
Hyper Aadi Satires on Jani Master In Dhee Show
Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆది ఎవరి మీదనైనా సెటైర్లు వేయగలడు. ఆది వేసే పంచులను అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. అసలే ఆదిని జబర్దస్త్ షోలో మిస్ అవుతున్నామని జనాలు చాలా ఫీలవుతున్నారు. కానీ ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోల్లో అయితే ఆది దుమ్ములేపేస్తున్నాడు. మరి జబర్దస్త్ షోకు ఎప్పుడు వస్తాడో తెలీదు గానీ ఈ రెండు షోల్లో అయితే నవ్వులు పంచుతున్నాడు. తాజాగా జరిగిన ఢీ షోలో అనిల్ రావిపూడి సందడి చేశాడు.
Hyper Aadi Satires on Jani Master In Dhee Show
అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా రాబోతోన్నాడు. ఎఫ్ 3 సినిమా ప్రమోషన్లలలో భాగంగా అనిల్ రావిపూడి బుల్లితెరపై అన్ని షోల్లో కనిపిస్తున్నాడు. స్టార్ మా, ఈటీవీ అన్ని షోల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈక్రమంలో ఢీ షోకు వచ్చాడు. అనిల్ రావిపూడిలో మంచి డ్యాన్సర్, నటుడు ఉన్నాడనే విషయం తెలిసిందే. ఢీ షోలో అనిల్ రావిపూడి అదిరిపోయేలా డ్యాన్సులు వేశాడు. ఇక ఇందులో చివరకు జడ్జ్‌లు అందరూ కలిసి డ్యాన్సులు వేశారు.
ప్రియమణి, నందిత, జానీ మాస్టర్ ఇలా అందరూ కలిసి స్టెప్పులు వేశారు. అయితే ఈ క్రమంలోనే ఆది నేరుగా వెళ్లి జడ్జ్ సీటులో కూర్చున్నాడు. పక్కనే అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. జానీ మాస్టర్ చేసిన పర్ఫామెన్స్‌కు ఆది జడ్జ్ మెంట్ ఇచ్చాడు. అది కూడా జానీ మాస్టర్ స్టైల్లోనే. జానీ మాస్టర్ ఎలాగైతే చేస్తాడో, మాట్లాడతాడో అలానే జడ్జ్ మెంట్ ఇచ్చాడు. అతని పేరు ఏంటి.. అని జానీ మాస్టర్ తెలియనట్టుగా అనిల్ రావిపూడిని ఆది పేరు అడుగుతాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు.
ఆ జానీ కదా?.. అంతా బాగానే ఉంది కానీ డ్యాన్స్ ఎక్కడమ్మా.. అని పరువుతీసేస్తాడు ఆది. గతంలోనూ జానీ మాస్టర్ ఇలానే అంటాడు. అదే డైలాగ్‌ను ఆది ఇక్కడ వాడేస్తాడు. ప్రియమణి బాగా చేసింది. ఒకసారి ఇటు రా అని ఆది కాస్త ఓవర్ చేస్తాడు. కానీ ప్రియమణి మాత్రం స్టేజ్ మీద నవ్వుతూ అలా ఉండిపోతుంది.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.