intinti gruhalakshmi 07 january 2023 full episode
Intinti Gruhalakshmi 7 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 జనవరి 2023, శనివారం ఎపిసోడ్ 836 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెనర్జీ ప్రాజెక్ట్ గురించే మీరు మాట్లాడుకుంటున్నారా అంటుంది తులసి. దీంతో అవును.. ఇప్పుడు బెనర్జీ మోసగాడు అని అంటావా అంటుంది లాస్య. దీంతో నువ్వు తమాషాకు అన్నా అదే నిజం. ఆ బెనర్జీ నిజంగా మోసగాడే. అతడి గురించి నేను ఆరా తీశాను. అతడు పచ్చి మోసగాడు. సామ్రాట్ ఆ ప్రాజెక్ట్ కాదంటేనే మీ దగ్గరికి వచ్చాడు అంటుంది తులసి. దీంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్స్. కానీ సలహాలు అడిగితేనే ఇవ్వాలి అంటాడు నందు. దీంతో బెనర్జీతో చేతులు కలపడమే తప్పుడు నిర్ణయం అంటుంది తులసి. దీంతో నిన్ను పెళ్లి చేసుకోవడమే అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటాడు నందు. నువ్వు ఒక తియ్యటి విషానివి.. నవ్వుతూ కాటేస్తావు. నా మీద జాలి చూపిస్తున్నట్టుగా నటిస్తూ వెన్నుపోటు పొడుస్తావు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు నందు.
intinti gruhalakshmi 07 january 2023 full episode
దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. దీంతో చిరాకుతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంటికి వస్తుంది. తనకు చాలా చిరాకుగా ఉండటం వల్ల కొన్ని నీళ్లు తాగి స్పృహ తప్పి పడిపోతుంది తులసి. మరోవైపు అభి, ప్రేమ్, శృతి, అంకిత అందరూ కలిసి క్యారం బోర్డ్ ఆడుతూ ఉంటారు. అలా కాదు.. ఇలా ఆడు అంటూ ప్రేమ్ కు చెబుతుంటుంది శృతి. దీంతో ఇక్కడ కూడా నీ మాటే చెల్లాలా అని అంకిత శృతిని హేళన చేస్తుంది. ఇంతలో అభికి ఏదో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ.. క్యారం ఆడడు. దీంతో మొబైల్ లాక్కుంటుంది అంకిత. ఆడేటప్పుడు ఇలా డిస్టర్బ్ చేయొద్దు. అందరూ మొబైల్స్ ఇవ్వండి.. సైలెంట్ లో పెడతాను అని అందరి మొబైల్స్ తీసుకొని సైలెంట్ లో పెట్టి ఒకచోట పెడుతుంది అంకిత.
ఇంతలో తులసికి స్పృహ వస్తుంది. వెంటనే ఫోన్ తీసుకొని ప్రేమ్ కు కాల్ చేస్తుంది కానీ.. ఫోన్ సైలెంట్ లో ఉండటం వల్ల ప్రేమ్ ఎత్తడు. తర్వాత అభికి చేస్తుంది. అభి కూడా ఎత్తడు. దీంతో సామ్రాట్ కు ఫోన్ చేస్తుంది తులసి.
సామ్రాట్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో తులసి గారు చెప్పండి.. అంటాడు కానీ.. తులసి ఏం మాట్లాడదు. దీంతో మళ్లీ ఫోన్ చేస్తాడు సామ్రాట్. కానీ లిఫ్ట్ చేయదు తులసి. దీంతో వెంటనే ఇంటికి వస్తాడు సామ్రాట్.
డోర్ కొడతాడు కానీ.. డోర్ తీయదు. దీంతో ఫోన్ చేస్తాడు. తలుపు లాక్ చేసి ఉంది. ఫోన్ సౌండ్ కూడా వినొస్తుంది. ఏమై ఉంటుంది. లోపలే ఉన్నారు అని కిటికీ నుంచి లోపలికి తొంగి చూస్తాడు. దీంతో తులసి స్పృహ తప్పి పడపోవడం చూస్తాడు.
తులసి గారు అని డోర్ బద్దలు కొట్టి లోపలికి వస్తాడు. తనను మోసుకుంటూ బయటికి వస్తాడు. కారులో తనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తాడు. డాక్టర్లు తులసికి ట్రీట్ మెంట్ చేస్తారు. ఆమె హెల్త్ చాలా బ్యాడ్ కండిషన్ లో ఉంది. బీపీ అబ్ నార్మల్ గా పడిపోయింది అని చెబుతుంది డాక్టర్.
పల్స్ కూడా పడిపోయింది. వెంటనే మేజర్ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయాలి అంటారు. దీంతో సరే.. వెంటనే డబ్బులు పే చేస్తా అంటే.. నర్సు వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అంటుంది. మీరు ఆమె భర్తే కదా.. ఇక్కడ సంతకం పెట్టండి అని చెబుతారు.
దీంతో ఏం చేయాలో సామ్రాట్ కు అర్థం కాదు. అంత టైమ్ లేదు కదా. ఇప్పుడు నేను ఆమె భర్తను కాదు అంటే.. ఆమె వాళ్లు వచ్చే వరకు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయరు. తులసి గారు క్షేమంగా ఈ గండం నుంచి బయటపడాలి అని అన్ని డిటెయిల్స్ రాసి సంతకం పెడతాడు సామ్రాట్.
ఇంతలో తులసి తమ్ముడు దీపక్ కాల్ చేస్తాడు. తులసి మొబైల్ సామ్రాట్ దగ్గరే ఉంటుంది. వెంటనే సామ్రాట్ ఫోన్ లిఫ్ట్ చేసి అసలు విషయం చెబుతాడు. దీంతో ఇప్పుడే అమ్మను తీసుకొని బయలుదేరుతాం అంటాడు దీపక్.
మరోవైపు నందు, లాస్య ఇద్దరూ పిల్లల దగ్గరికి వస్తారు. లాస్య చెప్పు నందు. ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
This website uses cookies.