Intinti Gruhalakshmi 17 Dec Today Episode : తులసికి క్యాన్సర్ సెకండ్ స్టేజ్.. రెండు రోజుల్లో సర్జరీ చేయకపోతే డేంజర్.. మరోవైపు లాస్య, నందు పెళ్లి

Advertisement
Published by
Advertisement

Intinti Gruhalakshmi 17 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 505 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా తప్పు వల్ల నేను నా కొడుకుకు దూరం అవుతున్నాను. నువ్వు నీ అందమైన జీవితానికి దూరం అవుతున్నావు. నన్ను క్షమించు అమ్మా.. అంటుంది అనసూయ. దీంతో అత్తయ్య కాసేపు మీ ఒడిలో తల పెట్టుకొని పడుకోవచ్చా.. అమ్మ గుర్తొచ్చింది అంటుంది తులసి. దీంతో అనసూయ.. తులసిని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. అమ్మా తులసి. నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెబుతావా అని అడుగుతుంది. చెప్పండి అత్తయ్య అంటుంది. నందు, లాస్యను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటుంది. నా ఇష్టాఇష్టాల మీద ఏముంటుంది అంటుంది తులసి. ఒకవేళ నందు.. లాస్యను వద్దనుకొని నీ దగ్గరికి తిరిగి వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది అనసూయ. దీంతో నేను అనేదాన్ని ఉంటే కదా.. కంచికి వెళ్లిన కథ ఇక అటే.. అంటుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 17 december 2021 full episode

కట్ చేస్తే తులసి ఫైనల్ రిపోర్ట్ ను తీసుకొచ్చి నర్సు.. డాక్టర్ అద్వైత కృష్ణకు ఇస్తుంది. ఆ రిపోర్ట్ చూసే ముందు డాక్టర్ కూడా టెన్షన్ పడతాడు. తులసి అదృష్టం ఎలా ఉండబోతుందో అని అనుకుంటాడు డాక్టర్. కట్ చేస్తే తులసి.. కృష్ణుడి దగ్గరికి వచ్చి మొక్కుతుంది. భగవంతుడా.. మంచికో చెడుకో.. ఈ పరిస్థితుల్లో నీదగ్గర ఉండేలా చేసుకున్నావు. నా ఆరోగ్యం కూడా తొందరగా నయం అయ్యేలా చూడు స్వామి అంటుంది. ఇంతలో డాక్టర్ కృష్ణ వస్తాడు. బాధపడుతూ వస్తాడు కృష్ణ. మీకోసమే వచ్చాను నేను అంటుంది తులసి. నా రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతుంది తులసి. దీంతో ఫైల్ ఇస్తాడు. నాకు చదవడం చేతకాదండి.. చదివి చెప్పండి అంటుంది. నాకింకా ఎంత టైమ్ ఉంది అని అడుగుతుంది. దీంతో కృష్ణ ఏం మాట్లాడడు. నీకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ లో ఉంది అంటాడు. దీంతో ఇది ఇంతకుముందే చెప్పారు కదా అంటుంది. నయం అవుతుంది కదా అంటుంది. సర్జరీ చేయాలి.. అది కూడా వెంటనే చేయాలి అంటాడు డాక్టర్.

Advertisement

క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అన్నా కూడా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు అంటాడు డాక్టర్. విడాకులు తీసుకున్నప్పుడే ఎంతో గుండె నిబ్బరంగా ఉన్నాను. ఇదో లెక్కా అంటుంది తులసి. రెండురోజుల్లో ఆపరేషన్ చేయాలి అంటాడు డాక్టర్. డబ్బులు లేవు.. అంటుంది. ఇప్పుడు అవసరం లేదు. తర్వాత ఇవ్వండి అంటాడు డాక్టర్. ఆ ఫైల్ తీసుకొని ఇంటికి వస్తుంది తులసి.

గార్డెన్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తన క్యాన్సర్ గురించే టెన్షన్ పడుతుంది. ఇంతలో ఇంట్లోకి వెళ్తుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్లకు ఈ విషయం ఎలా చెప్పాలా అని అనుకుంటుంది. ఇంతలో ఇప్పటి వరకు ఒక జోక్ జరిగింది. నేను చెబుతాను అంటుంది దివ్య. కాదు నేను చెబుతాను.. నేను చెబుతాను అంటారు.

మీరు కాదు.. నేను చెబుతాను జోక్. ఆ జోక్ కి మీరంతా నవ్వాలి. కానీ.. నాకు మీరు ఒక మాట ఇవ్వాలి. మీరంతా ఆ జోక్ కి నవ్వాలి అని చెబుతుంది. దీంతో వాళ్లంతా మాటిస్తారు. మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. నాకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ లో ఉందన్నారు అంటుంది తులసి. దీంతో అందరూ ఏడుస్తారు.

Intinti Gruhalakshmi 17 Dec Today Episode : ఓవైపు లాస్య పెళ్లి కార్డు.. మరోవైపు తులసికి రెండు రోజుల్లో సర్జరీ

దీంతో అందరూ నవ్వుతానని మాటిచ్చి ఇలా కళ్లలో నీళ్లు పెట్టుకుంటారేంటి అని అడుగుతుంది. అందరూ ధైర్యంగా నవ్వాల్సిందే అంటుంది తులసి. మిమ్మల్నే అడిగేది.. నవ్వుతారా నవ్వరా అంటుంది. నేను మిమ్మల్ని ఒక చిన్న నవ్వు నవ్వమని అడిగా అంటుంది. ఈ అమ్మ కోసం ఆమాత్రం చేయలేరా అంటుంది తులసి.

నాకు ఏం కాదు.. నేను చక్కగా బతుకుతాను అని అనుకునే వాళ్లు నవ్వండి. నమ్మకం లేనివాళ్లు కన్నీళ్లు పెట్టుకోండి అంటుంది తులసి. ఎల్లుండి నాకు సర్జరీ చేస్తారు. సర్జరీ అయ్యేంతవరకు అందరూ ఇలాగే ఉండాలి. నాకు మాటివ్వండి అని అంటుంది తులసి. దీంతో అందరూ మాటిస్తారు.

ఇంతలో లాస్య, నందు.. ఇద్దరూ ఇంటికి వస్తారు. ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు. మా పెళ్లి గురించేనా అంటుంది లాస్య. తమ వెడ్డింగ్ కార్డు తీసుకొని వస్తుంది. సంగీత్ గ్రాండ్ గా జరగాలి.. ఆ బాధ్యత నీదే తులసి అంటుంది. అత్తయ్య మీకే మొదటి కార్డు ఇద్దామనుకుంటున్నాను అంటుంది. అందరినీ పిలిచి మా పెళ్లిని గ్రాండ్ గా చేసుకుందామనుకున్నా కానీ.. ఎవ్వరూ వద్దు.. కేవలం ఇంట్లో వాళ్ల మధ్యనే మన పెళ్లి జరగాలి అన్నాడు.. అంటుంది లాస్య.

అందుకే.. మీరే మా పెళ్లి పెద్దలు అంటుంది లాస్య. తులసికి కార్డు చూపిస్తుంది. కార్డు ఎలా ఉంది అని అడుగుతుంది లాస్య. చాలా బాగుంది కార్డు అంటుంది తులసి. తులసి నువ్వే దగ్గరుండి మా పెళ్లి చేయించాలి అంటుంది లాస్య. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా తులసి అంటాడు నందు.

నా సంతోషం కోసం కాదు.. నీ సంతోషం కోసం కాదు. లాస్య జీవితం కూడా నాలా కాకూడదని అన్నాను. లాస్యకు నాలా గుండె ధైర్యం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? రెండు రోజుల్లో అమ్మకు ఆపరేషన్. క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అని అందరూ చెబుతారు. దీంతో నందు షాక్ అవుతాడు.

కట్ చేస్తే తులసి తన రూమ్ లోకి వెళ్లి తన గతాన్ని ఓసారి గుర్తు చేసుకుంటుంది. ఇంతలో నందు అక్కడికి వస్తాడు. బాగుంది కదండి అంటుంది. మీకో గమ్మత్తు చెప్పనా. ఒకప్పుడు నా మాటలు మీకు మొండితనంగా అనిపించేవి. మీకు కోపం వచ్చేది. ఆ కోపమే విడాకుల వరకు తీసుకెళ్లింది.

కానీ.. ఇప్పుడు విడాకులు తీసుకున్నాక.. నేను చెప్పినట్టు చేశారు. లాస్యతో పెళ్లికి ఒప్పుకున్నారు. భలే ఉంది కదా అండి అంటుంది తులసి. కోపంతో తులసి చేతుల్లో ఉన్న పెళ్లి శుభలేఖను తీసుకొని చించేస్తాడు. దీంతో తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

2 days ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

3 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

3 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

3 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

3 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

3 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

3 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

3 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

4 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

4 days ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

4 days ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

4 days ago