Home » Entertainment » Heroin Rashi Support To Amardeep In Bigg Boss Telugu 7
Entertainment

Heroin Rashi : దయచేసి నా కొడుకుని గెలిపించండి .. అమర్ దీప్ కు సపోర్ట్ చేస్తున్న హీరోయిన్ రాశి..!

Authored By
aruna
The Telugu News | Updated on: October 28, 2023 7:40 pm
Advertisement

Heroin Rashi : బిగ్ బాస్ సీజన్ 2 తర్వాత ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నది ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలైన బిగ్గెస్ట్ రియాలిటీ షో లేటెస్ట్ సీజన్ రోజుకో ట్విస్ట్, వారానికో షాకింగ్ ఎలిమినేషన్ తో ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఇకపోతే హౌస్ లో ప్రస్తుతం టాప్ కంటెస్టెంట్ లో ఒకరిగా కొనసాగుతున్న అమర్ దీప్ పై వ్యక్తిగతంగా, మానసికంగా అవహేళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో సానుభూతి బాగా పెరిగిపోయింది. ఒక వ్యక్తిని ఇంతమంది టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ పోస్ట్లు పెడుతున్నారు.

Advertisement

ఈ ఐదు వారాలు పెద్దగా ఆడని అమర్ దీప్ ఈ రెండు వారాల నుంచి తన ఆటని మెరుగుపరిచారు. హౌస్ లో ప్రతి ఒక్కరూ అమర్ దీప్ వెనుక వెక్కిరించడం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాశి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అమర్ దీప్ కు సపోర్టుగా పోస్టులు పెడుతూ రోజు రోజుకి నా బిడ్డ పై కక్షలు పెరుగుతున్నాయి. దయచేసి మా అబ్బాయికి అందరూ ఓటేయండి అంటూ పోస్ట్ పెట్టింది. అమర్ దీప్ ప్రియాంక జైన్ హీరో హీరోయిన్ లుగా స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అయిన ‘ జానకి కలగనలేదు ‘ సీరియల్ లో హీరోయిన్ రాశి అమర్ దీప్ కు తల్లిగా నటించింది.

అదేవిధంగా సినిమాలలో బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ తో కలిసి శ్రీరామచంద్రుడు, సందడే సందడే వంటి సినిమాలను చేశారు. ఇలా ఇద్దరితో కలిసి నటించినప్పటికీ ఆమె అమర్ దీప్ కు సపోర్ట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అమర్దీప్ తన కొడుకుల భావించి తన సోషల్ మీడియా ద్వారా అతడికి సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టాప్ కంటెస్టెంట్ లో ఒకరిగా అమర్ దీప్ కొనసాగుతున్నారు. మరి చివరి వరకు ఉండి కప్ గెలుస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం రాశి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి