Hyper Aadi : ఆర్ యూ వర్జిన్.. సుధీర్‌ను ఇరకాటంలో పడేసిన ఆది.. వీడియో
Hyper Aadi హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ Sudigali Sudheer ఒకే చోట ఉంటే అక్కడంతా సందడి వాతావరణం నెలకొనాల్సిందే. అలాంటిది ఢీ షోలో ఇక ఆది, సుధీర్, ప్రదీప్, రష్మీ వంటి వారంతా చేసే అల్లరి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఢీ షోలో కంటెస్టెంట్లు చేసే డ్యాన్సులు ఎలా ఉన్నా..
Hyper Aadi Counters on Sudigali Sudheer In Dhee
వీరంతా చేసే కామెడీ స్కిట్లు, పంచ్‌లు మాత్రం బాగానే వైరల్ అవుతుంటాయి. డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు బాగా చేసి ఎవరి టీం గెలుస్తుందో.. ఓడిన టీంకు టాస్క్ ఇస్తారన్న సంగతి తెలిసిందే.
ఆర్ యూ వర్జిన్.. సుధీర్‌ను ఇరకాటంలో పడేసిన ఆది Hyper Aadi
అలా వచ్చే వారం మాత్రం రష్మీ టీం గెలిచినా.. ఆది Hyper Aadi , సుధీర్ Sudigali Sudheer మాత్రం టాస్క్ చేసేందుకు సిద్దంగా ఉండరు. టాస్క్ చేయమని ఆది మొండికేస్తాడు. ఎందుకు చేయరు అని రష్మీ నిలదీస్తుంది. మాకు మూడ్ లేదు అని ఆది కొంటె సమాధానం చెబుతాడు. అయితే మాకు మూడ్ ఉంది అని రష్మీ కౌంటర్ వేస్తుంది.
Hyper Aadi Counters on Sudigali Sudheer In Dhee
మీకు మూడ్ ఉంటే మీరు చేసుకోండి అని ఆది మరో పంచ్ వేస్తాడు. ఇక అలానే స్టేజ్ మీద కుర్చీ వేసుకుని కూర్చున్న ఆది.. వకీల్ సాబ్ స్టైల్లో యాక్ట్ చేసేశాడు అబ్జెక్షన్ అబ్జెక్షన్ అంటూ పవన్ కళ్యాణ్‌లా నటించేందుకు ప్రయత్నించాడు. లేచి కుర్చీని తన్నేశాడు. వెళ్లి తన కంటెస్టెంట్లతో పాటుగా కూర్చున్నాడు.
Hyper Aadi Counters on Sudigali Sudheer In Dhee
ఆర్ యూ వర్జిన్ అంటూ సుధీర్‌ను ఆది ప్రశ్నించేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. మరోసారి ప్రకాష్ రాజ్‌లా ఇమిటేట్ చేస్తూ ఆర్ యూ వర్జిన్ అంటూ మళ్లీ సుధీర్‌ను ఇరికించే ప్రయత్నం చేశాడు ఆది. మొత్తానికి ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండానే సుధీర్ బాగానే తప్పించుకున్నట్టు కనిపిస్తోంది.
