Intinti Gruhalakshmi 04 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 జనవరి 2022, బుధవారం ఎపిసోడ్ 833 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, శృతి ఇద్దరూ సరదాగా గడుపుతుంటారు. ఇంతలో అంకిత, అభి, దివ్య వస్తారు. వాళ్లను ఆటపట్టిస్తారు. దీంతో వాళ్లు షాక్ అవుతారు. ఇంతలో అక్కడికి లాస్య వస్తుంది. వావ్.. అందరూ సంతోషంగా ఉన్నారు. పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటుంది. కానీ.. నేను కూడా సంతోషపడాలంటే.. అంకిత కూడా తల్లి అవుతుందనే శుభవార్త చెప్పినప్పుడు అంటుంది లాస్య. నువ్వు పెద్దకోడలువు. ఇంకా నీకు ఆ అదృష్టం లేకపోయిందే అని అంటుంది లాస్య. దీంతో అందుకు నాకేం బాధ లేదు అంటుంది అంకిత. దీంతో ఖచ్చితంగా నీకు బాధ ఉంటుంది కానీ.. బయటపడటం లేదు అంటుంది లాస్య.
నువ్వేం అంటావు శృతి అంటే శృతి ఏం మాట్లాడదు. ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేయడం అవసరమా ఆంటి అంటాడు అభి. దీంతో ఖచ్చితంగా ఉండాలి అంటాడు. ఇప్పుడే కదా పాజిటివ్ వైబ్స్ అన్నావు కదా అంటుంది తులసి. అయినా ఎవరి అదృష్టం వారిది. నీలా కుళ్లుకునే తత్వం మాది కాదు అంటుంది అంకిత. దీంతో ఎంతైనా నువ్వు డాక్టర్ వి కదా. ఇద్దరూ ఒకసారి చెకప్ చేయించుకోండి అంటుంది లాస్య. దీంతో అంకిత చాలా ఇబ్బంది పడుతుంది. అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది అంకిత.
మీరు నన్ను వదిలేసి పోయినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని మనసులో అనుకుంటుంది లాస్య. మరోవైపు గుడికి వెళ్తారు పరందామయ్య, అనసూయ. ఎప్పుడు గుడికి రమ్మన్నా రాకపోయేవారు. ఈరోజు ఏంటి గుడికి వచ్చారు. భక్తి పెరిగిందా అంటే.. దేవుడి మీద శ్రద్ధ పెరిగింది అంటాడు పరందామయ్య.
ఈ గుడిలో ప్రసాదం కూడా బాగుంటుందట అంటాడు పరందామయ్య. ప్రసాదం కోసం మీరు వచ్చారా అంటుంది అనసూయ. చెంపలు వేసుకోండి అంటుంది. పదండి.. దేవుడికి దండం పెట్టుకుందాం అంటుంది.
కట్ చేస్తే అదే గుడికి సామ్రాట్, హనీ, తులసి కారులో వస్తారు. మీరు తరుచూ ఈ గుడికి వస్తారా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో అవును.. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది తులసి.
తర్వాత గుడిలోపలికి వెళ్లి దేవుడికి పూజ చేస్తారు పరందామయ్య, అనసూయ. ప్రసాదం ఎక్కడ పెడుతున్నారో అని వెతుకుతుంటాడు పరందామయ్య. పూజ అయిపోగానే.. అక్కడి నుంచి బయటికి వస్తారు పరందామయ్య, అనసూయ.
ఇంతలో తులసి, సామ్రాట్, హనీ దేవుడి దగ్గరికి వెళ్లి పూజ చేస్తారు. హనీతో గంట కొట్టించేందుకు ఇద్దరూ వంగబోతారు. దీంతో ఇద్దరూ కలిసి కొట్టండి. ఏం అనుకోను అంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి హనీకి గంట కొట్టిస్తారు.
ఇంతలో పూజారి వచ్చి పాప చాలా ముద్దుగా ఉంది. భార్యాభర్తలు అన్నాక పిల్లలకు ఇద్దరూ కలిసి అలాగే.. గంట కొట్టాలి అంటాడు పూజారి. దీంతో పూజారి గారు మేము ఇద్దరం భార్యాభర్తలం కాదు అంటుంది తులసి.
దీంతో తప్పు అయింది క్షమించండి అంటాడు పూజారి. మరి ఆయన మీకు ఏమవుతారు అంటే స్నేహితుడు అంటుంది తులసి. ఆ తర్వాత తులసి ఆంటి నాకు ఐస్ క్రీమ్ కొనిస్తా అన్నారు అంటే.. రా కొనిస్తా అని చెప్పి తీసుకెళ్తుంది తులసి.
మరోవైపు లాస్య అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అంకిత. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతలో శృతి, ప్రేమ్ వచ్చి అంకిత ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. దీంతో ఏం లేదు ప్రేమ్ అంటుంది.
దీంతో లాస్య అన్నమాటలకు బాధపడుతున్నావా అంటుంది శృతి. ఆమె సంగతి తెలుసు కదా. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే, ఆనందంగా ఉంటే తట్టుకోలేదు అంటాడు ప్రేమ్. శృతి ఈ ఇంటికి వచ్చిన కొత్తలో మా మధ్య కొన్ని మనస్పర్థలు ఉండేవి. కానీ.. ఆ తర్వాత అవి తగ్గిపోయాయి అంటుంది అంకిత.
అప్పటి నుంచి ఇద్దరం ఒక కన్నతల్లి బిడ్డల్లా కలిసిపోయాం. ఎప్పుడైనా నీ విషయంలో ఈర్ష్యా ద్వేషం కనిపించాయా? అలా బిహేవ్ చేశానా? అంటుంది అంకిత. దీంతో తనేదో వాగింది ఎందుకు అలా సీరియస్ గా తీసుకుంటున్నావు అంకిత అంటుంది శృతి.
నాకు ఏం తోచడం లేదు అంటుంది అంకిత. ఇంతలో దివ్య వచ్చి లాస్య ఆంటి మైండ్ గేమ్స్ ఆడుతోంది అంటుంది దివ్య. పిల్లలు లేరు అనే బాధ నాకూ ఉంది కానీ.. అది నా వరకే అంటుంది అంకిత.
తీర్థం తీసుకున్న తర్వాత తీర్థం ఒక్కటే ప్రసాదం కాదు కదా అంటాడు పరందామయ్య. ఏంటి సంగతి.. చిన్నపిల్లాడిలా ప్రసాదం కోసం అంత ఆరాటం ఎందుకు అంటుంది అనసూయ. దీంతో కాస్త అయినా కడుపు నిండుతుంది కదా అంటాడు పరందామయ్య.
నీకు తెలుసు కదా. ఇంటికి వెళ్తే ఇది కావాలి అని అడిగే దిక్కు లేదు. ఇక్కడ తింటే కాస్తయినా కడుపు నిండుతుంది కదా అంటాడు పరందామయ్య. దీంతో వెళ్లి ప్రసాదం తీసుకురండి అంటుంది అనసూయ.
ప్రసాదం కోసం లైన్ లో నిలబడతాడు పరందామయ్య. తన వంతు వస్తుంది. ఇంకో కప్పు ఇవ్వు అంటే… అతడు ఇవ్వడు. పరందామయ్యను తిడతాడు. దీంతో అనసూయ వెళ్లి అతడితో గొడవ పెట్టుకుంటుంది. ఇదంతా సామ్రాట్, తులసి చూస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.