Home » Entertainment » Harika Argue With Sohel About Cycle As Gift
Entertainment

sohel : 25 లక్షలు వచ్చినా అలా చేస్తున్నావేంట్రా.. సోహెల్ పరువుదీసిన హారిక

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 24, 2021, 1:03 pm
Advertisement

sohel : బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. నాల్గో సీజన్ అంతా ఒకెత్తు అయితే.. చివర్లో జరిగిన ఫినాలె ఎపిసోడ్ మరో ఎత్తు. ఫినాలె నాడు సోహెల్ 25 లక్షలతో బయటకు రావడంతో ఆట మొత్తం మారిపోయింది. ఆ ఒక్క నిర్ణయంతో సోహెల్ ఆ రోజు హీరో అయ్యాడు. అలా 25 లక్షలతో బయటకు రావడంతో బిగ్ బాస్ విజేతకు రావాల్సిన పేరును కూడా కొట్టేశాడు. విజేతగా నిలిచిన అభిజిత్‌కు 25 లక్షలే వచ్చాయి. సోహెల్‌కు కూడా 25 లక్షలే వచ్చాయి. కాకపోతే అభిజిత్‌కు బిగ్ బాస్ టైటిల్ వచ్చింది.

Advertisement

harika argue with sohel about cycle as gift

అలా బిగ్ బాస్ విజేతగా అభిజిత్ నిలిస్తే.. బిగ్ బాస్ క్యాష్ విన్నర్‌గా సోహెల్ నిలిచాడు. రన్నర్‌గా అఖిల్ ఆటలో అరటిపండు అయ్యాడు. అయితే అఖిల్ సోహెల్ ఇద్దరూ కూడా కొన్ని డీలింగ్స్ మాట్లాడుకున్నారు. బైక్, ల్యాప్ టాప్ కొనివ్వాలని ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చారు. కానీ ఆ మాటలను నెరవేర్చుకున్నారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు హారిక, సోహెల్ మాత్రం ఓ విషయం మీద వాగ్వాదానికి దిగారు. సైకిల్ కూడా కొనివ్వడం లేదంటూ సోహెల్ పరువుదీసేసింది హారిక.

Advertisement

25 లక్షలు వచ్చినా 20 వేల కోసం చూస్తున్నావారా అంటూ హారిక అనేసింది. ఓ సైకిల్ కొనివ్వమంటే కొనిస్తలేవని హారిక కామెంట్ చేసింది. అయినా సైకిల్ అంటే చిన్న విషయమా? అది కూడా ఇప్పుడు 20, 25 వేలు ఉందని సోహెల్ చెప్పుకొచ్చాడు. సరే ఇప్పుడు కొనిస్తా అని సోహెల్ అన్నాడు. అడిగిన తరువాత కొనివ్వడం ఏం వద్దులే అయినా 25 లక్షలు వచ్చినా కూడా 20 వేలకు ఇలా చేస్తున్నావేంట్రా అని హారిక పరువుతీసేసింది. మొత్తానికి ఇలా సైకిల్ పంచాయితీ జరిగిందంటూ హారిక పోస్ట్ చేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి