
Prashanth Varma : హనుమాన్ డైరెక్టర్ కి మొదటి షాక్.. 33 కథలు అవుట్ డేటేడేనా..?
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. ఐతే హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా నేషనల్ వైడ్ గా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఆ సినిమాతో అతనికి డైరెక్టర్ గా చాలా పేరు వచ్చింది. ఐతే ప్రశాంత్ వర్మ కథ తో దేవకీనందన వాసుదేవ సినిమా వచ్చింది. ఈ సినిమాలో అశోక్ గల్ల హీరోగా నటించగా అర్జున్ జంద్యాల డైరెక్ట్ చేశారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు అంత గొప్ప టాక్ ఏమి రాలేదు. ప్రశాంత్ వర్మ తన దగ్గర 33 కథలు ఉన్నాయి. అవసరమైతే బోయపాటికి కూడా కథ ఇస్తా అన్నారు. కానీ తను డైరెక్ట్ చేసిన సినిమాలా తను కథలు ఇచ్చిన సినిమాలు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేవు అన్న విషయం మర్చిపోయాడు. హనుమాన్ డైరెక్టర్ కి దేవకినందన వాసుదేవతో ఫస్ట్ షాక్ తగిలిందని చెప్పొచ్చు.
Prashanth Varma : హనుమాన్ డైరెక్టర్ కి మొదటి షాక్.. 33 కథలు అవుట్ డేటేడేనా..?
డైరెక్టర్ గా తన కథలను తాను డైరెక్ట్ చేసుకోవడం వేరు కానీ తన కథ వేరే వాళ్లకి ఇచ్చినప్పుడు అదే రిజల్ట్ వస్తుందని అనుకోవడం కష్టం. కానీ ప్రశాంత్ వర్మ అశోక్ సినిమాకు కూడా తన హనుమాన్ సినిమా రేంజ్ రిజల్ట్ ఊహించాడు. ఐతే ఆడియన్స్ నుంచి మాత్రం ఆశించిన రెస్పాన్స్ రాలేదు. అంతేకాదు అశోక్ లాంటి హీరోకి ఇంత ఎలివేషన్.. ఇంత హంగామా అవసరమా అంటున్నారు.
సినిమాను మరో హీరో చేసి ఉంటే కచ్చ్తీంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ కు తన కెరీర్ లో ఫస్ట్ షాక్ తగిలినట్టు చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఓ పక్క జై హనుమాన్ చేస్తూనే మహంకాళి సినిమా కూడా చేస్తున్నాడు. తప్పకుండా తన కథల విషయంలో ప్రశాంత్ వర్మ కాస్త జాగ్రత్త పడాల్సి ఉంటుంది. Hanuman Director Prashanth Varma , Hanuman, Prashanth Varma, Devakinandana vasudeva, Ashok Galla, Mahesh Babu
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.