Rashmi Gautam : రష్మీ వయసు మీద దారుణమైన కామెంట్లు.. ఇంద్రజ మామూల్ది కాదు
Rashmi Gautam : యాంకర్ రష్మీ వయసు మీద ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆమెకు ఎప్పుడో పెళ్లి అయిందని, విడాకులు జరిగాయని ఇలా రకరకాల రూమర్లు వస్తుంటాయి. ఇక ఆమె వయసు మీద అప్పుడప్పుడు స్కిట్లలో కౌంటర్లు పడుతూనే ఉంటాయి. అయితే రష్మీ ఎప్పుడూ కూడా తన వయసు మీద నేరుగా కామెంట్లు చేయలేదు. తన వయసు ఇంతా అని ఎప్పుడూ చెప్పలేదు. రష్మీ వయసు మీద ఇది వరకే సుధీర్ గ్యాంగ్ నానా రకాలుగా కామెంట్లు వేసింది. ఎప్పటి నుంచో రష్మీ ఇండస్ట్రీలో ఉందంటూ, ఆమె ఎప్పటి కాలానికి చెందినదో అంటూ ఇలా కౌంటర్లు వేస్తుంటారు.
ఉదాహరణకు హోళీ సినిమాను కూడా చూపిస్తుంటారు. నీకంటే చాలా పెద్దది అంటూ సుధీర్ మీద పలు మార్లు కౌంటర్లు వేశారు గెటప్ శ్రీను, రాం ప్రసాద్. అలా ప్రతీ సారి ఆది, రాం ప్రసాద్, గెటప్ శ్రీను, సుధీర్‌లు రష్మీ వయసు మీద సెటైర్లు వేస్తుంటారు. తాజాగా ఇంద్రజ కూడా రష్మీ వయసు మీద కౌంటర్లు వేసింది. ఆ కౌంటర్లు విని రష్మీ మొహం మాడిపోయినట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది.
Indraja Satires on Rashmi Gautam Age In Extra Jabardasth Promo
ఇందులో సీరియల్ నటి నటకుమారి వచ్చింది. తన ఇద్దరు కూతుళ్లు అంటూ స్కిట్ వేసింది. దీంతో నట కుమారి మీద రష్మీ ఓ డైలాగ్ వేసింది. మీకు ఇద్దరు పిల్లలా? మీరు ఇంత యంగ్‌గా ఉన్నారు కదా? అని రష్మీ అంటుంది. దీంతో మధ్యలోకి ఇంద్రజ దూరుతుంది. ఏ వయసు వాళ్లకి ఆ వయసు వాళ్లు అలానే యంగ్‌గా కనిపిస్తారు అంటూ కౌంటర్ వేసింది. అంటే రష్మీ, నట కుమారి ఒకే ఏజ్‌కు సంబంధించిన వాళ్లు అని ఇంద్రజ అనేసింది.
