
chiranjeevi is reason behind samantha item song in pushpa
Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అనగానే గుర్తొచ్చే జంట సమంత – నాగ చైతన్యది. కానీ అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోక తప్పలేదు. అయితే వీరి విడాకుల వార్త నుంచి వారి అభిమానులు ఇంకా కోలుకోవడం లేదు. అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన సమంత నాలుగేళ్లు తిరగకముందే ఊహించని విధంగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. విడాకుల అనంతరం… వీరిద్దరూ దీనిపై ఎక్కడా అఫిషియల్ గా మాట్లాడలేదు. అయితే వీరిద్దరికీ సంబంధించిన ప్రతీ అంశం వైరల్ అవుతూ వచ్చింది. అయితే ఇదే కోవలో మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పుష్ప సినిమా సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ సూపర్ హిట్ అయింది.
బన్నీతో కలసి సమంత వేసిన మాస్ స్టెప్పులు కుర్రకారును ఉర్రుతలూగించాయి. అయితే ఆమె ఐటెం సాంగ్ కి ఒప్పుకోవడం ఏంటని ఆమె అభిమానులతో పాటు చై అభిమానులు అప్పట్లో ఫైర్ అయ్యారు. ఇక మూవీ రిలీజ్ అయిన అనంతరం.. సాంగ్ లో సమంతను వల్గర్ గా చూపించారని విమర్శలు వచ్చాయి. చైతూతో విడాకుల అనంతరం.. చిరంజీవి, రామ్ చరణ్ అటెండ్ అయిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌కి సమంత కూడా వెళ్లిందట. అక్కడ చిరంజీవి, సమంత, రామ్ చరణ్ మధ్య లోతైన సంభాషణ జరిగిందట. అక్కడే మెగాస్టార్ చిరంజీవి.. పుష్ప మూవీలోని ఐటెం సాంగ్ గురించి చెప్పి నచ్చితే ఆ సాంగ్ చేయమని సలహా ఇచ్చారట. దీంతో చిరు మాటను గౌరవించి సమంత ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అయిందట.
chiranjeevi is reason behind samantha item song in pushpa
అలా వచ్చిందే ‘ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ’ సాంగ్ అని ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు అంటున్నారు.ఏది ఏమైనా సమంత విడాకులు, పుష్ప మూవీలో ఆమె చేసిన ఐటెం సాంగ్ వివాదం ఇప్పట్లో ముగిసేటట్లుగా కనిపించడం లేదు.ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ గా నిలిచింది. ఇప్పుడు థియేటర్ల వద్ద ఈ సినిమా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. అల్లు అర్జున్‌తో సమంత వేసిన మాస్ స్టెప్స్ థియేటర్లలో ప్రేక్షకుల చేత గోల పెట్టిస్తున్నాయి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.