Home » Entertainment » Hyper Aadi In Sri Devi Drama Company Latest Episode
Entertainment

Hyper Aadi : ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్‌ ఆది.. మ్యాటర్ ఏంటీ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 6, 2022, 2:30 pm
Advertisement

Hyper Aadi : జబర్దస్త్‌ అనగానే గుర్తుకు వచ్చే పేరు హైపర్‌ ఆది అనడంలో సందేహం లేదు. ఆయన ఈమద్య కాలంలో జబర్దస్త్‌ కు దూరం అయ్యాడు. మొదట ఆయన సినిమాల షూటింగ్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం వల్ల జబర్దస్త్‌ లో కనిపించడం లేదనే వార్తలు వచ్చాయి. కాని వరుసగా మూడు నాలుగు వారాల్లో కూడా ఆయన కనిపించలేదు. దాంతో హైపర్ ఆది ఖచ్చితంగా మల్లెమాల వారికి మరియు జబర్దస్త్‌ కు దూరం అయ్యాడని క్లారిటీ వచ్చేసింది. ఆయన ఇక ఈటీవీలో కనిపించడు అని అనుకుంటున్న ప్రతి సారి ఏదో ఒక కార్యక్రమంలో కనిపిస్తూ ఉన్నాడు.

Advertisement

నిజానికి హైపర్ ఆది దాదాపు రెండు నెలల క్రితమే మల్లెమాల వారికి గుడ్ బై చెప్పేసి వెళ్లి పోయాడు. కాని ఆయన గతంలో చేసిన కార్యక్రమాలు మల్లెమాల వారి వద్ద ఉన్నాయి. అవే ఇప్పుడు అప్పుడప్పుడు టెలికాస్ట్‌ చేస్తున్నారు. ఇంటర్నేషనల్‌ డాన్స్ డే సందర్బంగా వచ్చిన నా ఆట చూడు కార్యక్రమం అయితే ఏం ఢీ కార్యక్రమంలో అయితేనేం ఆది కనిపిస్తూ వస్తున్నాడు. కాని జబర్దస్త్‌ లో ఆయన ఎపిసోడ్స్ లేకపోవడంతో కనిపించడం లేదు. హైపర్ ఆది కనిపించే అవకాశాలు మళ్లీ లేవు అనుకుంటూ ఉన్న సమయంలో వచ్చే వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించబోతున్నాడు.

Hyper Aadi in Sri devi drama company latest episode

Advertisement

శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్‌ ఆది కనిపించబోతున్నాడు. ఇది చాలా నెలల క్రితం షూట్ చేసిన కార్యక్రమం. ఒక మంచి సందర్బం కోసం వెయిట్‌ చేస్తున్నారు. మదర్స్ డే సందర్బంగా ఆ కార్యక్రమంను టెలికాస్ట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అందులో హైపర్‌ ఆది ఉండటం వల్ల ఆయన అభిమానులు హమయ్య ఆది వచ్చేశాడు అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే మళ్లీ ఆ తర్వాత ఎపిసోడ్‌ లో ఆది కనిపించే అవకాశం లేదు. హైపర్‌ ఆది త్వరలో పక్క ఛానల్‌ లో ప్రత్యక్షం కనిపించబోతున్నాడట.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి