
intinti gruhalakshmi 15 june 2022 full episode
Intinti Gruhalakshmi 15 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 659 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శృతి, ప్రేమ్ ఇద్దరూ మాల్ లో ఐస్ క్రీమ్ పోటీ పెట్టుకుంటారు. కానీ.. శృతి మాత్రం ప్రేమ్ ను తిననీయకుండా ఐస్ క్రీమ్ కప్పును పట్టుకుంటుంది. తర్వాత కప్పు మొత్తాన్ని ఒకేసారి తాగేసి నేనే గెలిచాను అంటాడు ప్రేమ్. దీంతో పో.. ఇది చీటింగ్ అంటుంది. తర్వాత శృతిని బుజ్జగిస్తాడు ప్రేమ్. మరోవైపు తులసి, పరందామయ్య, అనసూయ, దివ్య.. అందరూ వీడియో గేమ్స్ జోన్ లోకి వెళ్తారు. ఇవి మాకెక్కడ వస్తాయి. నువ్వు, తాతయ్య ఆడుకోండి అంటుంది తులసి. కానీ.. లేదు లేదు.. మీరు కూడా ఆడాలి. అందరూ ఆడాల్సిందే అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి మరీ వీడియో గేమ్స్ నేర్పిస్తుంది దివ్య.
intinti gruhalakshmi 15 june 2022 full episode
దీంతో అందరూ వీడియో గేమ్స్ లో మునిగిపోతారు. మరోవైపు అదే మాల్ కు లక్కీని తీసుకొని నందు కూడా వస్తాడు. మనం ఇలా షాపింగ్ మాల్ కు వస్తున్నట్టు మమ్మీకి చెప్పొద్దన్నావు కదా.. ఒకవేళ తెలిస్తే మమ్మీకి కోపం వస్తుందేమో అంటాడు నందు. దీంతో మమ్మీకి చెబితే నాకు 100 రూల్స్ పెడుతుంది. అందుకే.. చెప్పొద్దు అన్నాను. మమ్మీ ఇంటికి వచ్చేలోపు మనం ఇంటికి వెళ్లిపోదాం అంటాడు లక్కీ. ఇంతలో నందు ఫోన్ కు లాస్య ఫోన్ చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. దీంతో నువ్వే ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడుతావో చెప్పు అంటాడు. దీంతో లక్కీ ఫోన్ ఎత్తి.. అంకుల్ కు బోర్ కొడుతోందంటే.. నేనే మాల్ కు తీసుకొని వచ్చాను.. అంటాడు లక్కీ. సరే.. ఒకసారి నందుకు ఫోన్ ఇవ్వు అంటాడు. దీంతో నందుకు ఫోన్ ఇస్తాడు లక్కీ. దీంతో చాలా మంచి పని చేశావు. నేను కూడా వస్తున్నాను మాల్ కు అంటుంది లాస్య.
మరోవైపు ఐటీ లక్కీ ట్రావెల్స్ వాళ్లు నందు దగ్గరికి కూడా వస్తారు. దీంతో వాళ్లకు తన డిటెయిల్స్ ఇస్తాడు నందు. ఇంతలో గేమ్స్ జోన్ కు వెళ్దాం అంటాడు లక్కీ. మరోవైపు అభి, అంకిత.. ఇద్దరు కూడా అదే మాల్ కు వస్తారు. వాళ్లు కూడా ఐటీ ట్రావెల్స్ వాళ్ల లక్కీ కూపన్ ను నింపుతారు.
కట్ చేస్తే.. గేమ్స్ జోన్ లోకి వస్తారు నందు, లక్కీ. అక్కడ నందు.. తులసిని చూస్తాడు. తులసిని చూశాడంటే లక్కీ వదిలిపెట్టడు. వీళ్లిద్దరిని ఒక చోట లాస్య చూసిందంటే నన్ను వదిలిపెట్టదు అనుకొని మనం షాపింగ్ కు వెళ్దాం అంటాడు నందు.
ఇంతలో దివ్య.. లక్కీని చూసి హాయ్ లక్కీ అని పిలుస్తుంది. దీంతో లక్కీ తులసి దగ్గరికి వెళ్తాడు. మరోవైపు అంకిత, అభి.. ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తారు. తను కొన్ని డ్రెస్సులు వేసుకొని ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయి అని అడుగుతుంది. కానీ.. గేమ్స్ ఆడుతూ… ఆ డ్రెస్సులను చూడకుండానే బాగున్నాయి అంటాడు.
మరోవైపు మాల్ మొత్తం తిరుగుతూ ఉంటారు ప్రేమ్, శృతి. తను వేసుకొని వచ్చిన డ్రెస్ నే చూపిస్తూ ఇది ఎలా ఉంది అని అడుగుతుంది. దీంతో ఇది అయితే అల్టిమేట్ అని అంటాడు అభి. ఇది సూపర్బ్ గా ఉంది అంటాడు. దీంతో తనకు కోపం వస్తుంది.
తనను పరిగెత్తిస్తూ బయటికి తీసుకొస్తుంది. అక్కడ ప్రేమ ను ఢీకొంటాడు అభి. ఇద్దరూ తారసపడతారు. అతడిని కౌగిలించుకోబోయి మళ్లీ ఆగుతాడు. ఏమైందిరా అని అంటాడు అభి. నువ్వు కనబడ్డావని మరిచిపోయి.. నా స్థాయిని కూడా మరిచిపోయాను అంటాడు ప్రేమ్.
ప్రేమ్ కు హెల్ప్ చేయడానికి అభి రెడీగా ఉన్నాడు శృతి అంటుంది అంకిత. తన సమస్య తీర్చడానికి అభి కూడా ఓకే అన్నాడు అనగానే ప్రేమ్ కు ఏం మాట్లాడుతున్నరో అర్థం కాదు. దీంతో తులసి ఆంటి నీతో మాట్లాడటం లేదు కదా.. అదే విషయం గురించి తను మాట్లాడుతోంది అంటుంది అంకిత.
మీరందరూ నా మీద చూపిస్తున్న కన్సర్న్ కు థాంక్స్. కానీ.. అమ్మకు నిజంగా నాతో మాట్లాడాలని ఉంటే తనే మాట్లాడుతుంది. నా కోసం మీరేమీ వకల్తా పుచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటాడు ప్రేమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.