
Hero Vishal Slap Robo Shankar video on youtube
Hero Vishal : హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తెలుగులో ప్రేమచదరంగం సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పందెంకోడి సినిమాతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాధించుకున్నాడు. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసే విశాల్ తన సినిమాలు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాడు. ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే సొంత బ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ తో ఎన్నో సినిమాలను నిర్మించారు. అలాగే నడిగర్ సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. విశాల్ సినిమాలు ఎక్కువగా తమిళ్ నుంచి తెలుగులోకి డబ్బింగ్ అవుతుంటాయి.
కాగా ఇటీవల సామాన్యుడు సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక విశాల్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఇప్పటికే విశాల్‌కు నటి అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. కానీ కొద్ది రోజులకే పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఇద్దరూ స్పందించలేదు. కాగా తాజాగా ఓ యువతితో పీకల లోతు ప్రేమలో ఉన్నట్లు విశాల్ చెప్పాడు. త్వరలోనే ఆ అమ్మాయి ఎవరో కూడా చేబుతానని అన్నాడు. దీంతో విశాల్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం విశాల్ లఠీ అనే సినిమాలో నటిస్తున్నారు.
Hero Vishal Slap Robo Shankar video on youtube
వినోద్ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందులో సునైనా హీరోయిన్‌గా నటిస్తుండగా రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ లో విశాల్ కాలికి గాయం కూడా అయింది. కాగా తాజాగా లాఠీ టీజర్ లాంచ్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. నటుడు రోబో శంకర్ స్టేజిపై విశాల్ తో మాట్లాడుతుండగా విశాల్ ఒక్కసారిగా చెంప చెల్లుమనిపించాడు. దీంతో అందరూ షాక్ లో ఉండిపోయారు. ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి స్టేజి దిగి వెళ్లిపోతుండగా నవ్వడంతో ఇది ఫ్రాంక్ అని తెలిసి అందరూ నవ్వేసారు.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.