Intinti Gruhalakshmi 1 Jan Today Episode : బెడిసికొడుతున్న లాస్య ప్లాన్స్.. హ్యాపీ మూడ్ లో ఫ్యామిలీ.. ఇంతలో తులసికి భారీ షాక్ ఇచ్చిన లాస్య

Intinti Gruhalakshmi 1 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 జనవరి, 2022 శనివారం ఎపిసోడ్ 518 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు వెళ్లిపోతే మేము కూడా ఉండం అని పరందామయ్య, అనసూయ ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధం అవుతారు. కుటుంబ సభ్యులు కూడా వాళ్లతో పాటు పోయేందుకు సిద్ధం కాగా ఆగండి.. దయచేసి ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లొద్దు.. నేను మీతోనే ఉంటాను అని అంటుంది తులసి. ఎవరో ఒకరు వెళ్లిపోతారేమో పీడ విరగడ అవుతుంది అనుకున్నా కానీ.. ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటుంది లాస్య. రాములమ్మ నా కూతురు వచ్చింది ఇంట్లోకి వెళ్లి హారతి పళ్లెం తీసుకురా అంటుంది అనసూయ. తనకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అనసూయ.

intinti gruhalakshmi 1 january 2022 full episode

దీంతో భాగ్య అందుకొని అత్తయ్య మీరు చేసింది ఏమైనా బాగుందా.. అని అడుగుతుంది. కొత్త కోడలు లాస్యకు మాత్రం హారతి పట్టలేదు. మాజీ కోడలుకు మాత్రం తెగ హారతి ఇచ్చేస్తున్నావు. కొత్త జంటకు కూడా హారతి ఇచ్చి ఉంటే మీ పెద్దరికం ఉండేది కదా.. అంటూ చిచ్చు పెడుతుంది భాగ్య. మళ్లీ మొదలు పెట్టావా అని అనసూయ అనగానే మీరే మొదలుపెట్టారు అత్తయ్య గారు. నందు మాజీ భార్యకు ఇచ్చే విలువ.. నందు భార్యనైన నాకు ఎందుకు ఇవ్వరు. నందు, నేను వేర్వేరుగా ఉన్నప్పుడు నేను నోర్మూసుకొని కూర్చున్నాను. కానీ.. ఇప్పుడు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.. అంటుంది లాస్య. కొత్త కోడలు ఆలోచించాల్సింది హక్కుల గురించి కాదు.. బాధ్యతల గురించి అంటుంది అనసూయ.

చూశావా నందు.. నన్ను కావాలనే పక్కన పెట్టేస్తున్నారు. నన్ను పరాయిదానిలా చూస్తున్నారు. నేను ఈ ఇంటి కోడలినే కదా. కానీ.. నన్ను గడ్డిపోచ కన్నా నీచంగా చూస్తున్నారు.. అనగానే అనసూయ.. నందు, లాస్యలకు హారతి ఇచ్చి వాళ్లకు గృహప్రవేశం చేయించు.. అంటాడు పరందామయ్య. దీంతో నేను చేయను. వేరే ఎవరితోనైనా చేయించండి అంటుంది అనసూయ.

దీంతో శృతి నువ్వు ఈ పని చేయమ్మా అని తులసి చెబుతుంది. దీంతో తులసి మాట కాదనలేక.. శృతి లోపలికి వెళ్లి హారతి తీసుకొస్తుంది. కొత్త జంట నందు, లాస్యకు హారతి ఇస్తుంది. దీంతో లాస్య ఖుషీ అవుతుంది. కుటుంబ సభ్యులు ఎవ్వరూ మాట మాట్లాడరు. కుడికాలు ముందుపెట్టి లోపలికి రండి.. అని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది శృతి. దీంతో నందు, శృతి ఇద్దరూ లోపల అడుగుపెట్టబోతుంటారు.

Intinti Gruhalakshmi 1 Jan Today Episode : నందు, లాస్య ఇంట్లో అడుగు పెట్టగానే అశుభం

ఇంతలో గడప మీద ఉన్న పూసల దండ తెగి కిందపడుతుంది. దీంతో అశుభం.. పాతికేళ్లుగా గోడకు ఉన్న పూసల దండ తెగి కిందపడింది. దేవుడా ఈ కుటుంబాన్ని నువ్వే కాపాడాలి.. అంటూ భయపడుతుంది అనసూయ. ఈ కుటుంబం ముక్కలవుతుందేమో అని భయమేస్తుంది అంటుంది అనసూయ.

మరోవైపు నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఎటునుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని క్షణక్షణం భయంగా బతకాల్సి వస్తుందని అనుకుంటాడు. లాస్య మాత్రం.. పూసల దండ తెగడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో భాగ్య అక్కడికి వస్తుంది.

ముందు నీ ప్లాన్ లో ఒక పని అయిపోయింది. చివరకి నందుతో తాళి కట్టించుకున్నావు. కానీ.. తులసి అక్కను దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదేమో అంటుంది భాగ్య. అందరితో ఇప్పుడిప్పుడే నువ్వు చెడుగుడు ఆడుకోలేవు అంటుంది. దీంతో లాస్య కాస్త ఇరకాటంలో పడిపోతుంది.

ఇంట్లోకి వచ్చాక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉంటారు. తులసిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మెల్లగా తులసి నడవడం కూడా ప్రారంభిస్తుంది. దీంతో అందరి ముఖాల్లో సంతోషం వస్తుంది. అందరూ కలిసి సరదాగా గడపడం చూసి నందు కూడా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

8 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

9 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

10 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

12 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

13 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

14 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

15 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

16 hours ago