
HIT 2 Movie First Day Collections
HIT 2 Movie First Day Collections : నాని నిర్మాణంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం హిట్ 2. ఈ సినిమాని క్రైమ్ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్ 1 సినిమాతో పాపులర్ అయిన డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించారు. ‘హిట్ 2: ది సెకండ్ కేస్… చిత్రం 2020లో వచ్చిన హిట్ 1కు సీక్వెల్ గా వచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది.ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం విశేషం.
అడవి శేష్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక స్థాయిలో బిజినెస్ చేసినట్లు తెలుస్తుండగా, ఈ సినిమా నైజాం హక్కులు రూ. 5 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ. 2 కోట్లకు అమ్ముడు అయినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మొత్తంగా హిట్ 2 సినిమా రూ. 7 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు టాక్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తంగా రూ. 14.5 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు వార్తలు వస్తుండగా, ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా ఉంటుందని అంచనా. హిట్ కి సీక్వెల్‌గా మూవీ తెరకెక్కడంతో అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నైజాంలో 210, సీడెడ్‌లో 90, ఆంధ్రాలో 245 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 550 నుంచి 600 థియేటర్లలో విడుదల అయినట్లు తెలుస్తుంది.
HIT 2 Movie First Day Collections
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 950కిపైగా థియేటర్లలో రిలీజ్ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మాస్ సినిమాలకు బంపర్ ఓపెనింగ్స్ ఇచ్చే సీడెడ్ వంటి ప్రాంతం లో ఒక థ్రిల్ సినిమా అయినా హిట్ 2 కి మంచి ఓపెనింగ్ వచ్చినట్టు తెలుస్తుంది.ఇక్కడ ఈ సినిమాకి మొదటి రోజు 50 లక్షలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట..కోస్తాంధ్రలో కూడా ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్ దక్కింది..ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి కేవలం ప్రీమియర్ షోస్ నుండే రెండు లక్షల డాలర్లు వచ్చినట్టు సమాచారం. .మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు 8 నుండి 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించినట్టు చెబుతున్నారు. అంటే తొలి రోజే దాదాపు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.