
intinti gruhalakshmi 10 january 2022 full episode
Intinti Gruhalakshmi 10 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 జనవరి 2022, సోమవారం 525 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య కొత్త పనిమనిషి.. వారెవ్వా వసంతను తీసుకొస్తుంది. తన కండిషన్లు విని కుటుంబ సభ్యులు మొత్తం షాక్ అవుతారు. లాస్య.. వాళ్ల గురించి నువ్వు పట్టించుకోకు. నువ్వు కేవలం నాకు, నా భర్తకు సంబంధించిన పనులు మాత్రమే చేయాలి. వేరే ఎవ్వరు ఏ పని చెప్పినా చేయకూడదు. నిర్మోహమాటంగా నో అని చెప్పేయ్. మరిచిపోకు. నీకు శాలరీ నేను ఇస్తున్నాను.. అంటుంది. కిచెన్ కు తీసుకెళ్లి ఏం చేయాలో మొత్తం చెబుతుంది వసంతకు. ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. సరే.. మాకు టిఫిన్ చేసి తీసుకురా అని చెబుతుంది లాస్య. నీకు ఏమైనా కావాలంటే నన్ను అడుగు అంటుంది తులసి.
intinti gruhalakshmi 10 january 2022 full episode
ఏం అవసరం లేదు. నేనే వెతుక్కుంటాను అంటుంది వసంత. ముందు ఈ టీ తాగు.. తర్వాత పని చేద్దువు కానీ అని చెప్పి వసంతకు చాయ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఆ చాయ్ తాగి వసంత షాక్ అవుతుంది. ఇంత బాగుందేంటి అనుకుంటుంది. మరోవైపు నందుతో నా డ్రెస్ ఆల్టరేషన్ చేయించుకురా అని చెబుతుంది లాస్య. నాకు ఏం పనిలేదా అని అడుగుతాడు. నువ్వు ఖాళీయే కదా అంటుంది లాస్య. దీంతో నందుకు కోపం వస్తుంది. వద్దు నందు.. ఈరోజు నేను మంచి మూడ్ లో ఉన్నాను. ఈరోజు గొడవలు వద్దు. మన కోసమే నేను పని మనిషిని పెట్టాను కదా నందు. ఇప్పుడు నీకు కావాల్సిన ఫుడ్ ను తను వండి పెడుతుంది నందు అని చెబుతుంది లాస్య. నాకు నచ్చలేదు. తను 24 గంటలు ఇంటిదగ్గరే ఉండటం ఏంటి.. మనకు ప్రైవసీ ఎలా ఉంటుంది అని అంటాడు నందు.
నందు టిఫిన్ అయింది రా అని పిలుస్తుంది. వసంత అన్నీ రెడీ చేసి తీసుకొస్తుంది. కూర్చో నందు అంటుంది లాస్య. తను చేసిన పాస్తా, చపాతీ, దోశకాయ కర్రీ చూస్తాడు నందు. తనకు కూడా ఆకలి వేస్తుంటుంది. వెంటనే అన్నింటిని టేస్ట్ చేస్తారు. వారెవ్వా వసంత.. సూపర్ ఉన్నాయి అని చెబుతుంది లాస్య.
నందు తింటుంటే అతడికి దగ్గు లేస్తుంది. శ్వాస ఆడదు. వెంటనే తులసి వెళ్లి ఇదుగోండి తాగండి మంచినీళ్లు అంటుంది తులసి. ఇఫ్పుడు ఎలా ఉందండి అంటుంది తులసి. ఇప్పుడు ఓకే అంటాడు నందు. లాస్య.. ఆయనకు దోశకాయ పడదు అలెర్జీని తెలుసు కదా. నీకు గుర్తుండకపోతే.. ఇలాంటివన్నీ ఒకచోట రాసుకో. అంతే కానీ.. ఆయన ఇబ్బంది పడేలా చేయకు అంటుంది తులసి.
ఏంటి మేడమ్ మీరు.. బోణీ చేసిన వంటే బోల్తా కొట్టింది. మీరు ముందు చెప్పాలి కదా అంటుంది వసంత. నందు రిలాక్స్ అయ్యాక తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో నందుకు ఫోన్ వస్తుంది. సరే అండి.. వెంటనే బయలుదేరుతున్నా అంటాడు.
నాకు ఇంతకుముందు ఫోన్ వచ్చిందా అని అడుగుతాడు నందు. అవును.. నువ్వు రావని చెప్పా. అది స్టార్టప్ కంపెనీ అంటుంది లాస్య. దీంతో నందుకు తీవ్రంగా కోపం వస్తుంది. మరోవైపు లాస్యతో మాట్లాడేందుకు తులసి వెళ్తుంది. అందరి ముందు నువ్వు ఆయన ఉద్యోగం గురించి మాట్లాడావు కదా అంటుంది.
మీకు గొడవలు ఏవైనా ఉంటే మీ రూమ్ లో చూసుకోండి. పిల్లల ముందు నువ్వు ఆయన్ను ఏదైనా అంటే.. అది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఆయన్ను తక్కువ చేసి ఇంకోసారి మాట్లాడకు. ఆయనకు మర్యాద ఇవ్వడం నేర్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
This website uses cookies.