intinti gruhalakshmi 1 february 2022 full episode
Intinti Gruhalakshmi 1 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 ఫిబ్రవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 544 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత.. తన తల్లి గాయత్రి రెఫరెన్స్ ఇచ్చినా కార్పొరేట్ ఆసుపత్రిలో చేరదు. చిన్న ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరుతుంది. దీంతో తన తల్లి వచ్చి అందరి మీద విరుచుకుపడుతుంది. నీ వల్లే నా కూతురు ఇలాంటి పని చేసింది అని తులసిని అంటుంది గాయత్రి. ఇందులో ఆంటి చేసిందేమీ లేదు. నేనే కావాలని చిన్న ఆసుపత్రిలో చేరాను అంటుంది అంకిత. మహరాణిలా బతకాల్సిన నా కూతురు ఇలా చిన్న ఆసుపత్రిలో చేరడం ఏంటి అంటుంది. ఇంతలో నందు వచ్చి.. ఉద్యోగం ఏదైనా.. సంతోషంగా, నిజాయితీగా బతికితే చాలు అంటాడు నందు. కేఫ్ లో పనిచేసే నువ్వు ఉద్యోగం, హోదా గురించి మాట్లాడుతున్నావా అని నందుపై విరుచుకుపడుతుంది గాయత్రి.
intinti gruhalakshmi 1 february 2022 full episode
దీంతో నందు బాధపడతాడు. ఇంతలో అనసూయ, శృతి అక్కడికి వస్తుంది. నా కూతురు నోట్లో మీరంతా కలిసి మట్టికొట్టారు కదా… అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి మీరందరూ కలిసి గాయత్రిని బాధపెట్టారు అంటుంది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు ఏంటి అని అంకితను అంటుంది లాస్య. మీ ఆయన్నే ఆమె అన్ని మాటలు అంటే రాని పౌరుషం ఇప్పుడు వచ్చిందా అని అంటుంది అనసూయ. గాయత్రి అన్నదాంట్లో తప్పేముంది అంటుంది లాస్య. ఆ తర్వాత మా అమ్మ అన్న మాటలకు నేను క్షమాపణ చెబుతున్నాను ఆంటి అంటుంది అంకిత. పర్లేదమ్మా.. నా గౌరవాన్ని కాపాడావు. నేను అదృష్టవంతురాలిని. నాకు బంగారం లాంటి కోడళ్లు దొరికారు అని అంటుంది తులసి.
ఆ తర్వాత అంకితకు నందు కంగ్రాట్స్ చెబుతాడు. థ్యాంక్యూ అంకుల్ అంటుంది. మరోవైపు అంకితకు జాబ్ వచ్చినందుకు తులసి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తుంది. ఆ గిఫ్ట్ ఏంటని తెరిచి చూస్తుంది అంకిత. అది స్కెతస్కోప్. చాలా థ్యాంక్స్ ఆంటి. నా కల ఇలా తీరుతుందని అనుకోలేదు అంటుంది అంకిత.
కలనా.. ఏంటది అంటుంది తులసి. నేను జాబ్ కు వెళ్లేముందు ఒక స్కెతస్కోప్ కొని దాన్ని మీ చేతుల మీదుగా మెడలో వేసుకొని ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నా. కానీ.. ఆ కల ఈరోజు నెరవేరింది.. అని తులసికి చెబుతుంది అంకిత. దీంతో వెంటనే ఆ స్కెతస్కోప్ ను అంకిత మెడలో వేస్తుంది.
ఆడది ఈరోజుల్లో ఎందులో తక్కువ కాదు.. ఎవ్వరికీ తక్కువ కాదు. అనుభవంతో నేను తెలుసుకున్నాను. నీ ఉద్యోగం నీకు కొత్త దారిని చూపిస్తుంది అంటుంది. అభి గురించి నువ్వు టెన్షన్ పడకు. నేను చూసుకుంటాను అని అంటుంది. ఇంతలో నందు వస్తాడు.
మన పిల్లలు అని చెప్పి కాదు నీ పిల్లలు చాలా అదృష్టవంతులు తులసి అంటాడు. తల్లిగా నువ్వు ఓడిపోయావని నేను ఆరోజు ఎందుకు అన్నానో అర్థం కాలేదు.. అంటాడు. ఆరోజు మీరు నిందలు వేసిప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. ఈరోజు కూడా నా కాళ్లు భూమ్మీదనే ఉన్నాయి అంటుంది తులసి.
ఇంతలో లాస్య వచ్చి అవకాశం దొరికితే చాలు.. ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటారా? నాకు తెలుసు తులసి. మా పెళ్లి అయినా నందు ఇంకా నిన్ను మరిచిపోలేకపోతున్నాడు. ఏం మంత్రం వేశావో ఏమో.. ఏం నందు ఇంకా తనివి తీరలేదా. మన రూమ్ కు వెళ్దామా అంటుంది.. లాస్య.
దీంతో చిరాకుగా అక్కడి నుంచి నందు వెళ్లిపోతాడు. ఆ తర్వాత లాస్య కూడా వెళ్లిపోతుంది. నందు రూమ్ లోకి వెళ్లి కూర్చుంటాడు. నువ్వు తులసిని పొగడటానికి కారణం వెతుక్కుంటావో.. కారణం ఉందని పొగుడుతావో నాకు అర్థం కావడం లేదు అంటుంది లాస్య.
నువ్వు నాకు ఇష్టం లేని పనులన్నీ చేస్తున్నావు అంటుంది లాస్య. ఎన్నిసార్లు చెప్పినా తులసి భజనే చేస్తున్నావు అంటుంది. ఇంట్లో సరుకులు తెచ్చినా కూడా అందరూ నామీదే అంటున్నారు. నువ్వు కూడా నన్ను పొగడల్లేదు.. అని లాస్య అంటుంది.
దీంతో నీ అహాన్ని చూపించుకోవడం కోసం నువ్వు అలా చేశావు తప్పితే.. మంచి పని చేయడం కోసం కాదు అంటాడు నందు. ఇదే.. ఇదే అనేది.. తులసి గురించి మాట్లాడేటప్పుడు నోట్లో చాకొలేట్ ఉంటుంది.. నా గురించి మాట్లాడేటప్పుడు నోట్లో మిరపకాయ ఉంటుంది అంటుంది తులసి.
మరో వైపు శృతి.. ప్రేమ్ కు కాల్ చేస్తుంది కానీ.. ప్రేమ్ తన ఫోన్ ను లిఫ్ట్ చేయడు. దీంతో బయటే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్ వస్తాడు. ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. రెండు గంటల నుంచి నీకోసం పిచ్చిదానిలా వెయిట్ చేస్తున్నాను అంటుంది.
దీంతో మళ్లీ ఇద్దరిలో గొడవ స్టార్ట్ అవుతుంది. ప్రేమ్ ఇంతలా మారిపోవడాన్ని తట్టుకోలేకపోతుంది శృతి. వీళ్ల గొడవను తులసి చూస్తుంది. ఏమైంది.. రావడం ఆలస్యం అయింది ఏంటి అని అడుగుతుంది తులసి. దీంతో ఈవెంట్ గురించి మాట్లాడటంలో లేట్ అయింది. నేను ఒక మూడు రోజులు ఉండను.. ఈవెంట్ కు వెళ్తాను అంటాడు ప్రేమ్.
మరోవైపు అంకిత.. ఇంట్లో వంట వండుతుంది. చపాతీ మాడిపోతాయి. చాయ్ బాగుండదు. దీంతో అనసూయ, పరందామయ్య ఇద్దరూ తనపై చిరాకు పడతారు. ఇది చాయ్ ఏనా అంటారు. దీంతో తనకు చిరాకు వస్తుంది. ఇప్పుడే వంట నేర్చుకుంటున్నా. నన్ను తులసి ఆంటితో ఎందుకు పోల్చుతారు అంటూ సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.