Home » Entertainment » Hero Tarun Mother Say About His Marriage
Entertainment

Tarun Mother : హీరో తరుణ్ పెళ్లి గురించి అతని తల్లి ఊహించని కామెంట్స్ !

Authored By
aruna
The Telugu News | Published on: May 18, 2023, 11:30 am
Advertisement

Tarun Mother : టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న తరుణ్ హీరోగా ఎన్నో ఏళ్లు ఇండస్ట్రీని ఎలేసాడు. ప్రస్తుతం సినిమాలలో నటించనప్పటికి తరుణ్ పేరు జనాలలో నిలిచే ఉంది. అయితే తరుణ్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో తరుణ్ ముందు వరుసలో ఉంటాడు. ప్రభాస్ తో పోల్చితే తరుణ్ పెళ్లి గురించి ఎక్కువ వార్తలు రావాల్సి ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ టైం లోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అప్పట్లో ఆయన సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. కానీ కెరీర్లో కొన్ని అనాలోచిత నిర్ణయాల కారణంగా తరుణ్ కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది.

Advertisement

ఇక తరుణ్ తల్లి రోజా రమణి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తరుణ్ మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పెళ్లి కూడా త్వరలోనే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. రోజా రమణి తన కొడుకు తరుణ్ వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తరుణ్ కి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు గంట గంటన్నర పాటు పూజ చేస్తాడు. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాడు. మళ్లీ కెరీర్ లో నిలదొక్కుకునేందుకు తరుణ్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తరుణ్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

Hero Tarun mother say about his marriage

Advertisement

ఇక తరుణ్ పెళ్లి ఒక్కటి అయితే చాలు అన్నట్లుగా ఎదురుచూస్తున్నాను అని ఆమె తెలిపారు. పెళ్లి విషయం పూర్తిగా తరుణ్ కి వదిలేసినట్లుగా ఆమె వెల్లడించారు. మరీ తరుణ్ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చి కొంచెం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి. టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా తరుణ్ ఉన్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణ్ కెరీర్ ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి. చాలా ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న తరుణ్ ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సిరీస్ ఎటువంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి