NTR : చిత్తూరి వి. నాగయ్య ఈ పేరు ఈ తరం వాళ్లకు అంతగా పరిచయం లేదనే చెప్పాలి. కానీ బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో నాగయ్య కోసం నిర్మాతలు దర్శకులు బ్రహ్మరథం పట్టేవారు. ఇక నాగయ్య ఒక హీరోనే కాదు సంగీత దర్శకుడు , సినీ దర్శకుడు కూడా… అంతేకాదు అతి తక్కువ ఖర్చుతో సినిమాను తీయడంలో నాగయ్యను మించిన వారు ఎవరు ఉండరు. ముందు ఖర్చు తగ్గించుకుని అడుగులు వేస్తేనే మంచిదనే అభిప్రాయం నాగయ్య. ఇక ఎంత ఖర్చు తగ్గించి సినిమా తీసిన అంత రాబడి వచ్చేదట ఆయన సినిమాలకు. ఇక నాగయ్య హీరోగా వేమన సినిమాను కూడా తీశాడు. ఇక ఈ సినిమా వచ్చినప్పుడు పోలీసులు లాటి ఛార్జ్ చేసి మరి ఆయన అభిమానులను కంట్రోల్ చేసేవారట. ఈ ఒక్క విషయం చాలు ఆయనకు అప్పట్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం అవ్వడానికి.
అంతే కాదు హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యూనికేషన్ తీసుకునేవారట నాగయ్య. తన సినీ జీవితంలో ఎంత సక్సెస్ ను అందుకున్న ఆయనకు ఉన్న పెద్ద వెలితి ఆయనకు పిల్లలు లేకపోవడం. దీంతో ఆయన పై అపారమైన అభిమానం చూపించే అక్కినేని నాగేశ్వరరావు మరియు ఎన్టీఆర్ లను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేవారు నాగయ్య. దీంతో వారు కూడా నాగయ్యను నాన్నగారు అని పిలిచేవారట. అయితే నాగయ్య తన జీవితంలో డబ్బును ఎక్కువగా వృధా చేసేవాడట. ఏదైనా అధునాతనంగా కనిపిస్తే వెంటనే దాన్ని కొనేవారట.ఆయనకు కారు ల మీద ఉన్న మక్కువతో ఎక్కువ కారులను కొనేవారట. అలాగే సినీ ఆర్టిస్టులను అందరిని కారులో ఎక్కించుకొని ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకెళ్లేవారట.
ఇక తన వద్దకు ఎవరైనా వస్తే వారికి చేతిలో ఏదైనా పెట్టకుండా పంపేవారు కాదట నాగయ్య. అలాగే నాగయ్యకు తాను పుట్టిన ఏపీ అంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతోనే ఏపీ నుంచి ఎవరైనా మద్రాస్ వచ్చి సినిమాల కోసం ప్రయత్నిస్తే వారికి సహాయం చేసే వారట నాగయ్య. ఈయన ద్వారా వచ్చినవాళ్లు ఎంతమంది హీరోలుగా ఎదిగారు. వీరిలో శోభన్ బాబు కూడా ఒకరిని చెప్పాలి. అయితే చివరికి నాగయ్యకున్న ఈ మంచి అలవాటే ఆయన దగ్గర ఒక రూపాయి లేకుండా చేసేసిందట. ఈ విషయంపై ఎన్టీఆర్ పలుమార్లు నాన్నగారు డబ్బు వృధా చేస్తున్నారని హెచ్చరించిన ఆయన సుతిమెత్తగా నవ్వి,ఇదంతా నేనేమన్నా సంపాదించానా పైవాడు ఇచ్చిందే కదా అనే వాడట నాగయ్య. ఇక నాగయ్య చివరి దశలో అంతక్రియలకు అన్నగారు ఖర్చు చేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారట. ఇక అన్నగారు తన స్వయం ఖర్చుతో నాగయ్యను సాగనంపినట్లుగా గుమ్మడి బుక్ లో రాసుకున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.