Home » Entertainment » Intinti Gruhalakshmi 14 January 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 14 Jan Today Episode : మరోసారి ప్రేమ్, శృతి ఫస్ట్ నైట్.. వసంత విషయంలో లాస్య, తులసి మధ్య గొడవ.. వసంతను బయటికి గెంటేసిన తులసి

Authored By
Varun G
The Telugu News | Published on: January 14, 2022, 10:10 am
Advertisement

Intinti Gruhalakshmi 14 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జనవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 529 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య.. డైరెక్ట్ గా తులసి దగ్గరికి వచ్చి.. ఏంటి తులసి అందరి పనులు చక్కదిద్దావా అంటుంది. దీంతో అందరి పనులు కాదు.. అన్ని పనులు చక్కదిద్దాను అంటుంది. ఆ తర్వాత కాసేపు ఇద్దరూ గొడవేసుకుంటారు. మాట అనేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకొని మాట్లాడు లాస్య. అయినా నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. వదిలేయ్.. అని చెప్పి వెళ్లబోతుండగా ఆగు తులసి అంటుంది లాస్య. నేను పడుకుంటాను కానీ.. నీకు నిద్రపట్టని ఒక విషయం నీకు చెబుతాను అంటుంది లాస్య. ఎప్పుడూ నా గురించి.. నందు గురించి తప్పితే నీ కొడుకులు ఏం చేస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్లను పట్టించుకున్నావా అంటుంది. నా కొడుకుల గురించి నాకు తెలుసు. వాళ్లెప్పుడూ నా గీత దాటరు అంటుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 14 january 2022 full episode

దీంతో పిచ్చి తులసి.. పెళ్లి వరకు మాత్రమే నీ కొడుకులు నీ మాట విన్నారు. ఆ తర్వాత వాళ్లు ఎప్పుడో నీ చేయి జారి పోయారు అంటుంది. సుఖపడతాడు కదా అని నీ చిన్న కొడుకుకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశావు. పెళ్లి అయితే చేశావు కానీ.. వాళ్లు సుఖపడటం లేదు తులసి. నిజం.. రేపో మాపో మనవడో మనవరాలో వస్తారని నువ్వు ఆశపడుతున్నావు. కానీ.. వాళ్లు మాత్రం అసలు కాపురమే చేయడం లేదు.. అని అసలు నిజం చెబుతుంది లాస్య. ఇంకొన్ని ప్రేమ్ మీద ఎక్కించి చెబుతుంది లాస్య. నీ ముందు ఒకలా.. నీ వెనుక ఒకలా నటిస్తున్నాను. నిన్ను నమ్మించాడు. కొడుకు విషయంలో నువ్వు ఓడిపోయావు తులసి. మోసపోయావు అంటుంది. దీంతో నేను నమ్మను అంటుంది తులసి. ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే నందును నీకు ఒప్పజెప్పి నేను నా దారి చూసుకుంటా అంటుంది లాస్య.

Advertisement

కోపంతో రగిలిపోయిన తులసి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. హాల్ లోకి వచ్చి కోపంతో ప్రేమ్ ను పిలుస్తుంది. ప్రేమ్ చెంప వాయిస్తుంది. చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు. అందరూ అక్కడికి వస్తారు. ఎందుకురా నన్ను మోసం చేశావు అంటుంది తులసి. చెప్పరా ఎందుకు ఈ అమ్మను మోసం చేశావు అని అందరి ముందు నిలదీస్తుంది తులసి.

ఏంటి తులసి వాడు ఏం తప్పు చేశాడు అంటే.. బతికుండగానే నన్ను చంపేశాడు.. అంటుంది. అన్నింటికీ తెగించి.. అందరినీ ఎదిరించి నీకు, శృతికి పెళ్లి చేశాను. నా బతుకులో లేని ఆనందం నీ బతుకులో ఉండాలనుకున్నాను. కానీ.. మీరు చేసిందేంటి.. పేరుగా భార్యాభర్తలుగా ఉన్నారు కానీ.. నిజంగా భార్యాభర్తలుగా ఉన్నారా అని నిలదీస్తుంది.

Advertisement

మీరిద్దరూ కలిసి కాపురం చేస్తున్నారా అని సూటిగా ప్రశ్నిస్తుంది తులసి. దీంతో ప్రేమ్, శృతి షాక్ అవుతారు. మీ వైవాహిక జీవితానికి న్యాయం చేస్తున్నారా అని ప్రశ్నిస్తుంది. చెప్పండి అని సూటిగా అడుగుతుంది తులసి. దీంతో ప్రేమ్ ఏం మాట్లాడడు.

Intinti Gruhalakshmi 14 Jan Today Episode : ప్రేమ్, శృతి కాపురం చేయట్లేదని వాళ్ల మీద సీరియస్ అయిన తులసి

అమ్మ.. అది అంటూ ఏదో చెప్పబోయే సరికి.. తన చేయి తీసుకొని తల మీద పెట్టి.. ఇప్పుడు చెప్పరా అంటుంది తులసి. దీంతో ఇంటి సభ్యులు అందరూ షాక్ అవుతారు. తన తల మీది నుంచి చేయి తీసి ఏం మాట్లాడడు ప్రేమ్. అదేమిటిరా.. పెళ్లి అయి ఇన్ని నెలలు అయినా దూరంగా ఉంటారా అంటుంది అనసూయ.

దీన్ని మోసం చేయడం అనరా అంటుంది తులసి. నాకొడుకుతో నిజం చెప్పించుకోవడానికి ఒట్టు వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీ అమ్మ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో తెలుస్తోంది అంటుంది. అమ్మ అనే పిలుపు వింటేనే విరక్తి పుట్టింది. నువ్వు ఈ అమ్మ దగ్గర ఈ విషయం దాచడమే నా గుండెను తొలిచేస్తుంది అంటుంది తులసి.

ఏమ్మా శృతి. నాలో అమ్మను చూసుకుంటా అంటావు కదా. విషయం దాచి నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా అంటుంది తులసి. మీరు అసలు ఒకరికి మరొకరు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒక ఆడపిల్లలను ఇంతలా బాధపెట్టాల్సిన అవసరం ఏంటి అంటుంది. దీంతో ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం ఆంటి అంటుంది శృతి.

Advertisement

దీంతో అసలు నిజం చెబుతాడు ప్రేమ్. నీ కోసమే మేము ఒకరికి మరొకరం దూరంగా ఉన్నాం. ఈ నిర్ణయం తీసుకుంది నీకోసమే. నువ్వు బాగు పడ్డాక మేము కలవాలనుకున్నాం. నీకంటూ ఓ స్థాయి వచ్చాక మేము భార్యాభర్తల్లా కాపురం చేయాలనుకున్నాం అంటాడు ప్రేమ్.

అవును ఆంటి.. మమ్మల్ని క్షమించండి అంటిం శృతి. సరే.. జరిగిందేదో జరిగింది. ఇక ఆలస్యం జరగకుండా వెంటనే వీళ్లకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయించండి అంటుంది అనసూయ. ఏమ్మా తొందరలోనే నన్ను నానమ్మను చేయాలి అంటుంది తులసి.

మరోవైపు తులసి ఒక్కతే ఎలా పనిచేస్తుందోనని అనుకుంటుంది వసంత. తన మాటలు విన్న లాస్య కోప్పడుతుంది. దీంతో వెంటనే టర్న్ అయి మీరు సార్ మీద చూపించే ప్రేమ గొప్పది మేడమ్. కానీ… సార్ మాత్రం ఎప్పుడూ వాళ్లతోనే ఎక్కువగా గడుపుతున్నారు అంటుంది వసంత.

కట్ చేస్తే.. శృతి, ప్రేమ్ ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు జరుగుతుంటాయి. మళ్లీ ఈ హంగామా అంతా ఎందుకు అంటుంది తులసి. ఆ తర్వాత లాస్య, తులసి మధ్య వసంత విషయంలో గొడవ జరుగుతుంది. వసంత ఈ ఇంట్లో ఉండకూడదు అని అంటుంది తులసి. నువ్వెవరు వసంత విషయంలో నిర్ణయం తీసుకోవడానికి అని ప్రశ్నిస్తుంది లాస్య. దీంతో ఇది నా ఇల్లు అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి