
balakrishna asks th appointment says perni nani
BalaKrishna : నందమూరి బాలకృష్ణ ఎంత ఓపెన్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అన్‌స్టాపబుల్ అనే టాక్ షోతో అదరగొట్టాడు. గెస్ట్‌లుగా వచ్చిన సెలబ్స్‌తో ఆయన చేసిన సందడి ఓ రేంజ్‌లో ఉంది. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’లో బాలయ్య హోస్టింగ్ చూసిన తర్వాత మరే ఇతర టాలీవుడ్ హీరోలు కూడా ఇంత ఎంటర్‌టైనింగ్‌గా హోస్టింగ్ చేయలేరేమో అనిపించింది ప్రేక్షకులకు. అందుకేనేమో అన్‌స్టాపబుల్ షో ఖాతాలో రికార్డుల మీద రికార్డులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఐఎమ్‌డీబీ రేటింగ్స్ విషయంలో ఇండియాలోనే టాప్‌లో ఉంది అన్‌స్టాపబుల్. మరోవైపు అన్‌స్టాపబుల్ షో 40 కోట్ల నిమిషాలు స్ట్రీమ్ అయినట్లు ఆహా తెలిపింది. హీరోగానే కాదు..
హోస్ట్‌గా కూడా రికార్డులను తిరగరాయగలడు అని ప్రూవ్ చేసుకున్నారు.రీసెంట్‌గా అన్‌స్టాపబుల్ తొలి సీజన్ పూర్తైంది. త్వరలోనే సెకండ్ సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జూలై నుంచి సెకండ్ సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఆహా బాలకృష్ణను రాపిడ్ ఫైర్‌లా అడిగిన కొన్ని ప్రశ్నలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.‘నెవర్ హావ్ ఐ నెవర్’ (నేను ఎప్పుడు చేయనిది) షోలో భాగంగా ‘మీపై వచ్చే మీమ్స్ గురించి ఎప్పుడైనా నవ్వుకున్నారా.?’
how BalaKrishna feels with memes
అన్న ప్రశ్నకు ‘నవ్వుకున్నాను’ అని సమాధానం ఇచ్చారు. కరోనా వచ్చిన సమయంలో లెజెండ్ సినిమాలోని డైలాగ్‌తో చేసిన మీమ్స్ చూసినప్పుడు నవ్వుకున్నాను అని తెలిపారు. ఇక ఎప్పుడైనా కాలేజికి బంక్ కొట్టారా అన్న ప్రశ్నకు ‘బంక్ కొట్టని వారు ఎవరు ఉంటారు చెప్పండి’ అంటూ బదులిచ్చారు. ఇలా పలు సరదా ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు బాలకృష్ణ. మరి బాలయ్య బాబు చెప్పిన ఇంకొన్ని ఫన్నీ విశేషాలు చూసి ఎంజాయ్ చేయండి. బాలయ్య త్వరలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనుండగా, ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.