Intinti Gruhalakshmi 11 Oct Today Episode : రాత్రంతా ఒకే రూమ్ లో విక్రమ్, జాను.. దివ్య వచ్చి చూసి షాక్.. తులసిని చంపేందుకు రత్నప్రభ ప్లాన్.. తులసిని చంపేస్తారా?

Intinti Gruhalakshmi 11 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 11 అక్టోబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1072 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రత్నప్రభ నందుకు ఫోన్ చేసి హనీని పంపించాలని అడుగుతుంది. నేను నీ రెండో మాజీ పెళ్లాం కంటే మొండి దాన్ని. ఎంతకైనా తెగిస్తాను. ఇప్పుడు జస్ట్ దెబ్బలతో వదిలేశాను. అమెరికా నుంచి అన్నీ వదులకొని వచ్చింది సామ్రాట్ ఆస్తి తులసి చేతుల్లో పెట్టడానికి కాదు అంటుంది రత్నప్రభ. దీంతో ఎందుకు మళ్లీ మళ్లీ సామ్రాట్ ఆస్తి గురించి మాట్లాడుతావు. నాకు కానీ.. తులసికి కానీ సామ్రాట్ ఆస్తి మీద ఆశ లేదు అంటాడు నందు. ఏదో రోజు తులసి మనసు మార్చుకుంటే.. ఆస్తి కావాలనుకుంటే నువ్వేం చేస్తావు. హనీ విషయంలోనే నువ్వు తులసికి నచ్చజెప్పలేకపోయావు. ఇక.. ఆస్తి విషయంలో నువ్వే చేయగలవు. హనీ మీ దగ్గర ఉంటే ఎప్పటికైనా మాకు ప్రమాదమే. నాకు హనీ కావాలి. వెంటనే అది జరగాలి అని అడుగుతుంది రత్నప్రభ. దీంతో కొద్దిగా గడువు కావాలి ప్లీజ్ అంటాడు నందు. దీంతో వెళ్లి ఆ తులసి కాళ్లు పట్టుకో.. అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రత్నప్రభ.

మరోవైపు విక్రమ్ కి మందు ఫుల్ గా తాగిస్తుంది జాను. ఆ తర్వాత విక్రమ్ తో కలిసి డ్యాన్స్ చేస్తుంది జాను. మరోవైపు హనీతో ఆడుకుంటూ ఉంటుంది దివ్య. జాను.. విక్రమ్ తో కలిసి డ్యాన్స్ చేయడం చూసి జాను తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఆ తర్వాత విక్రమ్.. జానుతో డ్యాన్స్ చేసి కిందికి దిగుతారు. మెల్లెగా బావ అంటూ విక్రమ్ ను కిందికి తీసుకొస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే నా బెడ్ రూమ్ కు తీసుకెళ్తున్నాను అంటుంది జాను. ఎందుకు అంటే జాగ్రత్తగా చూసుకుందామని అంటుంది జాను. దీంతో తప్పు నీ బెడ్ రూమ్ లోకి నేను రాకూడదు అంటాడు విక్రమ్. దీంతో సరే.. నీ బెడ్ రూమ్ లోకి వెళ్దాం పదా. నేను తాగి లేను కదా అంటుంది జాను. దీంతో విక్రమ్ బెడ్ రూమ్ లోకి వెళ్తుంది జాను. అది చూసి తన తల్లిదండ్రులు ఫుల్ ఖుషీ అవుతారు. మరోవైపు తాతయ్య ట్యాబెట్స్ వేసుకోండి అని పరందామయ్యకు దివ్య చెబుతుంది. ప్రతి అరగంటకు ఒకసారి వేసుకోవాలి అని చెబుతుంది. నా దెబ్బలేమో కానీ.. చాలా సంతోషంగా ఉంది. నా మనవరాలు ఇంటికి వచ్చింది. రెండు మూడు రోజులు ఇక్కడే ఉంటావు కదా అంటే మామయ్య.. ఇదివరకులా కాదు.. తనకు సంసారం, బాధ్యతలు ఉంటాయి అంటుంది తులసి.

#image_title

Intinti Gruhalakshmi 11 Oct Today Episode : నందును బెదిరించిన రత్నప్రభ

బాధ్యతలు అంటూ నువ్వు అప్పట్లో పుట్టింటికి వెళ్లేదానివే కాదు. మీ అమ్మేమో మమ్మల్ని తిట్టుకునేది అంటుంది అనసూయ. సర్లే.. పదా నువ్వు అన్నం తిని ఇంటికి వెళ్లు అని దివ్యతో అంటుంది తులసి. అప్పుడే పంపించేస్తావా.. కూతురు ఇంటికి వస్తే ఏ అమ్మ అయినా ఓ వారం రోజులు ఉండు అని అంటుంది. కానీ.. మా అమ్మ మాత్రం వెంటనే వెళ్లిపో అంటోంది అంటుంది దివ్య. దీంతో నువ్వు లేకపోతే అల్లుడు గారికి ఇబ్బంది కాదా అంటే ఏం ఇబ్బంది అంటుంది.

నేను వెళ్లను.. నేను లేకపోతే తాతయ్య ట్యాబ్లెట్స్ వేసుకోడు. రాత్రికి ఇక్కడే ఉంటా. రేపు వెళ్తా అంటుంది దివ్య. దీంతో మీరైనా నచ్చజెప్పండి అని నందుతో అంటుంది తులసి. దీంతో హనీ విషయంలో నువ్వు ఎంత చెప్పినా వినలేదు. ఇక దివ్య మాత్రం నా మాట ఎక్కడ వింటుంది అని అంటాడు నందు.

మరోవైపు దివ్య మనం చెస్ ఆడుకుందాం.. వెళ్లి బోర్డ్ తీసుకురా అంటాడు పరందామయ్య. మరోవైపు జాను తండ్రి.. తన అక్క దగ్గరికి వెళ్తాడు. ఇంకేంటి నీ బిడ్డ ఈ ఇంటి పెద్ద కోడలు కాబోతోంది అంటుంది. ఇప్పుడు వాడు మత్తులో ఉన్నాడు కాబట్టి మాట వింటున్నాడు. తెల్లారాక జరిగిన ఘోరంతో నాకు సంబంధం లేదు అంటే ఎలా అంటాడు. దీంతో చావు తప్పితే వేరే దారి లేదంటూ ఊదరగొట్టిస్తాను అంటుంది రాజ్యలక్ష్మి.

కన్నతండ్రిని దగ్గరుండి కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నానేమో అని భయమేస్తోంది అంటాడు. జానునే ధైర్యంగా ఉంది అంటుంది రాజ్యలక్ష్మీ. మరోవైపు తెల్లవారుతుంది. గదిలో నుంచి ఎంతకూ జాను, విక్రమ్ బయటికి రారు. వీళ్లు ఇంకా బయటికి రావడం లేదు ఏంటి అని అనుకుంటారు.

దివ్య పుట్టింటి నుంచి వచ్చే లోపే ఆ పంచాయతీని తేల్చేయాలి అని అంటుంది. ఇంతలో దివ్య వస్తుంది. తనను చూసి జాను తండ్రి షాక్ అవుతాడు. ఇంట్లో అందరూ బాగున్నారా అని అడుగుతాడు. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు ఏంటి బాబాయి అంటే..  లేదు మామూలుగానే ఉన్నాం అంటాడు. తనను ఎలా మేనేజ్ చేయాలో వాళ్లకు అర్థం కాదు.

ఇంతలో జాను.. విక్రమ్ బెడ్ రూమ్ నుంచి బయటికి వస్తూ కనిపిస్తుంది. తనను చూసి దివ్య షాక్ అవుతుంది. జాను.. నువ్వేంటి బావ బెడ్ రూమ్ నుంచి వస్తున్నావు అని ఏం తెలియనట్టు అడుగుతారు. దీంతో జానుకు ఏం చేయాలో అర్థం కాదు. రాత్రి బావ వద్దన్నా వినకుండా ఫుల్ గా తాగాడు. గదిలో పడుకోబెట్టి వెళ్దామని అనుకుంటే నా చేయి పట్టుకొని అస్సలు వదల్లేదు. దీంతో రాత్రి మొత్తం బావ పక్కనే పడుకున్నాను అంటుంది జాను. దీంతో దివ్యకు ఏం చేయాలో అర్థం కాదు.

ఇంతలో రాహుల్ రూమ్ లో నుంచి బయటికి వస్తాడు. ఏంటి ఇక్కడే ఉన్నావు జాను.. వెళ్లి ఫ్రెష్ అవ్వు అంటాడు రాహుల్. దీంతో దివ్య షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు చేసిన పని. నీకు అసలు బుద్ధ ఉందా? మీ మామయ్యకు నేను ఏం సమాధానం చెప్పాలి అంటుంది రాజ్యలక్ష్మీ. వీళ్లు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు దివ్య అంటాడు.

నా కూతురుకు అన్యాయం చేయకు అల్లుడు అంటాడు. నా కూతురు తల మీద చేయి వేసి చెప్పు.. ఏం జరగలేదని అని అంటాడు. దీంతో తన తల మీది నుంచి చేయి తీస్తాడు రాహుల్. రాత్రి ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తుకు రావడం లేదు అంటాడు రాహుల్.

దీంతో ఇక నావల్ల కాదు. నేను బతకను అంటాడు. విక్రమ్ కాదు నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతాను. నా విక్రమ్ కడిగిన ముత్యం. కల్మషం లేని మనిషి. తను ఎలాంటి తప్పు చేయలేదు.. చేయడు అంటుంది దివ్య. అయినా జాను తల్లిదండ్రులు వినరు. ఏడుపు లంఖిస్తారు. దీంతో దివ్యకు ఏం చేయాలో అర్థం కాదు.

మరోవైపు రత్నప్రభ మళ్లీ నందుకు ఫోన్ చేస్తుంది. మీ అమ్మ, తులసి, హనీ.. ముగ్గురూ గుడికి వెళ్లారు కదా. ఇంకొన్ని నిమిషాల్లో వాళ్ల ఆయుష్సు ముగిసిపోతుంది అని రత్నప్రభ.. నందుకు చెబుతుంది. వాళ్లను చంపడానికి రౌడీలను పంపిస్తుంది రత్నప్రభ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

3 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

6 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

9 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

11 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

14 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

16 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago