Intinti Gruhalakshmi 12 Oct Today Episode : తులసిని చంపించేందుకు రౌడీలను పంపించిన రత్నప్రభ, విక్రమ్, జాను ఇద్దరికీ పెళ్లి చేసేందుకు రాజ్యలక్ష్మి సన్నాహాలు

Intinti Gruhalakshmi 12 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 12 అక్టోబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1073 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయమే నందుకు ఫోన్ వస్తుంది. గుడ్ మార్నింగ్ అంటూ రత్న ప్రభ ఫోన్ చేస్తుంది. రోమ్ నగరం తగులబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడట. నీది అలాగే ఉంది. హనీని తిరిగి పంపించకపోతే కొంపలంటుకుంటాయి అని చెప్పినా నువ్వు వినలేదు. ప్రశాంతంగా గురక పెట్టి నిద్రపోతున్నావా? అసలు నీకు ఎలా నిద్ర పడుతోంది. కొంచెం కూడా భయం అనిపించడం లేదా? అంటే కొద్దిగా టైమ్ కావాలి అని అడిగా కదా అంటాడు నందు. దీంతో గంటల తరబడి వెయిట్ చేస్తానని ఎలా అనుకున్నావు అంటుంది రత్నప్రభ. తులసి నీ మాట వినకపోతే ఏం చేస్తావు. బలవంతంగా హనీని తులసి నుంచి వేరు చేసి నాకు అప్పజెప్తావా? నిజంగా నీకు అంత దమ్ము ఉంటే ఇప్పుడెందుకు చేయకూడదు. జీవితకాలం సమయం ఇచ్చినా ఏ విషయంలోనూ తులసిని నువ్వు కన్విన్స్ చేయలేవు. అంత టాలెంట్ ఉంటే.. లాస్యకు విడాకులు ఇవ్వగానే తులసి మెడలో తాళి కట్టేవాడివి అంటుంది రత్నప్రభ.

నావి ఉత్తుత్తి బెదిరింపులు కావు. ఇప్పటికే యాక్షన్ లోకి దిగిపోయాను. మీ అమ్మను, హనీని తీసుకొని తులసి గుడికి వెళ్లింది. ఇంకొన్ని నిమిషాల్లో వాళ్ల ఆయుష్షు ముగియబోతోంది. వెళ్లు.. పరిగెత్తి మీ వాళ్లను కాపాడుకోపో అంటూ సీరియస్ అవుతుంది రత్నప్రభు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఈ భయమే నందులో నేను చూడాలని అనుకున్నది అని అంటుంది లాస్య. వెంటనే నందు బయటికి వచ్చి నాన్న.. తులసి వాళ్లు ఎక్కడ అని అడుగుతాడు. దీంతో గుడికి వెళ్లారు అని అంటాడు. ఏ గుడికి అంటే నాకు తెలియదు అంటాడు పరందామయ్య. నేను అర్జెంట్ గా తులసితో మాట్లాడాలి అంటాడు నందు. వెంటనే తులసికి ఫోన్ చేస్తాడు. కానీ.. తను ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏమైందిరా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే నాన్న తులసి వాళ్లు ప్రమాదంలో ఉన్నారు. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను అని చెప్పి వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని బయటికి వెళ్తాడు. పరందామయ్య ఫోన్ చేసినా కూడా తులసి ఫోన్ లిఫ్ట్ చేయదు.

#image_title

Intinti Gruhalakshmi 12 Oct Today Episode : నందును ముప్పుతిప్పలు పెట్టిన రత్నప్రభ, లాస్య

ఇంతలో మళ్లీ రత్నప్రభ ఫోన్ చేస్తుంది. వాళ్లు ఎక్కడున్నా కూడా నేను వెతికి పట్టుకుంటాను అంటాడు నందు. తులసి వాళ్లు ఏ గుడికి వెళ్లారో చెప్పు అంటే రత్నప్రభ చెప్పదు. అవసరం నీది బెదిరించకు.. బతిమిలాడుకో అంటుంది రత్నప్రభ. శ్రీనివాస నగర్ అమ్మ వారి గుడికి వెళ్లారు. వెళ్లి కాపాడుకోపో అంటుంది రత్నప్రభ. నువ్వు ఇలా నందును ఏడిపిస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తోంది అంటుంది లాస్య.

మరోవైపు అనసూయ, హనీ, తులసి.. ముగ్గురు గుడికి వెళ్తారు. గుడిలో దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. మరోవైపు నందు ఆ గుడికి కారులో బయలుదేరుతాడు. ఇంతలో మళ్లీ రత్నప్రభ కాల్ చేస్తుంది. హడావుడిలో పడిపోయి ఇందాక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తులిసి వాళ్లు వెళ్లింది అమ్మ వారి గుడికి కాదు.. రామాపురంలోని రాముల వారి గుడికి. వెంటనే వెళ్లి మీ వాళ్లను కాపాడుకో అంటుంది రత్నప్రభ.

దీంతో రాముల వారి గుడికి వెళ్తాడు నందు. అక్కడికి వెళ్లాక ఆ టెంపుల్ కాదు వేరే టెంపుల్ అంటూ అన్ని గుడులకు తిప్పుతుంది రత్నప్రభ. ఇలాగే.. ఏ గుడినో సరిగ్గా చెప్పదు. గాంధీనగర్ లోని శివాలయానికి వెళ్లు. ఇంకా 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఇదే నా లాస్ట్ కాల్ అంటుంది రత్న ప్రభ. మరోవైపు రౌడీలు తులసి చుట్టుముడతారు. అప్పుడే నందు కారులో దిగి వాళ్లను కాపాడుతాడు.

మీరేంటి ఇక్కడ అంటే.. అసలు బుద్ధి ఉందా? ఎక్కడికి వెళ్తున్నారో ఏ గుడికి వెళ్తున్నారో చెప్పరా? అంటూ తులసి మీద సీరియస్ అవుతాడు నందు. సారీ అండి. గుడికి వస్తున్నాను కదా అని మొబైల్ ను సైలెంట్ మోడ్ లో పెట్టుకున్నాను తెలియలేదు అంటుంది. అయినా మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అంటే నా టెన్షన్ నాకు ఉంటుంది. నా భయం నాకు ఉంటుంది అంటాడు నందు. ఆ తర్వాత అందరినీ కారులో తీసుకెళ్తాడు నందు.

మరోవైపు దివ్యపై నిందలు వేస్తారు. అసలు నువ్వు ఎందుకు వెళ్లావు అంటే.. మా తాతయ్యను ఎవరో కొడితే చూడటానికి వెళ్లాను అంటుంది దివ్య. మీరు ఎందుకు జానును హద్దుల్లో పెట్టుకోవడం లేదు అంటే.. వీళ్లిద్దరూ బావమరదళ్లు.. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసే పెరిగారు అని అంటారు. నేను కావాలని చేయలేదు. తాగిన మత్తులో ఉన్నాను. ఏం చేశానో గుర్తు రావడం లేదు అంటాడు విక్రమ్.

విక్రమ్ తాగిన మత్తులో ఉంటే.. పెళ్లి కాని ఆడదానివి. నువ్వు నీ జాగ్రత్తలో ఉండొచ్చు కదా. అసలు విక్రమ్ కి మందు అలవాటు లేదు. నీతో మందు తాగించింది ఎవరు అంటే.. ఏదో సరదాగా కొద్దిగా తాగుతాడులే అనుకున్నాను. అయినా మందు తాగడంలో తప్పేం ఉంది. ఇది కల్చరే కదా అంటుంది జాను. దీంతో విన్నారు కదా.. జాను ఎలా మాట్లాడుతుందో అంటుంది దివ్య.

జరిగిన తప్పును సరిచేస్తాను.. అంటుంది రాజ్యలక్ష్మీ. ప్రసునాంబ పసుపు తాడు తీసుకురా అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో నేను ఒప్పుకోను అంటుంది దివ్య. నా రెండో కొడుకు ప్రియ విషయంలో తప్పు చేశాడు. ఆ తప్పు ఒప్పుకొని ముహూర్తం చేసి పెళ్లి చేస్తామంటే వెంటనే తాళి కట్టించావు. ఇప్పుడు విక్రమ్ విషయంలోనూ అదే జరుగుతోంది. జానును విక్రమ్ రెండో భార్యగా చేయడం జానుకు అన్యాయం చేసినట్టు అవుతుంది. కానీ.. అది తప్పడం లేదు. ప్రసునాంబ పసుపు తాడు తీసుకురా. నా బిడ్డ తాగినమత్తులో చేసిన తప్పుకు ఇదే శిక్ష అంటుంది రాజ్యలక్ష్మీ.

దీంతో సరే ఒప్పుకుంటున్నాను అంటుంది దివ్య. నా భర్త చేసిన తప్పుకు శిక్ష నేను అనుభవిస్తాను. కాకపోతే శిక్ష పడాలి అంటే నేరం రుజువు కావాలి కదా అంటుంది దివ్య. మరోవైపు హనీని రూమ్ లోకి పంపించి.. మన ఫ్యామిలీని చంపుతాం అని బెదిరిస్తున్నారు అంటూ తులసికి చెబుతాడు నందు. హనీని పంపించేస్తే సమస్యలు తీరుతాయి అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago