intinti gruhalakshmi 15 january 2022 full episode
Intinti Gruhalakshmi 15 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 జనవరి 2022 శనివారం ఎపిసోడ్ 530 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, లాస్య ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు కుటుంబ సభ్యులు. మళ్లీ ఇంత హంగామా అవసరమా అంటుంది శృతి. కానీ.. తనకు నచ్చజెప్పి ప్రేమ్ దగ్గరికి పంపిస్తారు. ప్రేమ్ తన కోసం వెయిట చేస్తుంటారు. ప్రేమ్ ను చూసి సిగ్గుపడుతుంది శృతి. ఇప్పుడేంటి.. నేను సిగ్గుపడుతూ తలవంచుకొని ఇక్కడే ఉండాలా అంటుంది. నువ్వే పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుపడుతూ నిలబడు.. నేనే నిన్ను మంచం మీదికి తీసుకెళ్తాను అంటుంది శృతి. నాతో చాలెంజా.. నేను రాను అని చెప్పి మంచం మీదనే కూర్చుంటాడు ప్రేమ్. ఇంతలో ఆడవాళ్లం కదా మేమే కాంప్రమైజ్ కావాలి అంటూ ప్రేమ్ దగ్గరికి వస్తుంది శృతి.
intinti gruhalakshmi 15 january 2022 full episode
బుంగమూతి పెడుతుంది. ఏంటి అలకా అంటాడు ప్రేమ్. అవును అంటుంది. పాలగ్లాస్ మధ్యలో పెడుతుంది. తన బుగ్గ కాలుతుంది. తనను వాటేసుకోబోతాడు. ప్రేమ్.. మనం అనుకున్నది ఒకటి.. జరుగుతున్నది మరొకటి కదా అంటుంది శృతి. ఏదీ మన చేతుల్లో లేదని తెలిసింది కదా అంటాడు ప్రేమ్. అమ్మకు తోడుగా మనం ఉండాలి. త్వరలోనే ఆ స్థాయికి మనం చేరుకోవాలి అంటాడు ప్రేమ్. నాకు కావాల్సింది కూడా అదే అంటుంది శృతి. అంతేనా ఇంకేం లేదా అంటే.. అంతే ఇంకేం ఉంటుంది అంటుంది శృతి. ఈ రూమ్ లోకి వచ్చే ముందు నానమ్మ నీకు ఏం టార్గెట్ ఇవ్వలేదా అని అడుగుతాడు ప్రేమ్. ఇచ్చింది.. ఆవిడ తెచ్చిన కుంకుమ పువ్వుకు న్యాయం చేయమని చెప్పింది అంటుంది. కుంకుమ పువ్వా అంటే అంటాడు. దీంతో అసలు విషయం చెబుతుంది.. దీంతో ఇక ఆగడు. రెచ్చిపోతాడు ప్రేమ్.
మరోవైపు లాస్య.. నైట్ డ్రెస్ వేసుకొని నందును రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. కానీ.. నందు తనను అస్సలు పట్టించుకోడు. తన పక్కన కూర్చున్నా కూడా పట్టించుకోడు. ఏంటి నన్ను అస్సలు చూడటం లేదు అని అడుగుతుంది. చూశానే అనుకో.. నువ్వేదో ఒకటి అంటావు.. ఆ తర్వాత ఏదో ఒక గొడవ ఇదంతా ఎందుకు అంటాడు నందు.
మళ్లీ మధ్యలో తులసి విషయం తీసుకొస్తాడు నందు. దీంతో తనకు కోపం వస్తుంది. నీ మనసు నన్ను అనుమానిస్తుందా అంటుంది. అది నా తప్పు కాదు.. అది నా మనసు తప్పు అంటాడు నందు. నీదగ్గర ప్రేమ లేదు.. అభద్రత ఉంది అంటుంది.
తులసి వల్ల నీకు అభద్రత ఉంది.. కానీ అది నువ్వు ఒప్పుకోవు అంటాడు నందు. దీంతో లాస్యకు ఏం అర్థం కాదు. మరోవైపు అనసూయతో వసంత గొడవ పెట్టుకుంటుంది. ఇద్దరూ కొట్టుకుంటారు. దీంతో మధ్యలో వస్తుంది తులసి. వసంత.. ఎందుకు ఆమెతో గొడవ పెట్టుకుంటున్నావు అంటుంది.
ముసలిది.. గిసలిది అంటూ ఏదేదో మాట్లాడుతుంది అనసూయ గురించి. దీంతో వసంతకు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది తులసి. ఆ తర్వాత వసంత వెళ్లి అనసూయ కూర్చునే సోఫాలో పడుకుంటుంది. మళ్లీ అనసూయ వచ్చి ఇక్కడ పడుకుంటావా అంటూ కొప్పడుతుంది.
దీంతో మరోసారి వసంతపై సీరియస్ అవుతుంది తులసి. ఇంతలో అందరూ వస్తారు. ఆ గొడవ కాస్త లాస్య, తులసి వరకు పోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.