Home » Entertainment » Hyper Aadi Pradeep Counters On Navya Swamy Ugadi Sankranthi Festivals
Entertainment

Navya Swami : ఇది ఎంతటి దౌర్భాగ్యం.. అవి ఏంటో కూడా తెలీదా?.. పరువుతీసిన నవ్యస్వామి

Authored By
aruna
The Telugu News | Published on: July 28, 2022, 7:40 pm
Advertisement

Navya Swamy : టాలీవుడ్ బుల్లితెరకు చెందిన ముద్దుగుమ్మ నవ్య స్వామి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నవ్య స్వామి తన నటనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

Advertisement

కన్నడ సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన నవ్య స్వామి ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది. ఇక తెలుగు ప్రేక్షకులకు నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయము కాగా ఈ సీరియల్ తో మంచి అభిమానం సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది.
ఇక నా పేరు మీనాక్షి సీరియల్ కూడా శుభం కార్డు పలికిన సంగతి తెలిసిందే.

Hyper Aadi Pradeep Counters on Navya Swamy Ugadi Sankranthi Festivals

Advertisement

ఇక ఆమె కథ సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో బాగా సన్నిహితంగా ఉంటుంది. గతంలో వారి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి. కానీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. కానీ ఇప్పటికీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లలో, షో లలో పాల్గొని బాగా సందడి చేస్తుంటారు. పైగా ఇద్దరు కలిసి ఢీ డాన్స్ షోలో టీం లీడర్లుగా పని చేస్తున్నారు.

ఇక వారు అందులో వేసే డైలాగులు, చేసే జోకులు మాత్రం బాగా వైరల్ గా మారుతుంటాయి. అలా తాజాగా ఢీ ప్రోమోలో యాంకర్ ప్రదీప్ సంక్రాంతి రోజు కైట్ ఎందుకు ఎగిరేస్తారు అని అడగటంతో.. అప్పుడు వెదర్ కొంచెం కోపరేట్ చేస్తుంది కాబట్టి ఎగిరేస్తారు అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఇది ఎంతటి దౌర్భాగ్యం.. తనకు అది ఎందుకు ఎగరేస్తారో కూడా తెలీదా అంటూ తన పరువు తీస్తూ కామెంట్లు చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి