
Bigg Boss 8 Telugu : మణికంఠపై హరితేజ చెప్పిన హరకథ.. తెగ మురిసిపోయి ఏం చేశాడంటే..!
Bigg Boss 8 Telugu : వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లతో పాటు కంటెస్టెంట్స్ చేసే సందడి ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది. అయితే షోలో కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు కూడా చోటు చేసుకున్నాయి. విష్ణుప్రియ గంగవ్వతో మాట్లాడుతూ తన ఫ్యామిలీ ఇబ్బందుల గురించి షాకింగ్ విషయం బయటపెట్టింది. విష్ణు ప్రియని గంగవ్వ.. మీ నాన్న ఎక్కడ ఉంటాడు.. ఎం చేస్తుంటాడు.. మీకు అండగా ఉండడా అని ప్రశ్నించింది. దీనికి విష్ణుప్రియ బదులిస్తూ నాన్న ఊర్లో ఉంటారు. మా అమ్మకి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పడంతో గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.. ఇక తనతో ఎందుకు మాట్లాడడం లేదని ప్రేరణను విష్ణు అడిగారు.
దీంతో మాట్లాడేందుకు ఏముంది అని ప్రేరణ అన్నారు. ఎమోషనల్ అయినా తన వద్దకు రాలేదని విష్ణును ప్రేరణ నిలదీశారు. పృథ్వి రివేంజ్ కోసం చేస్తున్నారని అందరికీ అర్థమైందని ప్రేరణ అన్నారు. పృథ్వి నామినేషన్లలో ఉండేందుకు, బయటికి వెళ్లేందుకు కూడా అర్హుడని ప్రేరణ అన్నారు. తమ క్లాన్‍లో ఐకమత్యం లేదని అన్నారు. ఇక ఈ వారం తాను సేవ్ అయితే బంగారు ముక్కు పుడక ఇస్తానని గంగవ్వతో మణికంఠ చెప్పారు. హరితేజ బంగారు వడ్డాణం అడిగితే.. బేగంబజార్‌కు వెళ్లి ఇస్తానని అన్నారు. రోహిణి అడిగితే.. లిప్‍స్టిక్, ముద్దు ఇస్తానని మణి చెప్పారు. తులం బంగారం కావాలని గంగవ్వ అడిగారు. మొత్తంగా హౌస్‍లో ఉండే ప్రతీ వారానికి అర తులం బంగారం ఇస్తానని గంగవ్వకు మణి మాట ఇచ్చారు.
Bigg Boss 8 Telugu : మణికంఠపై హరితేజ చెప్పిన హరకథ.. తెగ మురిసిపోయి ఏం చేశాడంటే..!
2050వ సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంటుందో కంటెస్టెంట్లకు కథ చెప్పారు బిగ్‍బాస్. ఆ తర్వాత ఆ సంవత్సరంలో ఉన్నామనుకోవాలని చెప్పారు. రాయల్ టీమ్‍ను ఓవర్ స్మార్ట్ ఫోన్స్ టీమ్‍గా బిగ్‍బాగ్ చెప్పారు. ఓజీ క్లాన్ సభ్యులను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా నియమించారు. ఓవర్ స్మార్ట్ ఫోన్ల చార్జింగ్ అయిపోతుందని, అయితే బ్యాటరీ అయిపోయి చనిపోకుండా వారు చూసుకోవాలని బిగ్‍బాస్ చెప్పారు. చార్జింగ్ గేమ్‍లో కంటెస్టెంట్లు కిందామీదా పడ్డారు. ఇలా రెండు క్లాన్‍ల మధ్య హోరాహోరీగా ఆట సాగింది. నబీల్ వెనుక నుంచి సైలెంట్‍గా వచ్చి చార్జింగ్ పెట్టుకున్నారు అవినాశ్. చార్జింగ్ కోసం ఓవర్ స్మార్ట్ చార్జర్ మణికంఠను కాకాపట్టారు హరితేజ. హౌస్‍లో మణికంఠ జర్నీ గురించి హరికథ పాడారు హరితేజ. ఈ హరికథతో మణిని ఇంప్రెస్ చేశారు. దీన్ని మణి బాగా ఎంజాయ్ చేశారు. దీంతో తన వైర్‌తో హరితేజకు ఒక నిమిషం చార్జింగ్ ఇచ్చారు మణి. హరితేజ బ్యాటరీ పెరిగింది. టాస్క్ విషయంలో మణికంఠ మోసం చేయడానికి ఎవరు తట్టుకోలేకపోతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.