Hyper Aadi Satires on Anchor Ravi in Navaratri Dhamaka Promo
Anchor Ravi : ఏ పండుగ వచ్చినా కూడా.. ఆ పండుగకు తగ్గట్టుగా షోలు, ఈవెంట్లు చేయడంలో మల్లెమాల ముందుంటుంది. ఇక ఈవెంట్‌ను మల్లెమాల టీం అద్భుతంగా నిర్వహిస్తుంటుంది. ఆ చానెల్, ఈ చానెల్ అని తేడా లేకుండా సెలెబ్రిటీలందరినీ పట్టుకొస్తుంటుంది. మామూలుగా అయితే బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయిన వాళ్లని స్టార్ మా ఎక్కువగా వాడుకోవాలి. కానీ ఈటీవీ, మల్లెమాల వాళ్లే ఎక్కువగా వాడుకుంటూ ఉంటున్నారు. తాజాగా దసరా స్పెషల్ ప్రోమోను వదిలారు.
దసరాకు మల్లెమాల స్పెషల్ ప్రోగ్రాం చేయబోతోంది. ధమాకా అంటూ ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సీనియర్ హీరోయిన్ ప్రేమ, సంఘవి వంటి వారు గెస్టులుగా వచ్చారు. చాలా రోజుల తరువాత ఈటీవీలో యాంకర్ రవి కనిపించాడు. యాంకర్, హోస్ట్‌గా ఈటీవీ షోలకు రావడం మానేశాడు రవి. కానీ ఇప్పుడు ఇలా ఈ షోకు వచ్చేశాడు రవి. అయితే దీనిపై ఆది సెటైర్లు వేశాడు.
Hyper Aadi Satires on Anchor Ravi in Navaratri Dhamaka Promo
ఆది వేసే కౌంటర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. రియాల్టీకి దగ్గరగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.అసలింతకీ ఆది ఏమన్నాడో చూద్దాం. దసరా హైద్రాబాద్‌లో బాగుంటుందని అర్జున్, విజయవాడలో బాగుంటుందని సుహాసిని పోట్లాడుతుంటారు. ఏం జరిగిందని ఆది మధ్యలోకి దూరుతాడు. ఇంతలో యాంకర్ రవి వచ్చి.. అటు వెళ్లాలా? ఇటు వెళ్లాలా? అని ఆలోచిస్తున్నా అని అంటాడు. ఇది అర్థం తెలియకే.. అన్ని చానెళ్లు తిరిగేస్తున్నావ్ అంటూ గాలి తీసేస్తాడు ఆది. దీంతో యాంకర్ రవి నోరు మూసుకుంటాడు. అందరూ పగలబడి నవ్వేస్తుంటారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.