Home » Entertainment » Intinti Gruhalakshmi 10 October 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 10 Oct Today Episode : బతుకమ్మ వేడుకల్లో సామ్రాట్ పరువు తీసిన అనసూయ.. తులసికి అనసూయ గురించి అసలు నిజం తెలిసి షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Updated on: October 10, 2022, 9:05 am
Advertisement

Intinti Gruhalakshmi 10 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 759 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి ఫ్యామిలీ గుడికి వస్తుంది. ఇంతలో అక్కడికి లాస్య, నందు వస్తారు. వాళ్లను చూసి చేయి ఊపుతుంది అనసూయ. ఏంటి వాళ్లను చూసి చేయి ఊపుతున్నావు. వాళ్లేమీ మన చుట్టాలు కాదు అంటాడు పరందామయ్య. దీంతో అవును వాళ్లు చుట్టాలు కాదు.. నా కన్న కొడుకు అంటుంది. నా కొడుకుకు జనరల్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. అందుకని నా పేరు మీద పూజ చేయించడానికి వచ్చారు అని చెబుతుంది. ఆ తర్వాత లాస్య, నందు వెళ్లి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి గుడిలోకి వెళ్తారు. అత్తయ్య, మామయ్య పేరు మీద అర్చన చేయించండి అని పంతులును కోరుతుంది తులసి. దీంతో లాస్య కల్పించుకొని ఇవాళ అత్తయ్య, మామయ్య గారి పేరు మీద మేము అర్చన చేయిస్తాం అని చెబుతుంది లాస్య. దీంతో సరే అంటుంది తులసి.

Advertisement

పూజ జరుగుతుండగా దేవుడా.. నా వాళ్లందరినీ మంచిగా ఉండేలా చేయి అని చెప్పి దేవుడిని కోరుకుంటుంది. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అని అంటాడు పూజారి. మనసులో ఉన్న కోరికలు కోరుకొని అమ్మవారికి ముడుపు కడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటాడు పూజారి. దీంతో నాకున్న కోరిక అల్లా నా మనవళ్లను ఎత్తుకొని తిరగాలని. నా ఇద్దరు కోడళ్ల కడుపు పండటం కోసమే ఎదురు చూస్తున్నా అంటుంది. దీంతో ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే వెళ్లి ముడుపు కట్టేయండి అంటాడు పంతులు. దీంతో అక్కడి నుంచి ముడుపు కట్టడానికి వెళ్తారు తులసి ఫ్యామిలీ. ఇప్పుడు ఈ ముడుపులు ఇవి అవసరమా ఆంటి అని అంటుంది శృతి. కడితే తప్పేంటి అని అంటుంది అనసూయ. నిష్కల్మషంగా ప్రార్థించి ఆ దేవుడిని వేడుకుంటే నుదిటి వ్రాత కాస్త మార్చేస్తాడేమో అంటుంది తులసి. అయిష్టం గానే వెళ్లి శృతి, అంకిత ముడుపులు కడతారు. అమ్మా.. నా మనసులో ఉందొకటి.. ఇక్కడ జరుగుతోంది ఒకటి నువ్వే అర్థం చేసుకో అని శృతి, మనసులు వేరయ్యాక ఈ ముడుపులు ఏం చేస్తాయో నాకు తెలియదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను అని చెప్పి అంకిత ముడుపు కట్టబోతుంది.

Advertisement

అయితే.. వాళ్లకు ముడుపులు కట్టడానికి చెట్టుకొమ్మలు అందవు. దీంతో అభి, ప్రేమ్ ను వెళ్లి వాళ్లను ఎత్తుకోమని చెబుతాడు పంతులు. దీంతో సరే అని వాళ్లు వెళ్లి ఎత్తుకుంటారు. దీంతో ఇద్దరూ ముడుపులు కడతారు. ఆ తర్వాత పదండి.. కాలనీలో అందరూ మనకోసమే ఎదురు చూస్తుంటారు అని అంటుంది అనసూయ.

Intinti Gruhalakshmi 10 Oct Today Episode : బతుకమ్మ సంబురాలకు ఒంటరిగా హాజరు అయిన హనీ

కట్ చేస్తే బతుకమ్మ సంబురాలు కాలనీలో ప్రారంభం అవుతాయి. హనీ కూడా వస్తుంది. తులసిని బతుకమ్మ పాట పాడాలని అంటారు కాలనీ వాసులు. దీంతో సరే అని బతుకమ్మ పాట పాడుతుండగా అందరూ కలిసి బతుకమ్మ ఆడుతారు. మరోవైపు హనీ ఒక్కతే కనబడుతోంది. సామ్రాట్ ఎందుకు రాలేదు అని అనుకుంటుంది లాస్య.

Advertisement

అసలు తులసి, సామ్రాట్ మధ్య ఏమైంది తెలుసుకోవాలి. సామ్రాట్, తులసిని మరింత దూరం చేయాలి అని అనుకుంటుంది లాస్య. ఇంతలో హనీ తన కారు దగ్గరికి వెళ్లి వాటర్ తాగుతూ ఉంటుంది. ఇంతలో లాస్య అక్కడికి వచ్చి మీ నాన్న రాలేదా అని అడుగుతుంది.

దీంతో ఏదో మీటింగ్ ఉందట అందుకే రాలేదు అని అంటుంది హనీ. పండుగ పూట మీ నాన్న ఒంటరిగా ఉండటం ఏమైనా బాగుంటుందా? మరి ఫోన్ చేసి రమ్మని పిలవొచ్చు కదా. నువ్వు పిలిస్తే రారా అని అంటుంది లాస్య. హనీ ద్వారా సామ్రాట్ ను ఇక్కడికి వచ్చేలా చేయాలనుకుంటుంది లాస్య.

ఒక్క నిమిషం అని చెప్పి కారు డ్రైవర్ దగ్గరికి వెళ్తుంది హనీ. తన ఫోన్ ను తీసుకొని సామ్రాట్ కు ఫోన్ చేస్తుంది. సడన్ గా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది నాన్న.. అంటుంది హనీ. దీంతో అయ్యో తులసి ఆంటిని చెప్పకపోయావా అని అంటాడు. దీంతో తను ట్యాబ్లెట్ ఇచ్చింది. ఇప్పుడు ఓకే అంటుంది హనీ.

సరే.. నువ్వు వచ్చేస్తావా అని అడుగుతాడు. దీంతో నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లు అంటుంది హనీ. దీంతో సరే.. నేను వస్తా. నువ్వు అప్పటి వరకు తులసి ఆంటి దగ్గరే ఉండు అని అంటాడు సామ్రాట్. మరోవైపు తన ప్లాన్ వర్కవుట్ అవుతోందని అనుకుంటుంది.

Advertisement

మరోవైపు వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇంకోవైపు సామ్రాట్, బాబాయి ఇద్దరూ కారులో బయలుదేరుతారు. మరోవైపు అందరూ సరదాగా గేమ్స్ ఆడుతూ ఉంటారు. అభి, అంకిత గేమ్ అయిపోతుంది. ఇంతలో నందు గేమ్ వస్తుంది. నందు, లాస్య ఇద్దరూ ఆడుతూ ఉంటారు.

నందు సైగలు చేస్తుంటే లాస్య చెప్పాలి. కట్ చేస్తే సామ్రాట్ వస్తాడు. తులసి, అందరితో కలిసి దాండియా స్టెప్స్ వేస్తాడు. అది చూసి అనసూయకు నచ్చదు. తులసికి దూరంగా ఉండు అన్నా వినవా? అందుకే కదా ఉద్యోగం లోనుంచి తీయించేసింది అని అసలు నిజం చెబుతుంది. దీంతో తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి