Home » Entertainment » Hyper Aadi Fun With Russian Girl In Dhee Promo
Entertainment

Hyper Aadi : ఇంగ్లీష్ పిల్లతో సరసాలు.. హైపర్ ఆది మామూలోడు కాదు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 16, 2022, 8:00 pm
Advertisement

Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై చేసే చేష్టలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అమ్మాయిలు కనిపిస్తే చాలు అన్నట్టుగా నటించేస్తాడు. రెచ్చిపోయేందుకు ప్రయత్నిస్తాడు. అయితే తన స్కిట్లలో ఇవన్నీ కామన్‌గానే చేస్తుంటాడు. అదే స్కిట్లలో తనకు విషయం ఏమీ లేదన్నట్టుగా కూడా ప్రవర్తిస్తుంటాడు. అయితే ఆది ఇప్పుడు జబర్దస్త్ షోలో కనిపించడం లేదనే హాట్ టాపిక్‌గా మారింది. అలా అని మల్లెమాలతో గొడవ ఉందా? అంటే.. ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీలో కొనసాగుతూనే ఉన్నాడు. ఒక్క జబర్దస్త్ విషయంలోనే ఆది మాత్రం వింతగా ప్రవర్తిస్తున్నాడు.

Advertisement

అతని చర్యలు ఏంటో తెలుసుకోలేకపోతోన్నారు జనాలు. మొత్తానికి ఇప్పుడు అయితే ఢీ షోలో బాగానే దుమ్ములేపుతున్నాడు. అక్కడంతా ఆది హవానే. రైటర్ కూడా తానే అవ్వడంతో పంచులు కూడా తన ఇష్టమున్నట్టే వేసేసుకుంటాడు. అందుకే అందరి మీద ఎడాపెడా పంచులు వేసేస్తుంటాడు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నవ్యస్వామి, రవికృష్టలు కనిపించలేదు. ఆ జంట మొత్తానికి రాకుండా ఉన్నారో లేదంటే.. ఈ ఒక్క ఎపిసోడ్‌కే హ్యాండ్ ఇచ్చారో తెలియడం లేదు.స వాళ్ల ప్లేస్‌లోకి యూట్యూబర్ నిఖిల్ వచ్చాడు. అది కూడా ఓ రష్యన్ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఇక ఆ తెల్ల పిల్లను చూడటంతో ఆది రెచ్చిపోయాడు. ఇప్పుడే ఓ తెల్లపిల్ల వచ్చింది..

Hyper Aadi Fun with Russian Girl In Dhee Promo

Advertisement

ఏముందిరా అంటూ ఎవరికో ఫోన్ చేస్తున్నట్టుగా ఆది కాస్త ఓవర్ చేసేశాడు. ఇక ఆ నిఖిల్ మరింత ఓవర్ యాక్షన్ చేసేశాడు. తాను రష్యాలో చదువుతున్నప్పుడు పరిచయం అయింది అని చెప్పుకొచ్చాడు నిఖిల్. అరేయ్ నువ్ రష్యాలో చదివావ్ ఏంట్రా అని సెటైర్ వేస్తాడు. ఏం చదివావ్ రా అని అంటే.. మాస్టర్స్ అని అంటాడు నిఖిల్. మాస్టర్స్ చదవడానికి అంత దూరం వెళ్లాలా.. నెల్లూరులో చదివి మాస్టర్ అయ్యాడు అని జానీ మాస్టర్‌ను చూపిస్తాడు ఆది. ఇక ఆ తెల్లపిల్లతో కలిసి ఊ అంటావా మావ ఊ ఊ అంటావా? అనే పాటను పాడాడు. ఇక ఆ ఇంగ్లీష్ పాప పాట పాడకపోయినా స్టెప్పులు మాత్రం ఓ లెవెల్లో వేసింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి