Intinti Gruhalakshmi 12 Oct Today Episode : ప్రేమ్, అక్షర పెళ్లి ఎలా? కన్యాదన సమయానికి కనబడని తులసి.. స్టోర్ రూంలో శ్రుతి..

Intinti Gruhalakshmi 12 Oct Today Episode : ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతోంది. ఒక ఎపిసోడ్ తర్వాత వచ్చే మరో ఎపిసోడ్ లో ఏమవుతుందో అని ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రేమ్-అక్షర మ్యారేజ్ టైం దగ్గరకు వస్తుండటంతో పెళ్లి ఎలా జరగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ లోపల తులసి శ్రుతి మనసులో ఉన్న బయట పెట్టిస్తే ఎలా అనేది చర్చనీయాంశంగా ఉంది.ప్రేమ్-అక్షర పెళ్లి పీటల మీద కూర్చొన్న సమయంలో ఎక్కడ శ్రుతి తన మనసులో మాట చెప్తుందోనని నందు ఆమె ప్రయత్నాలకు అడ్డుకట్ట వేశాడు.

intinti gruhalakshmi 12 october 2021 Full episode

ఇక మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. పెళ్లి మండపానికి నందు ఫ్యామిలీ బయల్దేరుతుంటారు. మరో వైపున అక్షర్-ప్రేమ నవ వధూవురులుగా పెళ్లి బట్టల్లో అందంగా కనిపిస్తుంటారు. ఇకపోతే లాస్య, నందు, అనసూయతో పాటు మిగతవారు అందరు అక్షరను పొగిడేస్తుంటారు. అయితే, ఇలా సందడి ఉన్న వాతావరణంలో తులసి, ప్రేమ్ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రేమ్ సైలెంట్ అయిపోవడం గమనించి అంకిత అలుగుతుంది. అది చూసిన ప్రేమ్.. ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్లుగా లుకింగ్ నైస్ అని అంటాడు.

ఈ క్రమంలోనే శ్రుతి వచ్చేస్తుంది. అక్షర నుదుటన ఉన్న పెళ్లి బాసికం జారిపోతుండగా శ్రుతి పట్టుకుంటుంది. జాగ్రత్తగా ఉండాలని అక్షరకు చెప్తుంది. అయితే, తన నుంచి జారిపోతే ఏం నీవు పట్టుకున్నావ్ కద అని శ్రుతిని ఉద్దేశించి అంటుంది అక్షర. అలా వారిరువురు చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. బాల్యంలో ఎవరికి ఏది దొరికితే అది వాళ్లే ఉంచుకునేవారని, అలా శ్రుతిని బాసికం నువ్వే ఉంచుకుంటావా ఏంటి? అని అక్షర అడుగుతూ జోక్ చేస్తుంది. అయితే, శ్రుతి అలా ఏం లేదులే.. అని బదులు చెప్తూనే..అక్షర చేతిలో బాసికం పెట్టగా, నువ్వే కట్టు అని అక్షర అంటుంది.

Intinti Gruhalakshmi 12 Oct Today Episode : సైలెంట్ అయిన తులసి, ప్రేమ్..

అలా అక్షరకు శ్రుతి పెళ్లి బాసికం కడుతుంది. అలా అందరు పెళ్లి మండపానికి బయల్దేరుతుండగా శ్రుతి మాత్రం ఆగిపోతుంది. నందు, లాస్యను చూసి కారు ఎక్కకుండా ఉండిపోతుంది. తులసి పిలిచినప్పటికీ తాను పెళ్లి బట్టలు మరిచిపోయానంటూ రూంలోపలికి వెళ్తుంది. ఇంతలో లాస్య, నందు శ్రుతిని ఆపాలని చర్చించుకుంటారు. బట్టల రూంలో ఏడుస్తు ఉన్న శ్రుతిని చూసి నందు పెళ్లికి రావద్దని చెప్తాడు. అయితే, తాను పెళ్లి మండపానికి ఏం అవుతుందని, తన మీద నమ్మకం లేదా అని శ్రుతి నందును ప్రశ్నిస్తుంది.

intinti gruhalakshmi 12 october 2021 Full episode

దానికి నందు బదులిస్తాడు. శ్రుతి మీద నమ్మకముందని, కానీ, ఆమె ప్రేమ మీద నమ్మకం లేదని, ప్రేమ చాలా చెడ్డదని అంటాడు నందు. అలా నువ్వు ఇక్కడే ఉండిపో అంటూ శ్రుతని స్టోర్ రూంలో లాక్ చేసే ప్లాన్ చేశాడు నందు. శ్రుతి కూడా ఓకే చెప్పడంతో ఆమెను స్టోర్ రూంలో వేసి లాక్ చేశాడు నందు. అలా శ్రుతిని రూంలో బంధించి పెళ్లి మండపానికి లాస్యతో చేరుకుంటాడు నందు. ఆ తర్వాత పెళ్లిలో అక్షర తండ్రి జీకే తులసి ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు నందు వస్తుందని చెప్తాడు.

ఈ క్రమంలోనే పెళ్లి మండపానికి నవ వధూవరులు ప్రేమ్, అక్షర రీచ్ అవుతారు. అలా కన్యాదాన సమయం దగ్గరపడుతుంది. దాంతో తులసి స్థానంలో లాస్య కూర్చుంటుదని నందు చెప్తాడు. దానికి జీకే ఏ విధంగా స్పందిస్తాడు? ఇంతకీ ఈ పెళ్లి తంతు ఇప్పట్లో ముగుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Recent Posts

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

10 minutes ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

1 hour ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

2 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

3 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

4 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

5 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

6 hours ago

Whats App | వాట్సాప్‌లో నూతన ఫీచర్ .. ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు!

Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…

15 hours ago