intinti gruhalakshmi 13 january 2022 full episode
Intinti Gruhalakshmi 13 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జనవరి 2022, గురువారం 528 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి ఆఫీసును వచ్చి బాగా అలసిపోయానని టేబుల్ మీద కాళ్లు పెట్టుకొని పడుకుంటుంది. అక్కడే ఉన్న తులసి, అనసూయ అది చూసి షాక్ అవుతారు. ఇంతలో వారవ్వా వసంత తనకు మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. తను మూడీగా ఉండటం చేసి ఏమైంది వసంత అంత డల్ గా ఉన్నావు. నేను లేనప్పుడు ఏదైనా జరిగిందా అని అడుగుతుంది లాస్య. దీంతో నేను చెబుతాను అంటూ వసంత చేసిన పనుల గురించి అనసూయ మొత్తం చెప్పేస్తుంది.
intinti gruhalakshmi 13 january 2022 full episode
మరోవైపు సార్ ఎక్కడున్నారు వసంత అని అడుగుతుంది లాస్య. గదిలో ఉన్నారు. అన్నం తినలేదు అంటుంది. అంటే నేను వండింది తినలేదు. ఆవిడ గారు వండింది తిన్నారు అని వసంత చెప్పగానే లాస్య అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. అనసూయను కూడా తిడుతుంది. దీంతో లాస్య నువ్వు అత్తయ్య గారి మీద ఎందుకు అరుస్తున్నావు అంటుంది తులసి. ఆ తర్వాత లాస్య, తులసి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. వసంత ఈరోజు నుంచి నేను ఏది చెబితే అదే వండాలి అంటుంది లాస్య. సరే మేడమ్ అంటుంది లాస్య. మరోవైపు నందు దగ్గరికి లాస్య వెళ్తుంది. దీంతో నాకు ఓ జాబ్ ఆఫర్ వచ్చింది అని చెబుతాడు నందు. దీంతో ఏం జాబ్ అని అడుగుతుంది లాస్య.
ఏది ఆ స్టార్టప్ కంపెనీయా అంటుంది. లేదు వేరే చోట అంటాడు నందు. అవునా.. ఇంత గుడ్ న్యూస్ అంత లేట్ గా చెబుతావు ఏంటి నందు. మనకు ఇక మంచి రోజులు రాబోతున్నాయి అని అంటుంది లాస్య. వెంటనే లోన్ తీసుకొని మనకంటూ సొంత ఇల్లు తీసుకోవాలి అంటుంది లాస్య.
నా జాబ్ కు లోన్ రాదు అంటాడు నందు. అదేంటి సాఫ్ట్ వేర్ జాబ్ కు లోన్ రాకపోవడం ఏంటి అంటుంది లాస్య. అది సాఫ్ట్ వేర్ జాబ్ కాదు. అది ఫ్రెండ్ కేఫ్ లో మేనేజర్ జాబ్ అంటాడు. ఏంటి నందు నువ్వు జోక్ చేస్తున్నావా? నా రిప్యుటేషన్ కు ఏం కావాలి అంటూ లాస్య నందుపై సీరియస్ అవుతుంది.
నాకు జాబ్ వచ్చింది అంటే అందరూ చాలా సంతోషించారు. కానీ.. నువ్వు మాత్రం ఎలా చేస్తున్నావు అంటాడు నందు. నీకన్నా తులసి బెస్ట్.. తను నాకు జాబ్ వచ్చిందంటే చాలా సంతోషించింది. కానీ.. నువ్వు మాత్రం ఇలాగానా వ్యవహరించేది అని అంటాడు నందు.
నువ్వు ఏమైనా చేసుకో నందు. నువ్వు ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేస్తున్నావు అంతే.. అంటుంది లాస్య. దీంతో నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. నిన్ను చేరాలా వద్దా అని అడగట్లేదు అని చెబుతాడు నందు. నన్ను కంట్రోల్ చేయాలని చూడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.
నేను ట్యాబ్లెట్లు మింగినట్టు.. లాస్య నందు జీవితంలో సంతోషాన్ని మింగేస్తుంది అంటూ పరందామయ్య తులసితో అంటాడు. మనం ఏం చేస్తాం మామయ్య.. వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అంటుంది తులసి. నాకు తెలిసి నందుకు కొత్తగా వచ్చిన ఉద్యోగం వాళ్ల మధ్య కొత్త సమస్యలు తీసుకొస్తుందేమో అంటాడు పరందామయ్య.
మరోవైపు శృతి.. అనసూయ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. కడుపులో తిప్పుతోంది.. ఒక్కసారి వాంతి చేసుకుంటే ఏకంగా సీమంతమే చేసేలా ఉన్నారు అంటుంది శృతి. టెన్షన్ ఎందుకు శృతి. మన గురించి పట్టించుకునే వాళ్లు ఎవరు ఉన్నారు.. ఒక్క నానమ్మ, తాతయ్య తప్ప అంటాడు ప్రేమ్.
ఇవన్నీ లాస్య వింటుంది. మనకు పెళ్లయినా కలిసి కాపురం చేయడం లేదని అందరికీ తెలిసిపోకూడదని చెబుతుండగా లాస్య విని షాక్ అవుతుంది. ఈ విషయం నేను చెబుతాను కదా అని అనుకొని లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చివరకు తులసి, ప్రేమ మధ్య గొడవలు సృష్టిస్తుంది. ప్రేమ్ ను పిలిచి… అందరి ముందు నన్నెందుకు మోసం చేశావని తులసి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
This website uses cookies.