If Bimbisara Movie Flop will Kalyan Ram stop movies
Bimbisara Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమాకు భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలను నిర్వహించారు.. ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొనడం ద్వారా సినిమా కు భారీ హైప్ ఐతే వచ్చింది. అలాగే సినిమా యొక్క ట్రైలర్ చూసిన తర్వాత మేటర్ ఉన్న సినిమా అయి ఉంటుంది అంటూ నందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బింబిసార అనే వ్యక్తి గురించి జనాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.
ఆయన గురించి నందమూరి కళ్యాణ్ రామ్ అని చెప్పాడు.. ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంది. హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ ప్రారంభించి రెండు దశాబ్దాలకు పైగా నే అవుతున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా ఇప్పటి వరకు ఆయన కమర్షియల్ గా హిట్ అయ్యింది పెద్దగా లేదు. ఆయన కెరియర్ మొత్తం కూడా ఫ్లాపులతో నే కొనసాగింది. బయట హీరో అయితే కచ్చితంగా ఈ పాటికి అందరూ మర్చిపోయే వారు. అలాంటి ఫ్లాప్ లు కళ్యాణ్రామ్ కి పడ్డాయి. అయినా కూడా నందమూరి కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకొని అందులో సినిమాల నిర్మిస్తూ వరుసగా నటిస్తూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే నందమూరి కళ్యాణ్ రామ్ కి ఏకంగా 50 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు గా సమాచారం అందుతోంది.
If Bimbisara Movie Flop will Kalyan Ram stop movies
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా నందమూరి కళ్యాణ్ రామ్ కి స్థాయికి అంతగా వసూలు రావు అనేది మరి కొందరి వాదన. ఇలాంటి పరిస్థితిలో సినిమాలు చేయడం అవసరమా, ఇంతగా నష్టాలు వచ్చే సినిమాలను చేయడం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బింబిసార సినిమా ఫ్లాపయితే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తన సినీ కెరీర్ ని ముగించి నిర్మాతగా కొనసాగడం మంచిది అంటూ నందమూరి అభిమానులు స్వయంగా సలహా ఇస్తున్నారు. నందమూరి హీరోలు అంటే ఇతర హీరోల ఫ్యాన్స్ చులకన భావనతో చూసే విధంగా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలు ఉన్నాయి అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నందమూరి కళ్యాణ్రామ్ ఆలోచిస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
This website uses cookies.