Home » Entertainment » Indraja Comments On Hyper Aadi At Sreedevi Drama Company Latest Promo
Entertainment

Indraja VS Hyper Aadi : అరే.. హైప‌ర్ ఆది నువ్వు నిక్క‌ర్లు వేసుకున్న కాలంలో నేను హీరోయిన్ .. ప‌రువు తీసిన ఇంద్ర‌జా..!

Authored By
aruna
The Telugu News | Published on: January 15, 2024, 1:00 pm
Advertisement

Indraja VS Hyper Aadi : తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. శ్రీదేవి డ్రామా కంపెనీ Sreedevi drama company మూడవ యానివర్సరీ సందర్భంగా లేటెస్ట్ ఎపిసోడ్ ను స్పెషల్ గా ప్లాన్ చేస్తారు. ఈ సందర్భంగా హైపర్ ఆదికి ఇంద్రజ Indraja మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. షో మొదలవగానే హైపర్ ఆది , ఆటో రాంప్రసాద్  Auto Ramprasad ఎంట్రీ ఇచ్చారు. తమదైన పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సరదా సరదా ఎపిసోడ్లకే పంచులు వేస్తుంటాం ఇప్పుడు థర్డ్ అనివర్సరీ కాబట్టి పంచులు అదిరిపోతాయని హైపర్ ఆది అంటారు. ఆ తర్వాత బద్రీనాథ్ లోని పాటను సింగర్ అద్భుతంగా పాడారు. దీంతో ఇంద్రజ ప్రపంచం మెచ్చుకునే సింగర్ గా గొప్ప స్థాయికి వెళతారని పొగడారు. ఆ తర్వాత ఎప్పటిలాగే గేమ్ ను పెట్టారు. ఎల్లో కలర్ లైన్ దాటకుండా జోడి ముందుకు రావాలని హైపర్ ఆది అన్నారు.

Advertisement

ఆ స్కిట్ లో భాగంగా ఫైమా Faima, ప్రవీణ్ Praveen మధ్య లవ్ ట్రాక్ను హైపర్ ఆది Auto Ramprasad మళ్లీ తెరపై తీసుకొచ్చారు. ఆ తర్వాత కండక్టర్ ఝాన్సీ గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ రు ఊర మాస్ స్టెప్పులేసి ప్రోమో ని హైలెట్ చేశారు. ఆమె డాన్స్ తో స్టేజ్ మొత్తం షేక్ అయిపోయింది. ఇక ప్రేక్షకులలో కూడా ఈ ప్రోమో చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక తర్వాత ఇంద్రజ అరే ఆది నువ్వు నిక్కర్లు వేసుకున్న కాలం నుంచి నేను హీరోయిన్ ని అని అంటారు. వెంటనే హైపర్ ఆది ఏరా ఇంద్రజ అంటారు. దీంతో స్టేజిపై ఉన్న వాళ్లంతా షాక్ అవుతారు. అలా ప్రోమో ఎండ్ అవుతుంది. దీంతో హైపర్ ఆది ఇంద్రజాను ఏరా అనడం ఆసక్తికరంగా మారింది. హైపర్ ఆది అన్నమాట లకు ఇంద్రజ ఎలా రిప్లై ఇచ్చారు అన్నది షో ప్రసారం అయ్యే రోజు చూడవలసిందే.

బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి విపరీతమైన క్రేజ్ ఉంది. మరి ముఖ్యంగా హైపర్ ఆది పంచులకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఈమధ్య సినిమాల మీద ఫోకస్ పెట్టినా బుల్లితెరపై కూడా నటిస్తున్నారు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేస్తూ బిజీగా ఉన్నారు. వెండితెరపై అవకాశాలు వస్తున్న వాటితో అంతగా గుర్తింపు రావడం లేదు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారం అవుతుంది. తాజాగా వచ్చిన శ్రీదేవి లేటెస్ట్ ప్రోమో ఎప్పటిలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీ థర్డ్ యానివర్సరీ సందర్భంగా కాస్త ఎక్కువగా సెలబ్రేషన్స్ చేసినట్లుగా ఉన్నారు. ఈ క్రమంలోని హైపర్ ఆది ఇంద్రజ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది దీంతో ప్రోమో పై హైప్ పెరిగింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి