Hyper Aadi – Ram Prasad : వీళ్లతో పెట్టుకుంటే ఇంతే!.. ఆడేసుకున్న ఆది, రాం ప్రసాద్
Hyper Aadi – Ram Prasad : హైపర్ ఆది రాం ప్రసాద్ ఇద్దరూ ఇద్దరే. పంచులు వేయడంలో ఒకరు ఫేమస్ అయితే.. ఆటో పంచులు వేయడంలో ఇంకొకరు ఫేమస్. స్పాంటేనియస్ పంచులు వేస్తూ ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ దూసుకుపోతోన్నారు. ఈ ఇద్దరి కామెడీ వల్లే శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇప్పుడు దుమ్ములేపేస్తోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ వరుసగా పంచులతో రెచ్చిపోయారు.
వాళ్లిద్దరూ అందరి దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టారట. ఇక అందరూ అప్పు అడగటానికి వచ్చారు. దీంతో ఒక్కొక్కరి మీద ఒక్కో రకమైన కౌంటర్లు వేశారు. మా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తావా? అని ఫైమా అంటే.. మోసం గురించి నువ్వు, ప్రవీణ్, నూకరాజే మాట్లాడాలంటూ కౌంటర్లు వేశారు. నా అప్పు రోజు రోజుకూ పెరుగుతోంది అని నరేష్ అంటాడు. మరి అప్పు కూడా పెరుగుతోంది.. కానీ నువ్ మాత్రం పెరగడం లేదన్నట్టుగా నరేష్ పరువుతీస్తాడు ఆది.
Hyper Aadi And Ram Prasad Counters on Sridevi Drama Company
Hyper Aadi – Ram Prasad : ఫైమా పరువుతీసిన ఆది..
నీకు అప్పిచ్చిన పాపానికి జనాలు అంతా నా మొహం మీద ఊస్తున్నారు.. నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలియడం లేదు అని పవిత్ర అంటుంది. ఇంకా ఎక్కడా పెట్టకు.. అసలే ఎక్కడెక్కడో పెట్టినట్టు ఉంది అంటూ పవిత్రను దారుణంగా కించపరుస్తాడు. దీని కంటే ముందు ఇంకో పంచ్ వేస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టేయండి.. ముందు నా అప్పు తేల్చండి అని పవిత్ర అంటుంది.
అసలు నిన్నే పక్కన పెట్టేయమని చెప్పాం కదా? ఇంకా తీసేయలేదా? అని ఆది కౌంటర్లు వేస్తాడు. ఇలా ఒక్కొక్కరినీ తమ పంచులతో ఆడేసుకుంటూ వరుసగా కామెడీ పండించారు. ఈ ఇద్దరే ఈ షోకు బలమని ఎందుకు అంటారో ఈ పంచులతోనే అర్థమై ఉంటుంది.
