guppedantha mansu 13 september 2022 full episode
Guppedantha Manasu 13 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 సెప్టెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 554 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి, మహీంద్రా ఇద్దరూ పూలు అల్లడానికి కింద కూర్చొంటారు. రిషి.. వసుధార పక్కన కూర్చొంటాడు. మహీంద్రా… గౌతమ్ దగ్గర కూర్చొంటాడు. అంకుల్ మీకు పూలు అల్లడం తెలుసా అని అడుగుతాడు గౌతమ్. దీంతో నాకు అన్నీ తెలుసు అంటాడు. మరోవైపు రిషికి ఎలా మాల కట్టాలో తెలియదు. వాళ్ళిద్దరినీ ఏకాంతంగా వదిలేయాలని జగతి, మహీంద్రా ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మెట్లు పైకి ఎక్కి ధరణిని పిలుస్తారు. దీంతో ధరణి కూడా వాళ్ల దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత గౌతమ్ ను పిలవడానికి చాలా ట్రై చేస్తాడు మహీంద్రా. కానీ.. గౌతమ్ చూడడు. తర్వాత పువ్వు విసిరేయడంతో ఏంటి అని అడుగుతాడు. అక్కడి నుంచి వచ్చేయ్ అంటాడు మహీంద్రా. దీంతో సరే.. వస్తా అంటాడు. సుస్సు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
guppedantha mansu 13 september 2022 full episode
రిషి, వసు మాత్రం అక్కడే ఉంటారు. పూలు ఎలా అల్లాలో వసు నేర్పిస్తుంటుంది. ఏంటి వసుధర అందరూ సడెన్ గా వెళ్లిపోయారు అని అడుగుతాడు రిషి. దీంతో ఏమో సార్ నాకు తెలియదు అంటుంది వసుధార. సరే నేనూ వెళ్తాను అంటాడు రిషి. దీంతో వద్దు సార్.. ఉండండి అంటుంది. మెట్ల మీది నుంచి అందరూ వాళ్ళిద్దరినీ చూస్తుంటారు. పూలు ఎలా అల్లాలో నేను చూపిస్తాను అంటుంది వసుధార. ఇద్దరూ చేతులు పట్టుకొని పూలు అల్లుతూ ఉంటారు. మాల చేసి పెద్ద దండ తయారు చేశాక.. దాన్ని తీసి వసుధార మెడలో వేస్తాడు రిషి. అది చూసి జగతి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఆ దండను తన మెడలోనే ఉంచుకుంటుంది వసుధార. ఇంతలో దేవయాని అక్కడికి రావడం చూసి తన మెడలో ఉన్న దండను తీస్తుంది వసుధార. ఆ తర్వాత వసుధార.. ఈ పూల దండలన్నీ కంప్లీట్ చేయి అని అంటాడు రిషి.
నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతుంది దేవయాని. వీళ్లందరూ ఏమయ్యారు వసుధార. నువ్వు చేస్తున్నావేంటి అని అడుగుతుంది. దీంతో వాళ్లందరూ వెళ్లిపోయారు అంటుంది వసుధార. రిషి.. నువ్వు వెళ్లు.. ఇవన్నీ వసుధార చూసుకుంటుంది అంటుంది దేవయాని. కానీ.. పర్లేదు పెద్దమ్మ.. నేను చూసుకుంటాను వెళ్లండి అంటాడు రిషి.
దేవయాని వెళ్లిపోయాక మహీంద్రా, గౌతమ్ ఇద్దరూ వస్తారు. ఆ తర్వాత జగతి, ధరణి కూడా వస్తారు. వసుధార నువ్వు చెప్పు ఇంకేమైనా పనులు మిగిలాయా అంటాడు. దీంతో కేక్ ఆర్డర్ చేయడం మిగిలింది సార్ అంటుంది వసు. దీంతో కేక్ ఆర్డర్ నువ్వే చేయాలి అంటాడు గౌతమ్.
దీంతో కేక్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాను డాడ్ అంటాడు రిషి. దీంతో అందరూ సంతోషిస్తారు. తర్వాత అందరూ సరదాగా గడుపుదాం అని అంటుంది ధరణి. దీంతో అందరూ క్యారమ్స్ ఆడటానికి వెళ్తారు. రిషి సార్ మీరు కూడా రండి క్యారమ్స్ ఆడటానికి అని మెసేజ్ పెడుతుంది వసు.
దీంతో రిషి వచ్చి గౌతమ్ ను లే అని చెప్తాడు. తర్వాత క్యారెమ్స్ ఆడటం స్టార్ట్ చేస్తారు. జగతి, రిషి, వసు, మహీంద్రా నలుగురు కలిసి ఆడటం ప్రారంభిస్తారు. జగతి, రిషి ఒక టీమ్ గా ఆడుతారు. మనమే గెలుస్తాం అని జగతితో అంటాడు రిషి. తనకు సపోర్ట్ ఇవ్వడంతో జగతి సంతోషంలో ఉబ్బితబ్బిబ్బవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.