
intinti gruhalakshmi 11 july 2022 full episode
Intinti Gruhalakshmi 11 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 681 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇద్దరు సమఉజ్జీలు బాగా పాడారు. కానీ.. ఫైనల్స్ లో ఒక్కరికే విజయం దక్కుతుంది అని హోస్ట్ చెబుతుంది. ఫైనల్ విజేతను ఎన్నుకునేందుకు ఆడియెన్స్ కు పోల్ పెడతారు. ఒక్క ఓటు తేడాతో ప్రేమ్ గెలుస్తాడు. దీంతో తులసి, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషిస్తారు. దీంతో ప్రేమ్ ను స్టేజ్ మీదకు పిలుస్తారు. ఒక్క ఓటు తేడాతో మీరు గెలిచారు అని చెబుతుంది హోస్ట్. నువ్వు ఎవరికి ఓటేశావు అని లాస్య.. నందును అడుగుతుంది. దీంతో నేను ప్రేమ్ కే ఓటేశాను. నా మనస్సాక్షికి ఏది అనిపిస్తే అది చేస్తా. నేను తనకే ఓటేశా. వాడు చాలా బాగా పాడాడు అని చెబుతాడు నందు. దీంతో నీ ఒక్క ఓటు వల్లే ప్రేమ్ గెలిచాడు అని అంటుంది లాస్య.
intinti gruhalakshmi 11 july 2022 full episode
మరోవైపు నాకు ఓటేసి గెలిపించిన వాళ్లందరికీ థాంక్స్ అని చెబుతాడు ప్రేమ్. మా నాన్న నన్ను నమ్మలేదు. దారి తప్పానని వదిలేశాడు. కానీ.. నాలో ఉన్న గాయకుడిని మా అమ్మ చిన్నప్పుడే చూసింది. ఈ గెలుపు మా అమ్మకే అంకితం అంటాడు ప్రేమ్. మా అమ్మ తర్వాత నేను చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి నా భార్య శృతి. నా కష్టాన్ని పంచుకుంది. నన్ను అక్కున చేర్చొని ఓదార్చింది. నా జీవితంలోనే కాదు.. ఈ గెలుపులో కూడా సగ భాగం భార్యదే. థాంక్యూ శృతి అంటాడు ప్రేమ్. స్టేజ్ మీదనే తనకు ముద్దు ఇస్తాడు. నాకు సరైన సంపాదన లేకపోయినా తనే జాబ్ చేస్తూ నాకోసం శ్రమ పడుతోంది అని అంటాడు ప్రేమ్.
ఈ నాటి మన విన్నర్ ప్రేమ్ కు అవార్డును అందజేయాలని జిల్లా కలెక్టర్ ప్రకాశ్ ను కోరుతుంది హోస్ట్. దీంతో కలెక్టర్ స్టేజ్ మీదికి వస్తాడు. ప్రేమ్ కు ట్రోఫీ ఇవ్వబోతుండగా ఈ ట్రోఫీని నాకు కాకుండా మా అమ్మకు ఇవ్వండి అంటాడు. దీంతో సరే అంటాడు. తన అమ్మను పైకి పిలుస్తారు. వచ్చి తను తీసుకుంటుంది. చాలా సంతోషిస్తుంది.
మీ అబ్బాయి విజయం గురించి రెండు మాటలు మాట్లాడండి అని అడుగుతుంది హోస్ట్. దీంతో మైక్ తీసుకొని నేను తల్లిగా ఓడిపోయాను అంటూ ఒక పెద్దమనిషి నా మీద నింద వేశాడు అంటుంది తులసి. ఆ పెద్దమనిషి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అని అంటుంది.
కొడుకు పక్కన గర్వంగా తలెత్తుకు నిలుచున్న నన్ను చూస్తున్నారు. ఇప్పటికీ నేను తల్లిగా ఓడిపోయాను అని అనుకుంటే ఆయన స్టేజ్ మీదికి వచ్చి నాతో చెప్పొచ్చు అంటుంది. ఈ రోజు తల్లిగా గెలిచాను అంటుంది తులసి. నా బిడ్డ ముఖంలో సంతోషం చూస్తున్నాను అంటుంది తులసి.
ఆ తర్వాత స్టేజ్ దిగి కిందికి వస్తారు. ప్రేమ్ ను చూసి కంగ్రాట్స్ చెబుతాడు ప్రేమ్. నీ గొప్పతనం ఈరోజు తెలుసుకున్నాను. కంగ్రాట్స్ రా. తండ్రిగా నేను ఓడిపోయాను.. తల్లిగా మీ అమ్మ గెలిచింది.. అంటాడు. దీంతో తండ్రిగా నన్ను అనే హక్కు మీకు ఉంది. కానీ.. అమ్మ మూలంగా నేను చెడిపోయానని అన్నారు కదా. అదే నాకు బాధగా ఉంది అంటాడు ప్రేమ్.
కట్ చేస్తే నందు ఇంటికి తిరిగి వస్తాడు. తనను చూసి లాస్యకు చాలా కోపంగా ఉంటుంది. నా కొడుకును గెలిపించుకోవడం నా బాధ్యత అనిపించింది అంటాడు నందు. నీ బాధ్యత అనుకొని మీ మాజీ భార్యను కూడా కలుపుకుంటావా? మళ్లీ ఒక్కటైపోతారా అని అడుగుతుంది లాస్య.
నా కోపం తులసి మీద కానీ.. నా పిల్లల మీద కాదు. వాళ్లకు నేనెప్పుడూ తండ్రినే అంటాడు నందు. తర్వాత ప్రేమ్ గెలుపును సంబురాలు చేయాలని అనుకుంటుంది. బోనాలు సమర్పించాలని అనుకుంటుంది తులసి. బోనాలు ప్రారంభం అవుతాయి. బోనాల పండుగ దగ్గర టెంట్ వేసి సంబురాలు స్టార్ట్ చేస్తారు.
వేడుకలకు అభి కూడా వస్తాడు. అమ్మ మాటను గౌరవించి వచ్చావు థాంక్స్ అంటుంది తులసి. దీంతో గుడిలో అమ్మవారి గురించి వచ్చాను అంటాడు అభి. మరోవైపు రిషి కోసం వసుధర, సాక్షి ఇద్దరూ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తారు. కానీ.. బోనం ఎలా చేయాలో వసుధరకు తెలియదు.
అక్కడే ఉన్న తులసి వాళ్లను చూసి.. వాళ్ల దగ్గరికి వెళ్తుంది. ఏంటి బోనం చేయకుండా ఇద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు అని అడుగుతుంది. బోనం చేయడం రాదు అని అంటారు. దీంతో వాళ్లకు బోనం ఎలా చేయాలో చెబుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.