Home » Entertainment » Intinti Gruhalakshmi 12 January 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 12 Jan Today Episode : నందుకు ఉద్యోగం రావడంతో అందరూ హ్యాపీ.. కానీ వసంత వండిన వంటలు తినలేక నందు షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Published on: January 12, 2022, 10:00 am
Advertisement

Intinti Gruhalakshmi 12 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 జనవరి 2022, బుధవారం ఎపిసోడ్ 527 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శృతి వాంతులు చేసుకునే సరికి.. అనసూయ చూసి తట్టుకోలేకపోతుంది. ఖుషీ అవుతుంది. నేను ఇలా అనుకున్నానో లేదో.. అప్పుడే వాంతులు చేసుకుంది.. అంటూ తెగ సంతోష పడుతుంది. దీంతో శృతిని రెస్ట్ తీసుకోమ్మంటూ చెబుతుంది. కానీ.. అవి ఉత్తుత్తి వాంతులే అని చెబుతుంది శృతి. నెల ఇప్పుడే తప్పలేదా.. లేక ఎప్పుడూ తప్పకూడదనుకుంటున్నావా అంటూ ప్రశ్నిస్తుంది అనసూయ. అలా ఏం లేదు అని అంటుంది శృతి. మరోవైపు వారెవ్వా వసంత టీవీలో సినిమా చూస్తూ తెగ నవ్వేస్తుంటుంది. అనసూయ చూసి షాక్ అవుతుంది. ఏయ్… ఆ రిమోట్ ఇవ్వవే అంటుంది అనసూయ. మీకు ముందే చెప్పా కదా టీవీ చూసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దని అంటుంది వసంత.

Advertisement

intinti gruhalakshmi 12 january 2022 full episode

నీకు నోటి దురుసు ఎక్కువైంది. స్క్రూ బిగిస్తే కానీ సెట్ కావు అని అంటుంది అనసూయ. ఇంతలో పరందామయ్య వస్తాడు. అటూ ఇటూ తిరుగుతుంటాడు. అనసూయ నా కళ్లజోడు ఎక్కడైనా చూశావా అని అడుగుతాడు. టేబుల్ మీద ఉన్న కళ్లజోడును చూసి అనసూయ.. అవి ఆయనకు ఇవ్వు అని వసంతను అడుగుతుంది. నేను ఇవ్వను అని అంటుంది వసంత. ఇంతలో తులసి వచ్చి ఆ కళ్లజోడు తీసుకొచ్చి ఇస్తుంది. నువ్వెందుకు తెచ్చి ఇచ్చావు అని అంటుంది అనసూయ. తను.. వాళ్లిద్దరి పనులే చేయాలని వసంతకు చెప్పింది కదా అంటుంది తులసి. ఇంతలో నందు వస్తాడు. చాలా సంతోషంగా ఉంటాడు. నాన్నా… అంటూ లోపలికి వస్తాడు. నాకు జాబ్ వచ్చింది అంటాడు. అందరూ ఖుషీ అవుతారు. తులసి కూడా సంతోషిస్తుంది.

Advertisement

నా ఫ్రెండ్ కేఫ్ బాధ్యతలను చూసుకునే జాబ్ అది. మీరేమంటారు అంటాడు. ఏ జాబ్ అయితే ఏంటిరా.. ఎక్కువ కష్టపడితే.. కాలం కలిసి వస్తే నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు అంటాడు పరందామయ్య. సరే నాన్న అని చెప్పి నందు లోపలికి వెళ్తాడు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి నీకు దేవుడు మరో అవకాశం ఇచ్చాడు. నువ్వు గెలవాలి అని అనుకుంటాడు నందు.

Intinti Gruhalakshmi 12 Jan Today Episode : వసంత వండిన వంటను తినలేకపోయిన నందు

మరోవైపు తన అత్తయ్య, మామయ్యకు తులసి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో నందు వస్తాడు. వసంత అని పిలుస్తాడు నందు. వంట రెడీ సార్ అని కూరలు తీసుకొస్తుంది. కానీ.. ఆ కూరలు తనకు నచ్చవు. వసంత ఆ కూరలు వేసే సరికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ కూరలతో భోజనం తినలేకపోతాడు నందు.

Advertisement

ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది అమ్మా అని అడుగుతాడు పరందామయ్య. కొత్త కాంట్రాక్ట్ గురించి కూడా ఆరా తీస్తాడు.. పరందామయ్య. కంగ్రాట్స్ తులసి అని నందు అంటాడు. మరోవైపు నందు ఆ కూరలు తినలేక పైకి లేస్తాడు. కానీ.. అనసూయ పిలిచి రా వచ్చి కూర్చో అని చెబుతుంది.

ఒరేయ్ నందు.. ఈ అమ్మ బతికి ఉండగా నువ్వు ఆకలితో ఈ డైనింగ్ టేబుల్ మీద నుంచి లేవాల్సిన అవసరం లేదురా అంటుంది అనసూయ. తులసి వండిన వంటలను అన్నింటినీ వడ్డిస్తుంది అనసూయ. దీంతో నందు వాటిని లొట్టలేసుకుంటూ తింటాడు.

మరోవైపు అభి.. మనోజ్ కు ఫోన్ చేస్తాడు. లైఫ్ లో అనుకున్నది సాధించాలంటే షార్ట్ కట్స్ వెతుక్కోవాలి అని నిర్ణయించుకున్నా అంటాడు అభి. కానీ.. మరోసారి ఆలోచించుకొని ముందుకురా అంటాడు. ఆ తర్వాత లాస్య ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వస్తుంది. నందు తనకు కేఫ్ లో జాబ్ వచ్చిందని చెప్పేసరికి వద్దు ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేయి అని చెబుతుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి