Jabardasth Shanthi Reel WIth Hyper Aadi
Hyper Aadi: జబర్ధస్త్ షోతో చాలా మంది వెలుగులోకి వచ్చారు. అయితే కొందరు క్రేజ్‌ని నిలబెట్టుకోకుండా వివాదాలతో విమర్శల పాలయ్యారు. పరదేశి,దొరబాబు వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడ్డారు. ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి మరీ విచారించారు. అయితే ఏదో సమాజసేవ చేసినట్టుగా ఆ వ్యభిచార కొంపల్లో దూరి పోలీసులకు అడ్డంగా దొరికేసిన విషయాన్ని డప్పుకొట్టి మరీ చెప్పుకోవడంపై మండిపడుతున్నారు. చేసింది తప్పుడు పని.. ఆ తప్పుడు పనికి ఫుల్ పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఇలా డబ్బా కొట్టుకోవడం ఏంటో.. దానికి రోజాతో సహా అక్కడ ఉన్నవాళ్లంతా తెగ ఎంజాయ్ చేయడం ఏంటో అర్ధంకాని పరిస్థితి.
దొరబాబు, పరదేశి తమను వదిలేయమని దండాలు పెడుతూ పోలీసుల కాళ్లపై పడి దండాలు పెట్టిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే వీళ్లను అరెస్ట్ చేయడం.. ఆ తరువాత వదిలిపెట్టేయడం జరిగిపోయాయి. అది జరిగింది మొదలు.. తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో వరకూ కూడా ఆ వ్యభిచారం ఇష్యూని పదే పదే ప్రస్తావించుకుంటూ గుర్తు చేస్తూనే ఉన్నారు. తాజా స్కిట్ లో అయితే వారిపై కుటుంబ సభ్యులు కూడా విమర్శలు చేశారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
hyper aadi comments on dhorababu
ఆది స్కిట్‌లో చేసే కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులతో స్టేజ్ మీదకు వచ్చారు. ఇందులో పరదేశి.. నీకు కాల్ చేసి దీని కోసం పిలిపించా కదా, ఎలా అనిపిస్తుంది అని అడగగా, దీని కోసం చేశావనుకోలేదు. వేరే దాని కోసం అనుకున్నా అంటూ ఆయన అక్క అంటుంది. బావని ఎందుకు తీసుకురాలేదు అంటే, చేసే ఈ మాత్రం దానికి బావ ఎందుకు బొక్క అంటూ పంచ్‌లు పేల్చింది. ఇక దొరబాబు తన సోదరుడితో రాగా, కలిసి పెరిగాం, కలిసి చదివాం అని అనగా, కలిసి మాత్రం వెళ్లలేదండోయ్ అంటూ పంచ్‌లు పేలుస్తాడు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ టీలు తాగేస్తావు, మేం తాగక్కర్లేదా అంటూ దొరబాబుపై ఆయన సోదరుడు వేసే పంచ్ కూడా బాగుంది. మొత్తానికి ప్రోమో తెగ ఆకట్టుకుంటుంది.
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
This website uses cookies.