Home » Entertainment » Intinti Gruhalakshmi 13 December 2021 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 13 Dec Today Episode : లాస్యకు భారీ షాక్ ఇచ్చిన నందు.. ఫ్యామిలీకి షాక్ ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తులసి

Authored By
Varun G
The Telugu News | Updated on: December 13, 2021 10:57 am
Advertisement

Intinti Gruhalakshmi 13 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 501 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జామకాయలను తులసి, శృతి ఇద్దరూ కడుగుతుంటారు. సరే శృతి.. నువ్వు ఈ జామకాయలు కడుగు. నేను ఇప్పుడే పాల ప్యాకెట్ తీసుకొస్తాను అని చెబుతుంది తులసి. ఇంతలో.. ప్రేమ్ వస్తాడు. నువ్వు అమ్మకు తోడుగా ఉంటున్నావు. అమ్మను ప్రేమగా చూసుకుంటున్నావు అంటూ చెబుతాడు ప్రేమ్. అమ్మ కష్టకాలంలో కూడా నువ్వు తోడుంటున్నావు అంటాడు ప్రేమ్. కానీ.. అమ్మకు ఏమవుతుందోనని భయమేస్తుంది అంటాడు ప్రేమ్. ఆంటికి ఏం కాదు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు.. అంటుంది శృతి. థ్యాంక్స్ శృతి అంటాడు ప్రేమ్. భార్యకు ఎవరైనా థ్యాంక్స్ చెబుతారా అంటుంది శృతి. దీంతో సరే.. థ్యాంక్స్ మాత్రమే చెబితే సరిపోదు కదా.. ఇంకా ఏం చెప్పాలి.. అంటూ ఒక ముద్దు ఇస్తాడు. వాళ్లు సరదాగా గడపడం చూసి తులసి ముచ్చటపడుతుంది.

Advertisement

intinti gruhalakshmi 13 december 2021 full episode

జామకాయలను కోశాక.. తులసి వాటిని ముక్కలుగా కోస్తుంటుంది. అప్పుడే అక్కడికి నందు వస్తాడు. తులసి జామకాయలు కోయడం చూస్తాడు. తులసి కూడా నందును చూస్తుంది. ఇద్దరూ ఒకరిని మరొకరు చూస్తూ ఉంటారు తప్పితే ఏం మాట్లాడుకోరు. ఇంతలో తన గతాన్ని ఓసారి గుర్తు తెచ్చుకుంటుంది తులసి. నందుకు జామకాయలు అంటే చాలా ఇష్టం అనే విషయాన్ని గుర్తు తెచ్చుకొని.. వాటి మీద ఉప్పు కారం చల్లి తీసుకొచ్చి నందుకు ఇస్తుంది. తీసుకోండి అంటుంది. వద్దు అన్నట్టు తల ఊపుతాడు. దీంతో ఏమనుకోను కావాలంటే కళ్లు మూసుకుంటాను అంటుంది తులసి. వద్దని చెబుతున్నాను కదా అంటాడు నందు. ఇష్టం లేని నా మీద ఉన్న కోపం.. ఇష్టం ఉన్న జామకాయల మీద చూపిస్తే.. నష్టం మీకే అంటుంది తులసి. మీ మాజీ భార్య తన చేతులతో ఇస్తుంటే కూడా తీసుకోరా అంటుంది తులసి. దీంతో వాటిని గబగబా తినేస్తాడు నందు. చూసి.. తులసి సంతోషిస్తుంది.

Advertisement

మరోవైపు శృతి.. తులసి ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్ వస్తాడు. ఏమైంది శృతి అని అడుగుతాడు. ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. ఏమి లేదు అంటుంది శృతి. మరి ఆ కన్నీళ్లు ఏంటి అంటే.. ఆంటి గురించి ఆలోచిస్తేనే కన్నీళ్లు ఆగడం లేదు ప్రేమ్ అంటుంది శృతి.

ఆంటికి ఎందుకు అలాంటి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. మనం కోరుకున్నది దక్కనివ్వడు. ఆంటి ఆరోగ్యం కోసం అంకుల్ కూడా టెన్షన్ పడుతున్నారు. పాత విషయాలను మరిచిపోయి ఆంటితో క్లోజ్ గా ఉంటూ ఆంటిలో సంతోషాన్ని చూడటం కోసం ప్రయత్నిస్తున్నారు. మనందరం ఆంటి సంతోషం కోసం ప్రయత్నిస్తున్నాం కానీ.. ఒక్క లాస్య తప్ప అంటుంది శృతి.

Advertisement

లాస్యతో మనకేంటి సంబంధం శృతి. అమ్మకు మనం ఉన్నాం. పరిస్థితి ఇంతకుముందులా లేదు శృతి అంటాడు. కానీ.. లాస్య చాలా డేంజర్ పర్సన్. తను అంత ఈజీగా ఓటమి ఒప్పుకోదు. తను ఆంటిని ఎక్కడ కార్నర్ చేస్తుందోనని భయంగా ఉంది అంటుంది శృతి.

Intinti Gruhalakshmi 13 Dec Today Episode : ఈ పరిస్థితుల్లో నాకు తులసే ముఖ్యం.. నా సమాధానం ఇదే.. అని లాస్యతో చెప్పిన నందు

కట్ చేస్తే నందు, లాస్య.. ఇద్దరూ మాట్లాడుకుంటారు. నాకు నువ్వు ఎక్కడ దక్కకుండా పోతావో అని భయం వేస్తోంది నందు అంటుంది లాస్య. తులసి ఆరోగ్యం దృష్ట్యా తనను సంతోషంగా ఉంచేందుకు తనతో దగ్గరగా ఉండాల్సి వస్తోంది.. అంటాడు నందు.

నన్ను పెళ్లి చేసుకో.. నేను కూడా సేవలు చేస్తాను తులసికి అంటుంది లాస్య. దానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.. అంటాడు నందు. మరి.. ఏ హోదాతో తులసికి సేవ చేయాలంటున్నావు అంటుంది లాస్య. దానికి హోదా అవసరం లేదు అంటాడు నందు.

నువ్వు వంద సార్లు అడిగినా.. వెయ్యి సార్లు అడిగినా నా సమాధానం మాత్రం ఒక్కటే. ఈ పరిస్థితిలో నాకు తులసి మాత్రమే ముఖ్యం. అంతే.. అని తేల్చి చెప్పేస్తాడు నందు. దీంతో లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. పిచ్చెక్కుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది.

Advertisement

కట్ చేస్తే తెల్లారుతుంది. తులసి.. తులసి చెట్టుకు పూజ చేస్తుంది. ఇంతలో తనకు గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. ఎవరు అని చూస్తుంది. నందు గజ్జెలు తీసుకొని వస్తాడు. నా కారణంగా నీకు ఇష్టమైన నాట్యానికి దూరం అయ్యావు. అందుకే.. నీకు ఇష్టమైన నాట్యం చేయడం కోసం గజ్జెలు తీసుకొచ్చాను అంటాడు నందు.

ఇంతలో నందు చెల్లెలు, బావ వస్తారు. వాళ్లు కూడా నందును తిడతారు. ఇన్ని రోజులు తులసిని పట్టించుకోకుండా.. లాస్య వెంట తిరిగి.. ఇప్పుడు తులసి మీద ప్రేమ చూపిస్తున్నావా అని ప్రశ్నిస్తారు. అంతా అయిపోయాక ఇప్పుడు ఏంటి లాభం అంటారు.

ఎలా ఉన్నావు వదిన. నీ విషయం తెలిసింది వదిన. మంచి వాళ్లకే దేవుడు కష్టాలు ఇస్తాడు అంటుంది మాధవి. మరోవైపు తులసి బ్యాగ్ సర్దుకొని ఇల్లు వదిలి వెళ్లిపోబోతుంది. ఎక్కడికి తులసి అంటే.. ఎవ్వరూ నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేని చోటుకి అంటుంది. ట్రీట్ మెంట్ మధ్యలో అలా వెళ్లిపోకూడదు అన్నా కూడా వినదు తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి