
intinti gruhalakshmi 15 march 2022 full episode
Intinti Gruhalakshmi 15 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 580 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్య.. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి నాకు భోజనం వడ్డించు అని రాములమ్మతో అంటుంది. కానీ.. రాములమ్మ కూడా వడ్డించదు. దీంతో తనే వడ్డించుకుంటూ ఉంటుంది. ఇంతలో లాస్య, నందు వస్తారు. వావ్.. దివ్య అన్నం తింటోంది అంటూ సంతోషిస్తాడు నందు. దీంతో ఇదంతా లాస్య ఆంటి వల్లనే అంటుంది దివ్య. ఇక నుంచి నాకు డాడీ, లాస్య ఆంటి.. వీళ్లిద్దరూ ఉంటే చాలు అంటుంది దివ్య. నేను ఇక నుంచి డాడీ పర్మిషన్ మాత్రమే తీసుకుంటాను. నాకు ఇంకెవరి పర్మిషన్ అవసరం లేదు అంటుంది దివ్య.
intinti gruhalakshmi 15 march 2022 full episode
వావ్.. సూపర్ గా చెప్పావు దివ్య. ఆకలితో ఉన్నట్టున్నావు. ఉండు.. నేను వడ్డిస్తాను అని చెప్పి దివ్యకు భోజనం వడ్డిస్తుంది లాస్య. దీంతో దివ్య భోజనం చేస్తుంది. మరోవైపు తులసి మాత్రం ఏడుస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లాస్య, దివ్య ఇద్దరూ సంతోషంగా ఉంటారు. తులసి మాత్రం చాలా బాధగా ఉంటుంది. అందరికీ తల్లిప్రేమ అచ్చిరాదు దివ్య అంటుంది లాస్య. భోం చేసిన తర్వాత డాడీ.. మీరు రేపు ఇంట్లోనే ఉండాలి. రేపు మా ఫ్రెండ్స్ వస్తున్నారు. మిమ్మల్ని పరిచయం చేస్తాను అంటుంది దివ్య. దీంతో కేఫె మానేయడం కష్టం అంటాడు. లాస్య తోడుగా ఉంటుంది నీకు. ఏం కావాలన్నా చేసి పెడుతుంది అంటాడు నందు. దీంతో సరే దివ్య నేను నీ తోడుగా ఉంటాను అంటుంది లాస్య.
నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి దివ్య అంటంది లాస్య. దీంతో మీరు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటే నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను అంటుంది దివ్య. దీంతో నేను నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాను.. ప్రామిస్ అంటుంది లాస్య.
మరోవైపు మాధవికి ఫోన్ చేస్తుంది తులసి. మాట్లాడాలనిపించింది అందుకే డిస్టర్బ్ చేశాను అంటుంది తులసి. వాడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది తులసి. అడిగేది నిన్నే అంటుంది. నేను అడిగేది అన్నయ్య గురించి కాదు.. నువ్వు ప్రేమ్ దగ్గరికి వెళ్లావని నాకు తెలుసు మాధవి అంటుంది తులసి.
దీంతో మాధవి షాక్ అవుతుంది. మీ అన్నయ్య చెప్పాడా అంటుంది మాధవి. చెప్పింది అన్నయ్య కాదు నువ్వే అంటుంది తులసి. దీంతో నేనా.. నేనెప్పుడు చెప్పాను అంటుంది. దీంతో నేను ఏదో అనుమానంతో అడిగాను కానీ.. నువ్వే ఇప్పుడు చెప్పేశావు అంటుంది తులసి.
వాళ్లిద్దరూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది తులసి. దీంతో ఎందుకు అని అడుగుతుంది. తెలిస్తే చూడాలనిపిస్తుంది. వెళ్లాలనిపిస్తుంది.. అంటుంది తులసి. వాడు ఎలా ఉన్నాడో తెలుసుకొని కూడా నేను ఏం చేయలేను.. బాధపడటం తప్ప.. అంటుంది తులసి.
తులసితో మరోసారి పోట్లాడుతుంది దివ్య. నువ్వు నాకు ఇంకా నచ్చజెప్పాలని ప్రయత్నించకు మామ్ అంటుంది దివ్య. తల్లి అరిచినంత మాత్రాన అది ద్వేషం కాదు.. శిక్షించినంత మాత్రాన అది కోపం కాదు. బిడ్డ బాగు కోసమే అని నువ్వు అర్థం చేసుకో. తల్లి బాధను అర్థం చేసుకునే వయసు కాదు నీది అంటుంది తులసి.
ఒక్కసారిగా నీ పిల్లల మీద నీకు ఇంత విరక్తి ఎందుకు కలిగింది మామ్ అని అడుగుతుంది తులసి. దీంతో పర్లేదు మామ్.. ప్రేమ్ అన్నయ్యలాగే నా బతుకు నేను బతుకుతాను. నువ్వు పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఫీల్ అవ్వను.. అస్సలు ఫీల్ అవ్వను అంటుంది దివ్య.
మరోవైపు పడుకోవడం కోసం పక్క వేస్తాడు ప్రేమ్. నువ్వు కూడా నా వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నావో అంటాడు ప్రేమ్. దీంతో అలా అన్నావంటే.. నేను ఆంటి దగ్గరికి వెళ్లిపోతాను అంటుంది శృతి. సరే.. ఇంట్లో ఉడకబోస్తుంది కదా.. ఓపెన్ ఏసీలో పడుకుందాం అని ఇంటి బయట చాప వేసి ఇక్కడ పడుకుందాం అంటాడు ప్రేమ్.
నీకో విషయం తెలుసా శృతి. చిన్నప్పుడు కూడా మేము ఇలాగే ఆరుబయట పడుకునే వాళ్లం. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా. ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు లేవు.. పక్కన అమ్మ లేదు అంటాడు ప్రేమ్. దీంతో నేను ఉన్నాగా.. కాసేపు మీ అమ్మనే అనుకో. రా.. నా ఒడిలో తల పెట్టి పడుకో అంటుంది శృతి.
గడుస్తున్న కాలం కొత్త బంధాలను అందిస్తూ మురిపిస్తూ ఉంటుంది. పాత బంధాలను దూరం చేస్తుంది. దేవుడు నా వాళ్లను అందరినీ తీసుకెళ్లాడు. నీతో జీవితం పంచుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఏదో ఒకరోజు ఆంటి.. మనల్ని పిలుస్తుంది.. అంటుంది శృతి.
అమ్మ మనల్ని పిలిచే లోపు నేను పెద్ద స్థాయిలో ఉండాలి. రేపు ఒక మ్యూజిక్ డైరెక్టర్ పిలిచాడు. అది ఓకే అయితే.. మన జీవితం మారిపోతుంది అని చెబుతాడు ప్రేమ్. కట్ చేస్తే ఉదయం అవుతుంది.. తులసి ఫ్యాక్టరీకి వెళ్లబోతుండగా నందు ఆపుతాడు.
దివ్య.. ఫ్రెండ్స్ ఈరోజు వస్తున్నారు అని చెప్పింది కదా.. నువ్వు ఉండి అన్ని చూసుకుంటే బెటర్ అంటాడు. దీంతో లాస్య ఉంటుంది అని చెప్పింది కదా అంటుంది తులసి. దీంతో లాస్యకు వంట చేయడం రాదని తెలుసు కదా. నువ్వు ఉండి వంట పని చేస్తే దివ్య ఫ్రెండ్స్ ముందు ఇబ్బంది ఉండదు అంటాడు నందు.
నాకు అవసరం లేదు.. అంటుంది తులసి. ఇన్నాళ్లకైనా ఓ జీవిత సత్యం తెలుసుకున్నాను. నిజంగా నా అవసరం ఉంటే దివ్యను వచ్చి చెప్పమని చెప్పండి.. ఆగిపోతాను. ఎవరికి ఎంత ప్రేమ అవసరమో అంతే ఇవ్వాలి.. అంతకు మించి ఇస్తే ఆ ప్రేమను కోల్పోతుంది అని చెప్పి తులసి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత దివ్య తన ఫ్రెండ్స్ ను తీసుకొచ్చి రచ్చ రచ్చ చేస్తుంది. పుడ్ ఆర్డర్ చేసి వేస్ట్ చేస్తుంది. చాలా ఫుడ్ వేస్త్ చేయడంతో తులసి వచ్చి దివ్యపై సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.