
Hyper Aadi ETV dhee new season rating very week because of sudheer and rashmi out
Hyper Aadi : ఈటీవీలో హిట్ అయిన ప్రతి ఒక్క షో ను శ్యామ్ ప్రసాద్ మల్లెమాల లో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. జబర్దస్త్ కు ముందు నుండే మల్లెమాల వారు ఈటీవీ షో లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సూపర్ హిట్ షో లను ప్రేక్షకులకు ఈ కాంబో ఇచ్చింది. మల్లెమాల పై ఒక అపవాదు ఉంది.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను దక్కించుకోవాలి… పారితోషికం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని క్లిక్ అయిన వారిని తప్పించే గుణం. చాలా షో ల్లో ఇలాగే జరిగింది. జబర్దస్త్ మొదలుకుని ఢీ వరకు అనేక షో ల్లో మల్లెమాల వారి ప్రయోగాలు కొన్ని సక్సెస్ అవ్వగా కొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఢీ కొత్త సీజన్ కు మల్లెమాల వారి ప్లాన్ బెడిసి కొట్టింది. వారు సుధీర్ మరియు రష్మిని తప్పించి భారీగా ఖర్చు తగ్గించుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే తప్పించి ఒక్క హైపర్ ఆదిపై భారం వేసి ఢీ కొత్త సీజన్ ను మొదలు పెట్టారు.
హైపర్ ఆది పంచ్ లు యాంకర్ ప్రదీప్ టైమింగ్ తో ఢీ కొత్త సీజన్ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని వారు భావించి ఉంటారు. సీజన్ ప్రారంభం అయ్యి వారాలు గడుస్తున్నా కూడా ఇంకా జనాలు అలవాటు పడటం లేదు. సుధీర్ మరియు రష్మీ లు లేకపోవడంతో ఏకంగా వ్యూవర్ షిప్ సగానికి పడిపోయిందని అంటున్నారు. శాటిలైట్ వ్యూవర్ షిప్ మనకు కనిపించక పోవచ్చు.. కాని యూట్యూబ్ లో ఢీ కొత్త సీజన్ కు వస్తున్న వ్యూస్ ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హైపర్ ఆది కామెడీ పంచ్ లు తగ్గలేదు.. ప్రదీప్ టైమింగ్ ఏమాత్రం తగ్గలేదు అయినా కూడా రేటింగ్ మాత్రం దారుణంగా పడిపోయింది. అందుకు కారణం ఖచ్చితంగా సుధీర్ మరియు రష్మి లేక పోవడం అంటూ ప్రతి ఒక్కరు అంటున్నారు. హైపర్ ఆది కామెడీ చేసి షో ను నడిపిస్తాడని వారిద్దరి రొమాన్స్ అక్కర్లేదని మల్లెమాల వారు భావించి ఉంటారు. కాని ప్రేక్షకుల మాత్రం మాకు సుధీర్ కావాల్సిందే.. ఆయనతో పాటు రష్మి కూడా ఉండాల్సిందే అంటున్నారు.
Hyper Aadi ETV dhee new season rating very week because of sudheer and rashmi out
షో ప్రారంభం అయ్యి ఇన్ని వారాలు అయినా కూడా జనాల్లో ఆధరణ లేకపోవడంతో సుధీర్ ను తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కాని వచ్చే వారం టెలికాస్ట్ అవ్వబోతున్న ఎపిసోడ్ లో కూడా సుధీర్ కనిపించడం లేదు. ప్రోమో చూసిన సుధీర్ అభిమానులు.. ఢీ షో ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారు సుధీర్ లేని ఈ షో మాకు వద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే వారం కూడా సుధీర్ లేడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పట్టుబట్టి షో ను ఇలాగే కొనసాగిస్తాం అని మొండిగా వ్యవహరిస్తే మల్లెమాల వాళ్లకు ఢీ కొత్త సీజన్ తో నిరాశ తప్పదు అంటున్నారు. కేవలం హైపర్ ఆది కోసం అయితే జనాలు జబర్దస్త్ చూస్తారు. ఢీ చూడాల్సిన అవసరం ఏంటీ అంటున్నారు. హైపర్ ఆదిని నమ్ముకున్న మల్లెమాలకు ఇలా జరగాల్సిందే.. ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఢీ షో ను కాస్త కామెడీ షో ను చేయడం.. దానికి తోడు మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ క్యూట్ పెయిర్ అయిన రష్మి మరియు సుధీర్ లను తప్పించడం అనేది అతి పెద్ద తప్పుగా జనాలు చెప్పుకుంటున్నారు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.