Home » Entertainment » Interesting News About Heroine Samyuktha Menon
Entertainment

Samyuktha Menon : తన తండ్రి పేరు తీసేయడం గురించి హీరోయిన్ సంయుక్త మీనన్ ఏం చెప్పిందో చూడండి !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 15, 2023 6:52 pm
Advertisement

Samyuktha Menon : తెలుగు పరిశ్రమలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతారు. అందులో ఒకరే సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. లేటెస్ట్ గా సంయుక్త సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో సంయుక్త నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అమ్మడి క్రేజ్ విపరీతంగా పెరిగింది. అంతకుముందు ధనుష్ ‘ సార్ ‘ సినిమాలో నటించి మంచి హిట్ ను అందుకుంది.

Advertisement

interesting news about heroine Samyuktha Menon

ఇప్పుడు విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. ఆమె చేసిన పాత్రకు ప్రేక్షకులు కొత్త థ్రిల్ కు గురి కావటం ఖాయం. ఈ తరహా పాత్రల్ని చేయడానికి గ్లామర్ హీరోయిన్స్ సంకోచించే వేళా అందుకు భిన్నంగా ఆమె తీసుకున్న నిర్ణయం మెచ్చుకోవాల్సిందే. ఇక సంయుక్త సమంతకు వీరాభిమాని. టెన్త్ లో ఉన్నప్పుడు బస్సులో ధనుష్ నటించిన ఆడుగళం సినిమాలోని పాటలు చూసి స్టెప్పులు ప్రాక్టీస్ చేసేదాన్ని అని చెప్పింది. అలాంటి తనకు ఏకంగా ధనుష్ పక్కన నటించే అవకాశం రావడం తన లక్ అని తెలిపింది. తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలు ఇష్టమని చెప్పుకొచ్చింది.

Advertisement

కోపం ఎక్కువేనని,ఒకసారి తాను తన తల్లి కలిసి బయటికి వెళుతుంటే, ఒక వ్యక్తి సిగరెట్ కాల్చి తమ మీద వదిలాడని దీంతో కోపంతో అతడి చెంప పగలగొట్టానని చెప్పుకొచ్చారు. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారని, అందుకే తండ్రి పేరును తన పేరులోంచి తీసేసినట్లు చెప్పారు. తనకు జర్నీలు అంటే ఇష్టమని, హిమాలయాలకు అప్పుడప్పుడు వెళుతూ ఉంటానని, ఖాళీ టైంలో కవితలు రాస్తూ ఉంటానని చెప్పింది. మొత్తానికి గ్లామర్ హీరోయిన్ చెప్పే మాటలకి అభిమానులు తమ ప్రేమ కురిపిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి