Hyper Aadi Eats Green Chilli in Sridevi Drama Company
Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై ఎలాంటి స్టార్డంను ఎంజాయ్ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. అయితే ఆదికి తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడింది. సుధీర్ వెళ్లడంతో మరింత ఎక్కువగా ఆది ప్రాబల్యం పెరిగింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ వంటి షోల్లో ఆది డిమాండే ఎక్కువగా ఉంది. ఆది చెప్పిందే జరుగుతున్నట్టుంది. మొత్తానికి హైపర్ ఆది మాత్రం ఇప్పుడు అక్కడ కింగులా ఏలేస్తున్నాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షో అయితే అంతా తానై ముందుకు నడిపిస్తున్నాడు. రాం ప్రసాద్, ఆదిల ర్యాపో కూడా బాగానే కలిసివస్తోంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోకు ఓ ప్రెష్ నెస్ వచ్చింది. కమెడియన్, సీనియర్ ఆర్టిస్ట్ కృష్ణ భగవాన్ వచ్చాడు.
ఆయన గెస్టుగా ఈ ఎపిసోడ్‌ను చేశారు. దీంట్లో కృష్ణ భగవాన్ అందరినీ ఆడేసుకున్నట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆది, వర్ష ఇలాంటి వారందిరి మీదా పంచులు వేశాడు. ఇక ఈ సారి థీమ్ ఏంటంటే.. చిన్న తనంలో నా కొడుకు, కూతురు తప్పి పోయారు.. వాళ్లు తిరిగి వస్తే నా ఆస్తి అంతా ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ చెబుతాడు కృష్ణ భగవాన్. ఇక ఇందులో అందరూ పోటీ పడతారు. నేనంటే నేను అని పోటీ పడుతూ వస్తారు. ఎవరు తన కొడుకు, కూతురు అనే తేల్చేందుకు రకరకాల పోటిలు పెట్టించినట్టు కనిపిస్తోంది. ఇక ఇందులో ఒక్కొక్కరికీ మండిపోయేలాంటి పరీక్షలు పెట్టించేశారు. అందరూ పచ్చి మిర్చీ తినాలనే టాస్క్ ఇచ్చారు.
Hyper Aadi Eats Green Chilli in Sridevi Drama Company
దీంతో ఆడవాళ్లంతా కూడా రెడీ అయ్యారు. ఒక వేళ చివరకు ఫైమా మిగిలితే.. మాత్రం దాన్ని చంపేసి నేను కూడా చచ్చిపోతాను అని కృష్ణ భగవాన్ అన్నాడంటూ ఆది చెప్పుకొచ్చాడు. ఇక మగవాళ్లంతా కూడా పరీక్షకు సిద్దమయ్యాడు. ఒక్క మిర్చి తినేలోపు ఆదికి ఎక్కడో మండిపోయినట్టుంది. నాకు తండ్రి లేడు.. నేను ఎవడి కొడుకుని కాదు అని అంటాడు. వందల కోట్ల ఆస్తి అని రష్మీ రెచ్చగొడుతుంది.. అసలు నేను నా కొడుకు అనే ఈవెంట్లోనే లేను అంటూ లేచివెళ్లిపోయేందుకు సిద్దమవుతాడు.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.