
intinti gruhalakshmi 11 january 2022 full episode
Intinti Gruhalakshmi 11 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 జనవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 526 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఆయన్ను అందరి ముందు.. ముఖ్యంగా పిల్లల ముందు చిన్నతనం చేసి అస్సలు మాట్లాడొద్దు అంటూ లాస్యకు తులసి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలోనే నందు రెడీ అయి నేను వెళ్తున్నాను అంటాడు. ఎక్కడికి అంటుంది లాస్య. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి రాడు అన్నావు కదా.. అదే కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్తున్నా. చిన్న కంపెనీ అయినా కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ కూడా ఉంటాయి.. అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. నువ్వు నా భర్తకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నావా అని అడుగుతుంది లాస్య. దగ్గరవ్వాలని అనుకొని ఉంటే.. నేను దూరం అయ్యేదాన్నే కాదు అంటుంది తులసి. ఈ ఇల్లు నీ పేరు మీద ఉందని పొగరా అంటుంది లాస్య. ఎంతసేపు ఈ ఇంటిని ఎలా దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నావు తప్పితే.. ఈ ఇంట్లోని వాళ్ల మనసు గెలుచుకునే పని మాత్రం చేయవు అంటూ లాస్యకు వార్నింగ్ ఇస్తుంది.
intinti gruhalakshmi 11 january 2022 full episode
మరోవైపు వారెవ్వా వసంత.. పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి పిండుతూ ఉంటుంది. అనసూయ చూస్తుంది. దీనికి ఏం పనిలేదా.. అని అనుకొని వచ్చి వాషింగ్ మిషన్ లో ఏంటి అంత సర్ఫ్ వేస్తున్నావు అంటున్నావు తిడుతుంది. అమ్మో అమ్మో.. పెళ్లి కొడుకు నెత్తి మీద తలంబ్రాలు వేసినట్టు.. వాషింగ్ మిషన్ లో ఎంత పడితే అంత వేస్తావా అంటూ సీరియస్ అవుతుంది. కట్ చేస్తే నందు కేఫ్ కు వెళ్తాడు. టెన్షన్ గా కూర్చుంటాడు. లాస్య నిజంగా నన్ను చిన్నచూపు చూస్తోందా? సెన్సిటివ్ గా ఫీల్ అయి నేనే భుజాలు తడుముకుంటున్నానా అని అనుకుంటాడు నందు. మా నాన్నా అని పిల్లలు నన్ను చూపించి గొప్పగా చెప్పుకోవడానికి నాలో ఏముంది. కాలం గడుస్తున్న కొద్దీ నా మీద నాకే నమ్మకం పోతోంది అని అనుకుంటాడు నందు.
ఇంతలో ప్రకాశ్ అనే వ్యక్తి కేఫ్ లో నందును కలుస్తాడు. ప్రకాశ్.. నువ్వేంటి ఇక్కడ అంటాడు నందు. ఈ కేఫ్ నాదేరా అంటాడు. అవునా.. మరి జాబ్ అంటాడు. జాబ్ చేస్తూనే.. సెకండ్ ఇన్ కమ్ కోసం ఇది చేస్తున్నా అంటాడు ప్రకాశ్. నువ్వు జాబ్ చేయడం లేదా.. నీకు సొంత కంపెనీ ఉంది కదా అని అడుగుతాడు ప్రకాశ్.
లేదురా.. కంపెనీ మూత పడింది అంటాడు. అయితే ఒక పని చేయి.. నీకు నేను ఒక ఆఫర్ ఇస్తాను.. అది కూడా ఇదే కేఫ్ లో అంటాడు ప్రకాశ్. దీంతో కాస్త సందిగ్ధంలో పడతాడు నందు. సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ గా ఉండు అని చెబుతాడు. ఆలోచించుకొని నిర్ణయం చెప్పు అని చెప్పి ప్రకాశ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు బట్టలు ఆరేసుకుంటూ వసంత.. ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. నాకూ ఇప్పుడే తెలిసింది. ఇంకో మేడం ఉన్నారు కదా.. ఆమె మా సారు మొదటి భార్య అట. ఆమె కూడా బాగానే ఉంటుంది కానీ.. తనను ఎందుకు వదిలేసి.. మా మేడమ్ ను చేసుకున్నాడో మాత్రం తెలియదు అంటుంది.
ఏది ఏమైనా.. మా మేడమ్ మాత్రం మస్తు కరోడా.. మా సార్ గుడ్లు పెద్దది చేసి చూడటం తప్పితే ఏం చేయలేడు పాపం. లాస్య మేడమ్ అరిచేసరికి సైలెంట్ అయిపోతాడు అంటుంది వసంత. ఇవన్నీ తులసి వింటూ ఉంటుంది. నాకు ఇక్కడే పెద్ద సీరియల్ లా ఉంది. కానీ.. పనిచేయడంలో మాత్రం తులసి మేడమ్ సూపర్.. అంటుంది.
మా మేడమ్ కు మేకప్ మీద ఉన్న దృష్టి ఇంట్లో పని మీద ఉండదు. ఇలాంటి వాళ్లు ఉండబట్టే.. మా లాంటి వాళ్లు బతికేది.. నీకు ఇంకో విషయం చెప్పనా.. అంటూ ఏదో అనబోయే సరికి.. తులసిని చూసి షాక్ అవుతుంది. అంటే ఊళ్లో నుంచి కజిన్ ఫోన్ చేసింది. ఇంట్లో వాళ్లు ఎలా ఉంటారంటే.. చెబుతున్నా అంతే.. అంటుంది వసంత.
దీంతో తులసి అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా.. మేడమ్ అని పిలిచి మీకు ఇదంతా ఏం అనిపించదా అని ప్రశ్నిస్తుంది. అంటే చూసేవాళ్లు.. ఏమీ అనుకోరా అని అడుగుతుంది. దీంతో మా అత్తమామలు ఇక్కడి నుంచి నన్ను వెళ్లనీయడం లేదు. అందుకే నేను ఇక్కడ ఉండాల్సి వస్తోంది అని చెబుతుంది తులసి.
నువ్వు నీ కజిన్ కు ఏదైనా చెప్పుకో కానీ.. నిజం చెప్పు అబద్ధం చెప్పకు.. మసాలా చల్లకు. అది కూరల్లో చల్లు అంటూ వసంతకు వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో తులసి అంటూ అనసూయ వచ్చి దానితో అలా మెత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని నెత్తికెక్కించుకోకు అంటూ అంటుంది.
మరోవైపు నందు ఈ ఉద్యోగంలో చేరాలా వద్దా అని అనుకుంటాడు. మొత్తానికి కేఫ్ లో ఉద్యోగం చేస్తా అని ప్రకాశ్ కు ఓకే చెబుతాడు నందు. మంచి నిర్ణయం తీసుకున్నావు అంటాడు. మంచి రోజు చూసి జాబ్ లో జాయిన్ అవ్వు అంటాడు ప్రకాశ్.
కట్ చేస్తే నాకు ఎవ్వరూ మునిమనవడిని ఇవ్వడం లేదు అంటూ అనసూయ.. శృతితో అంటుంది. నిన్న తాతయ్య అడిగారు. ఇప్పుడు ఈమె.. అంటూ తనలో తాను అనుకుంటుంది. ఇంతలో తనకు కళ్లు తిరిగి వాంతి చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.