Home » Entertainment » Interesting News On Rashmika Mandanna
Entertainment

Rashmika mandanna : రష్మిక మందన్నకి షాక్.. గుడి కడతారనుకుంది.. ఇప్పుడేం చేస్తారో..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: April 2, 2021 9:29 pm
Advertisement

Rashmika mandanna : రష్మిక మందన్న కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ సినిమా సూపర్ హిట్ అవడంతో తెలుగులో వరసగా అవకాశాలు అందుకుంది. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికి గీత గోవిందం, సరిలేరి నీకెవ్వరు, భీష్మ సినిమాలతో ఏకంగా పాన్ ఇండియన్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. అంతేకాదు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కూడా క్రేజ్ సంపాదించుకుంది. సుకుమార్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుండటంతో రష్మిక క్రేజ్ మరో రెంజ్‌కి చేరుకుంది. ఈ క్రేజ్ వల్ల రష్మిక మందన్నకి బాలీవుడ్ సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది. యంగ్ హీరో సిద్దార్థ్ మల్‌హోత్రాకి జంటగా మిషన్ మజ్ఞు సినిమా తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తోంది. ఇంతక ముందే మిషన్ మజ్ఞు సినిమా షూటింగ్ మొదలవగా తాజాగా అమితాబ్ – రష్మిక మందన్నల గుడ్ బాయ్ సెట్స్ మీదకి వచ్చింది.

interesting news On rashmika mandanna

Advertisement

Rashmika mandanna : సుల్తాన్ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదన్న టాక్ వినిపిస్తోంది..!

అయితే రష్మికకి తెలుగు, హిందీ సినిమాలతో పాటు తమిళ సినిమాలో నటించే అవకాశం అందుకొని అందరికీ షాకిచ్చింది. కార్తి సరసన సుల్తాన్ సినిమాలో నటించిన రష్మిక ఈ సినిమాతో కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అవుతుందని భావించారు. కోలీవుడ్‌లో హీరోయిన్ క్రేజ్ చూసి అభిమానులు ఏకంగా గుడి కట్టేస్తారన్న సంగతి తెలిసిందే. రష్మికకి అదే జరుగుతుందని అందరు అనుకున్నారు. కానీ సుల్తాన్ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదన్న టాక్ వినిపిస్తోంది. మరి మరో సినిమాలో అవకాశం దక్కించుకొని హిట్ అందుకుంటుందా లేక కోలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందా మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి