Categories: EntertainmentNews

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Advertisement
Advertisement

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మెప్పు పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో.. తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన సత్యదేవ్, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Advertisement

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : ప్రముఖ నటుడు సత్యదేవ్

Satyadev  : ‘కింగ్‌డమ్’ లాంటి భారీ సినిమాలో శివ అనే పవర్ ఫుల్ రోల్ చేశారు.. స్పందన ఎలా ఉంది ?

ఇప్పటిదాకా ఈ సినిమాకి వచ్చినన్ని ఫోన్ కాల్స్ నాకు ఎప్పుడూ రాలేదు. మొదటి షో నుంచి అందరూ ఫోన్లు చేసి అభినందిస్తూనే ఉన్నారు. గౌతమ్ నాకు కింగ్‌డమ్ కథ చెప్పగానే ఎలాంటి లెక్కలు వేసుకోకుండా వెంటనే ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను. అంత నచ్చింది నాకు ఈ కథ. నా నమ్మకం నిజమై, ఇప్పుడు సినిమాకి ఇంతటి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాకి నాకు పేరొచ్చింది కానీ, అది జనాల్లోకి వెళ్ళడానికి సమయం తీసుకుంది. భారీతనం, విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి అంశాలు తోడై.. ‘కింగ్‌డమ్’ సినిమా తక్కువ సమయంలోనే ఎక్కువమందికి చేరువైంది. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను.

Advertisement

Satyadev  శివ పాత్ర మీ దగ్గరకు ఎలా వచ్చింది?

శివ పాత్ర కోసం మొదట గౌతమ్ నా పేరే రాసుకున్నారట. కానీ, ఏవో కారణాల వల్ల నన్ను సంప్రదించలేదు. మధ్యలో వేరే నటులతో కూడా చేద్దామనుకున్నారు. సరిగ్గా షూటింగ్ కి వెళ్ళడానికి కొద్దిరోజుల ముందు గౌతమ్ నన్ను కలిసి ఈ కథ చెప్పారు. కథ నాకు విపరీతంగా నచ్చి, వెంటనే సినిమా చేస్తున్నాని చెప్పాను. అప్పుడు గౌతమ్ ‘శివ పాత్ర కోసం నేను మొదట ఎవరి పేరు రాసుకున్నానో.. వాళ్ళతోనే చేస్తుండటం సంతోషంగా ఉంది’ అని చెప్పారు. ‘మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది’ అంటారు కదా.. అలాగే ఏ పాత్ర ఎవరు చేయాలనేది కూడా రాసి పెట్టి ఉంటుందేమో అనిపించింది.

ఈ సినిమాలో మీ యాక్షన్ సీన్స్ కి అద్భుతమైన స్పందన రావడం ఎలా అనిపించింది?

ఎప్పుడైనా యాక్షన్ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే దాని వెనుక బలమైన ఎమోషన్ ఉండాలని నేను నమ్ముతాము. ఇందులో అలాంటి ఎమోషన్ ఉంది కాబట్టే.. నా యాక్షన్ సీన్స్ కి అంత మంచి స్పందన వస్తోంది.

ఈ చిత్రంలో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సీన్ ఏంటి?

విజయ్ నా తమ్ముడు అని తెలిసిన తర్వాత జైల్లో మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తమ్ముడంటే మనసులో ఎంతో ప్రేమ ఉన్నా.. పైకి మాత్రం అది పూర్తిగా చూపించకూడదు. ఎందుకంటే తమ్ముడు ‘నాతో ఉండిపోతాను’ అంటాడనే భయం నాలో ఉంటుంది. అసలు గౌతమ్ నా పాత్రను రాసిన తీరే అద్భుతంగా ఉంది. ఓ వైపు తమ్ముడు, మరోవైపు దివి ప్రజలు, ఇంకో వైపు ఒక నిజం తెలుసు కానీ ఎవరికీ చెప్పలేడు. ఇలా ఆ పాత్ర చుట్టూ ఎంతో ఎమోషన్ ఉంది. అందుకే డ్రామా అంతలా పండింది. సినిమాలో ఫిజికల్ గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ మాత్రం ప్రీ క్లయిమాక్స్ ఎపిసోడ్. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూశాక.. ఆ కష్టమంతా మరిచిపోయాను.

సినిమాలో ఉన్న హైలైట్స్ లో బోట్ సీక్వెన్స్ కూడా ఒకటి.. దాని గురించి చెబుతారా?

ఆ సీక్వెన్స్ కోసం కూడా చాలా కష్టపడ్డాము. నిజానికి నాకు బోట్ డ్రైవ్ చేయడం రాదు. కానీ, నన్ను నమ్మి విజయ్ బోట్ లో కూర్చోవాలి. ఆ నీటి ప్రవాహానికి తగ్గట్టుగా దానిని నడపాలి. కుడి వైపుకి తిప్పితే ఎడమ వైపుకి వెళ్తుంది.. ఎడమ వైపుకి తిప్పితే కుడి వైపుకి వెళ్తుంది. మొదట చాలా భయం వేసింది. ఆ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడ్డాము. ఓసారి చెట్ల కొమ్మల్లోకి వెళ్ళిపోయాము, మరోసారి చెట్టు మీద పడబోయింది. దాంతో బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ బోట్ నడిపాను.

మురుగన్ పాత్ర పోషించిన వెంకటేష్ గురించి?

ఈ సినిమాలో విజయ్ కి, నాకు ఎంతో పేరు వచ్చిందో వెంకటేష్ కి కూడా అంత పేరు వచ్చింది. అద్భుతంగా నటించాడు. షూటింగ్ సమయంలోనే బాగా నటిస్తున్నాడని మేమందరం అనుకున్నాం. ఇప్పుడు ప్రేక్షకులు కూడా అదే మాట చెప్తున్నారు. ఒక కొత్త నటుడికి ఇంత పేరు రావడం మామూలు విషయం కాదు.

విజయ్ దేవరకొండ గారి గురించి?

విజయ్ తో నాకు అంతకముందు పరిచయం లేదు. కలిసిన తర్వాత తెలిసింది విజయ్ చాలా మంచి వ్యక్తి అని. తక్కువ సమయంలోనే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. విజయ్ ని నేను నిజంగానే ఒక బ్రదర్ లా ఫీల్ అయ్యాను. విజయ్ అంత మంచి వ్యక్తి కావడం, నాతో అంత మంచిగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. అలాగే, విజయ్ గొప్ప నటుడు. సన్నివేశాన్ని కానీ, సంభాషణలను కానీ అతను అర్థం చేసుకొని నటించే తీరు నన్ను ఆశ్చర్యపరిచింది.

నిర్మాత నాగవంశీ గారి గురించి?

నాగవంశీ గారు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. ఒక కథను నమ్మి సినిమా చేద్దాం అనుకున్నారంటే.. ఎక్కడా వెనకడుగు వేయరు, ఏ విషయంలోనూ రాజీపడరు. పరిశ్రమలో వంశీ గారు తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకున్నారు కాబట్టే.. సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంత పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది. వంశీ గారంటే నాకెప్పుడూ గౌరవం ఉంటుంది.

శివ పాత్రకు ఇంత పేరు రావడానికి కారణం?

మనం బాగా నటించినంత మాత్రాన మనకి బాగా పేరు రావాలని లేదు. ఆ పాత్రను రాసిన తీరు బాగుంటే.. అప్పుడు మన నటనకు ఎక్కువ పేరు వస్తుంది. శివ పాత్రను గౌతమ్ అద్భుతంగా మలిచారు. ఆ పాత్రలో ఎన్నో లేయర్లు ఉన్నాయి. ప్రేక్షకులు ఆ పాత్రలో ఉన్న ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి.. ట్రావెల్ అవుతున్నారు. గౌతమ్ యొక్క అంత అందమైన రచన వల్లే.. నా పాత్రకు ఇంత పేరు వచ్చింది.

ఈ సినిమాకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?

ఒక్కరిని కాదు. చాలామంది ప్రశంసించారు. ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి నన్ను అభినందించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

తదుపరి ప్రాజెక్ట్ లు?

అరేబియన్ కడలి అనే సిరీస్ చేశాను. అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ‘ఆరంభం’ ఫేమ్ అజయ్‌ నాగ్‌ తోనూ ఓ చిత్రం చేస్తున్నాను. వీటితో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
కళా దర్శకుడు: అవినాష్‌ కొల్లా
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Recent Posts

Karthika Deepam 2 Today Episode: నిజం అంచుల వరకు వచ్చి ఆగిన క్షణాలు.. కాశీ–స్వప్నల మధ్య విడాకుల తుఫాన్

Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…

1 hour ago

Bhartha Mahasayulaki Wignyapthi Movie Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bhartha Mahasayulaki Wignyapthi :  మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…

2 hours ago

Chandrababu Sankranthi Kanuka : సంక్రాంతి పండగవేళ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…

2 hours ago

Mahindra XUV 7XO : కస్టమర్లు ఎదురుచూస్తున్నా మహీంద్రా XUV 7XO .. సూప‌ర్ లుక్‌లో XUV..!

Mahindra XUV 7 XO :  భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…

3 hours ago

Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా మానియా.. తొలి రోజు ఫైరింగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోయిన చిరు చిత్రం

Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…

3 hours ago

Goat Head Curry : మేక తలకాయ కూర : పోషకాలతో నిండిన ఆరోగ్యవంతమైన డిష్..తింటే ఎన్ని లాభాలు..!

Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…

4 hours ago

Zodiac Signs January 13 2026 : జ‌న‌వ‌రి 13 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…

5 hours ago