Home » Entertainment » Hyper Aadi Re Entry In Jabardasth And Chalaki Chanti
Entertainment

Hyper Aadi : చలాకి చంటి ఔట్, హైపర్ ఆది ఇన్‌.. ఇక జబర్దస్త్‌ జోరందుకోవడం ఖాయం

Authored By
aruna
The Telugu News | Published on: September 11, 2022, 8:30 pm
Advertisement

Hyper Aadi : జబర్దస్త్ కి మళ్లీ మంచి రోజులు వచ్చినట్లుగా అనిపిస్తున్నాయి. జబర్దస్త్ లో మళ్లీ హైపర్ ఆది ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారం టెలికాస్ట్ కాబోతున్న జబర్దస్త్ కార్యక్రమంలో ఆది స్కిట్ ఉండబోతుంది. హైపర్ ఆది స్కిట్ అంటే ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆసక్తిని చూపిస్తారో అందరికీ తెలిసిందే. వచ్చే వారం ఎపిసోడ్ చాలా ప్రత్యేకమైనదిగా జబర్దస్త్ అభిమానులు చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఎపిసోడ్ లో హైపర్ ఆది చాలా కాలం తర్వాత జబర్దస్త్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతే కాకుండా సుదీర్ఘ కాలంగా జబర్దస్త్ లో కొనసాగుతున్న చలాకీ చంటి ఆ ఎపిసోడ్ తో గుడ్ బై చెప్పేస్తున్నాడు.

Advertisement

ఇప్పటికే ఆ ఎపిసోడ్ షూట్ చేసి చాలా వారాలు అయింది. రెండు వారాల క్రితమే మల్లెమాల ఈటీవీ కి చలాకీ చంటి గుడ్ బై చెప్పేసాడు. ప్రస్తుతం చలాకి చంటి బిగ్ బాస్ షో లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కనుక వచ్చే వారం ఎపిసోడ్ తో చలాకి చంటి చివరి ఎపిసోడ్ అవుతుంది అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైపర్ ఆది విషయానికి వస్తే ఆయన జోరు రీఎంట్రీ తో మళ్ళీ కంటిన్యూ అవ్వబోతుంది. హైపర్ ఆదికి మంచి రీ ఎంట్రీ స్కిట్ పడింది. బ్యాండ్ బాజా తో హైపర్ ఆదికి జబర్దస్త్ స్టేజీ పైకి నిర్వాహకులు వెల్కమ్ చెప్పినట్టుగా స్కిట్ డిజైన్ చేశారు.

hyper aadi re entry in jabardasth and chalaki chanti

Advertisement

మొత్తానికి హైపర్ ఆది ఎంట్రీ తో జబర్దస్త్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అంటూ ఈ టీవీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బుల్లి తెర మీద జబర్దస్త్ సృష్టించిన సంచలనం ముందు ముందు కంటిన్యూ అవ్వబోతుంది అంటూ జబర్దస్త్ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. హైపర్ ఆది మాదిరిగానే సుడిగాలి సుదీర్ కూడా తిరిగి జబర్దస్త్ కి వస్తే బాగుంటుందని కొందరు అభిమానులు ఆశిస్తున్నారు. కానీ సుడిగాలి సుదీర్ రావడానికి ఛాన్స్ లేదు. హైపర్ ఆది వేరే ఛానల్ కు వెళ్లకుండా బ్రేక్ తీసుకున్నాడు.. కానీ సుడిగాలి సుదీర్ వేరే ఛానల్ కి వెళ్లి పోయాడు. కనుక జబర్దస్త్ లోకి సుడిగాలి సుధీర్ కి ఎంట్రీ ఉండదు అని ఈటీవీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి