Home » Entertainment » Hyper Aadi Craze At Puttur Restaurant Opening
Entertainment

Hyper Aadi : ఇదిరా ఆది అంటే.. ఈ ‘హైపర్’ క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Authored By
aruna
The Telugu News | Published on: August 5, 2022, 12:40 pm
Advertisement

Hyper Aadi : హైపర్ ఆది అంటే మామూలు విషయం కాదు. బుల్లితెరపై తిరుగులేని స్టార్డంతో దూసుకుపోతోన్నాడు. యూట్యూబ్‌లో స్పూప్స్ చేసుకునే స్థాయి నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఎదిగాడు. బుల్లితెరపై హైపర్ ఆది అంటే ఓ బ్రాండ్‌లా మారిపోయాడు. ఆది వేసే పంచ్‌లు సెటైర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆది అంటే ప్రాసలు, ప్రాసలతో వేసే పంచ్‌లు ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. ఆది అటు బుల్లితెర, ఇటు వెండితెర రెండింటిని మ్యానేజ్ చేస్తున్నాడు.

Advertisement

ఇక ఆదికి ఎక్కువగా మెగా సపోర్ట్ ఉంటుంది. మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఆదిని ప్రేమిస్తుంటారు. చిరంజీవి అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా కూడా ఆది ఎనలేని అభిమానాన్ని చూపిస్తుంటాడు. జనసేన కోసం ఆది కష్టపడుతుంటాడు. మెగా ఫ్యామిలీ కోసం ముందుంటాడు ఆది. అలా ఇంతటి క్రేజ్ రావడానికి అది కూడా ఓ కారణం. ఇప్పుడు బుల్లితెరపై ఆది దూసుకుపోతోన్నాడు. సుధీర్ స్టార్ మాకు వెళ్లిపోయాడు. స్టార్ మా షోలకు అంత రీచ్ ఉండదు.

Hyper Aadi Craze At Puttur Restaurant Opening

Advertisement

ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆది మరింత దూసుకుపోతోన్నాడు. ఇక బయట ఎక్కువగా కనిపించని ఆది.. బయటకు వస్తే ఎలా ఉంటుందో తాజాగా చూపించాడు. తాను పుత్తూరు వెళ్లినట్టు, అక్కడ ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి హాజరైనట్టు చెప్పుకొచ్చాడు. ఇక ఆ ప్రాంగణమంతా కూడా జన సందోహంలా అనిపించింది. ట్రాఫిక్ కూడా స్థంభించినట్టుంది. ఆదిని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆదిని ఉక్కిరిబిక్కిరి చేశారు. తనఫ్యాన్స్ అందరితో ఆదియే ఓ సెల్పీ దిగాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి