమా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటాడు రిషి. వీళ్లు చాలా అప్ డేటెడ్ గా ఉన్నారు అంటాడు గౌతమ్.
ఇంతలో దేవయానిని వనభోజనాలకు రాకుండా ఉండేలా ఏం చేయాలి అని అనుకుంటాడు గౌతమ్. దీంతో తినేటప్పుడే ఏదో ప్లాన్ చేస్తాడు. తన పక్కనే ఉన్న అన్నం గిన్నను కింద పడేస్తాడు గౌతమ్. దీంతో అది తన కాళ్ల మీద పడుతుంది. దీంతో తను నడవలేకపోతుంది.
పెద్దమ్మ.. నొప్పి బాగా ఉందా అని అడుగుతాడు రిషి. దీంతో అవును రిషి. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు నాన్న అంటుంది దేవయాని. ధరణి.. నువ్వు వెళ్లి ఆ బామ్ తీసుకురా అంటాడు ఫణీంద్రా. దీంతో సరే అంటుంది దేవయాని. పెద్దమ్మ.. కాలు బాగా నొప్పిగా ఉంటే చెప్పండి. హాస్పిటల్ కు వెళ్దాం అంటాడు రిషి.
దీంతో నేను ఎక్కడికీ రాను అంటుంది దేవయాని. నాన్నా రిషి.. రా. వచ్చి నా పక్కన కూర్చో అంటుంది దేవయాని. నాన్నా రిషి.. ఈ నొప్పి తగ్గిపోతుంది కానీ.. నాకు మాత్రం ఇంజెక్షన్స్ ఏవీ ఇప్పించకు అంటుంది దేవయాని. పెద్దమ్మ.. వనభోజనాల టైమ్ వరకు కాలు సెట్ అవుతుంది కదా అంటాడు గౌతమ్.
దీంతో పెద్దమ్మ వనభోజనాలకు రావడం లేదు. అవసరం అయితే ఈ వనభోజనాలే క్యాన్సిల్ చేద్దాం అంటాడు రిషి. దీంతో అదేంటి రిషి.. మినిస్టర్ గారు రమ్మన్నాక మనం వెళ్లకపోతే బాగుండదు అని అంటాడు ఫణీంద్రా. అంకుల్ చెప్పేది నిజమే కదరా అంటాడు గౌతమ్.
ఇంతలో బామ్ తీసుకొస్తుంది ధరణి. అక్కడ రుద్దుతాడు రిషి. దీంతో నొప్పిగా ఉంది రిషి అంటుంది దేవయాని. కాసేపు ఓర్చుకోండి అంటాడు రిషి. మీరు వెళ్లండి నేను పెద్దమ్మ దగ్గర ఉంటాను అంటాడు రిషి. దీంతో నువ్వెందుకు ఉండటం.. మేము ఉంటాంలే అని మహీంద్రా అంటాడు.
అందరం కలిసే వెళ్దాం అంటుంది దేవయాని. దీంతో మీకు నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. మీరు రావడం కరెక్ట్ కాదు. మీరు రెస్ట్ తీసుకోండి అంటాడు రిషి. దీంతో అలాగే నాన్న. నువ్వు ఎలా చెబితే అలా అంటుంది దేవయాని. రిషి తీసుకొచ్చిన చీరను కట్టుకొని రిషి దగ్గరికి వెళ్లి తన కళ్లు మూస్తుంది వసుధార.
తనను ఆ చీరలో చూసి షాక్ అవుతాడు రిషి. తర్వాత రిషికి రోజ్ ఫ్లవర్ ఇస్తుంది వసుధార. ఇద్దరూ కాసేపు సంతోషంగా గడుపుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.