#image_title
Intinti Gruhalakshmi 16 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 16 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1076 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీ మీద నందు కోపం చూపించడంతో చిన్నపిల్ల మీద ఏంటి మీ పత్రాపం అని తులసి కొప్పడుతుంది. దీంతో అసలు విషయం చెబుతాడు నందు. మన ఫ్యామిలీని ఆ రాజ్యలక్ష్మి బతకనివ్వదని.. హనీని ఇచ్చేయాలని చెబుతాడు. దీంతో వాళ్లకు భయపడేది ఏంటి. నేను ఏం చేయాలో నాకు తెలుసు. హనీని ఎట్టిపరిస్థితుల్లోనూ వాళ్లకు ఇవ్వను. వాళ్లకు ఇస్తే వాళ్లు హనీని చంపేస్తే ఎలా అని తులసి భయపడుతుంది. హనీని వాళ్లు ఏం చేసుకుంటే మనకెందుకు.. హనీని వాళ్లు ఇచ్చే బాధ్యత మనది. మన ఫ్యామిలీ ముఖ్యం అంటాడు నందు. అలా ఎలా మాట్లాడుతున్నారు. హనీని వాళ్లకు ఇచ్చేసి మనం సంతోషంగా ఉంటే సరిపోయిందా అని తులసి కోప్పడుతుంది.
ఆ తర్వాత నేరుగా రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్లి అక్కడ లాస్యను చూసి షాక్ అవుతుంది తులసి. అసలు మాస్టర్ మైండ్ నువ్వా? దీని వెనుక ఉన్నది నువ్వేనా? అసలు విషయం తెలియక నేను భయపడ్డాను. మొత్తం నడిపించేది నువ్వే అన్నమాట. హనీ విషయంలో కానీ.. నా ఫ్యామిలీ విషయంలో కానీ ఇంకోసారి ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉండదు.. అంటూ లాస్య, రాజ్యలక్ష్మి ఇద్దరికీ వార్నింగ్ ఇస్తుంది తులసి. నీ వార్నింగ్ కు ఎవ్వరూ భయపడరు. నువ్వు, నీ ఫ్యామిలీ జాగ్రత్త. నీ ఫ్యామిలీకి ఏం జరిగినా అది నీకే నష్టం అని లాస్య వార్నింగ్ ఇస్తుంది. అయినా కూడా తులసి భయపడదు. నా ఫ్యామిలీని, హనీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని అంటుంది తులసి.
#image_title
మరోవైపు విక్రమ్.. దివ్యతో కాస్త రొమాంటిక్ మూడ్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరూ కలిసి కాసేపు రొమాన్స్ చేసుకుంటారు. ఆ తర్వాత జాను గురించి విక్రమ్ తో మాట్లాడుతుంది దివ్య. జానుకు వెంటనే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని చెబుతుంది దివ్య.
దీంతో జానుకు పెళ్లా.. అది మనకెందుకు.. అమ్మ చూసుకుంటుంది కదా అని విక్రమ్ అంటాడు. దీంతో ఎవ్వరూ చూసుకోరు. ఎవ్వరూ పట్టించుకోరు. ఆ పని మనమే చేద్దాం అంటుంది దివ్య. ఈనిర్ణయం వెనుక కారణం ఏమైనా ఉందా అంటే జాను నిన్ను ఇష్టపడుతోంది అని అంటుంది దివ్య.
దీంతో విక్రమ్ షాక్ అవుతాడు. చిన్నప్పటి నుంచి ఆ ఇష్టం ఉంది అంటాడు. దీంతో ఆ ఇష్టం వేరు.. ఈ ఇష్టం వేరు.. తను నీ మీద మనసు పడుతోంది అంటుంది దివ్య. దీంతో నువ్వేదో పొరపాటు పడుతున్నావు. జాను చిన్నపిల్ల అంటాడు విక్రమ్. దీంతో అస్సలు కాదు. దానికి తోడు ఇంట్లో వాళ్లు చెడగొడుతున్నారు అని అంటుంది దివ్య. అందుకే జాను పెళ్లి చేద్దాం అంటుంది.
మరోవైపు రాత్రి తులసి, హనీ, నందు ముగ్గురూ డిన్నర్ కు వెళ్తారు. పరందామయ్య, అనసూయ ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు. ఇదే అదునుగా భావించిన లాస్య వాళ్ల మీద అటాక్ చేయించాలని అనుకుంటుంది. రాత్రి పూట ఇద్దరు ముసలివాళ్లను ఒంటరిగా వదిలేసి మీరేంటి జాలీగా డిన్నర్ కు బయటికి వచ్చారు. పాపం అవతల వాళ్లు ప్రమాదంలో ఉన్నారు అక్క అంటుంది లాస్య.
తన ఇంటికి రౌడీలను పంపించి.. కరెంట్ కట్ చేయించి.. వాళ్లను చంపించే ప్రయత్నం చేస్తుంది లాస్య. రౌడీలు ఇంట్లోకి జొరబడి పరందామయ్య, అనసూయను భయపెడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.